స్వాధ్యాయ సందోహం

స్వాధ్యాయ సందోహం-188

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హిందీ మూలం: స్వామీ వేదానంద తీర్థ
తెలుగు అనువాదం: డా పాలకోడేటి జగన్నాథరావు 9490620512
*

అలాగే ఎవడూ తయారుచేయకపోతే ఈ విశ్వమంతా ఎక్కడనుండి వచ్చింది? అనంత సృష్టిలోని ఈ సమ్సత వస్తుజాలాన్నంత ఒక క్రమపద్ధతిలో నడిపిస్తూ సంరక్షిస్తూ ఉన్న ఆ మహావ్యక్తి తప్పక అనంత శక్తివంతుడని అందరూ అంగీకరించాలి. అందుచేత సృష్టిలో శక్తిసంపన్నుడు కావాలని తలంచే ప్రతి జీవి ఆ అనంత శక్తిసంపన్నుని పూజించాలి, ప్రార్థించాలి అని వేదం సాస్యుక్థ్యః ‘‘అట్టి సృష్టికర్తవగు నీవే ప్రశంసనీయుడవు- పూజార్హుడవు’’ అని ఆది దేవుని ప్రశంసించింది.
***
సోమరసాన్ని ఎలా పిండాలి?
న మాం తమన్న శ్రమన్నోత తంద్రన్న వోచామ మా సునోతేతి సోమమ్‌
యో మే పృణాద్యో దదద్యో నిబోధాద్యో మా సున్వంతముప గోభిరాయత్‌॥
భావం:- సంతృప్తిని, సావధానతను కలిగిస్తూ సర్వప్రదాయినియై గోవులతో కూడినవానిగా సోమరసాన్ని పిండేవాని వద్దకు ఏ సోమరసం నన్ను చేరుస్తున్నదో ఆ సోమరసం నాలో ఆవేశాన్ని, శ్రమను, సోమరితనాన్ని కలిగించడం లేదు. కావున సోమరసాన్ని పిండవద్దని ఎవరితోనూ కూడ చెప్పజాలం.
వివరణ:- సోమరసపాన మహిమను గూర్చి ఈ మంత్రం సంభాషణాత్మకంగా వివరిస్తూంది. సోమరసాన్ని త్రాగు. త్రాగను. ఎందుకు? ‘న మాతమత్’ ‘‘్భవావేశపరచుట లేదు’’. అందువలన త్రాగను. సోమరసాన్ని చాలా శ్రమపడి పిండాము. తప్పక త్రాగు. ‘న శ్రమత్’ ననే్నమీ ఏ విధంగా శ్రమకలిగించలేదు. మైమరపు కలిగిస్తుంది. వద్దనక త్రాగవయ్యా. చాలు చాలు ‘నోత తంద్రత్’ మైమరపు కాదు. కనీసం కునుకుపాటు కూడా రాలేదు.
అయితే సోమరసాన్ని పిండటం మానివేయమంటావా? ‘న వోచామ మా సునోతేతి సోమమ్’ వద్దువద్దు. మేమలా చెప్పం? నీకు సోమరస పానం వలన సుఖమేదో కలుగుతూ ఉన్నట్టు ఉంది. నీవు పిండుకొని త్రాగు. నాకు మాత్రం ‘యో మే పృణాత్’ నాకు తృప్తిని కలిగించిన దానినే నేను కోరుకొంటాను. సోమరసం తృప్తిని కలిగిస్తుంది. ‘యో దదత్’ కొంచెం మైమరపు ఇస్తుంది. కాని నేను కోరేదది కాదు. ‘యో నిబోధాత్’ నన్ను సదా జాగృతపరచాలి. పొరపాట్లకు, సోమరితనాలకు నేనెప్పుడో వశమయ్యాను. నిద్రించి నిద్రించి విసిగిపోయాను.
మరిప్పుడు నేనేమి చేయమంటావు? నేను సోమరసాన్ని పిండి తయారుచేస్తాను. ఎందుకు? ఎలా? ‘యో మ సున్వంతముప గోభిరాయత్’ ‘‘అతడు ఆవులను తీసుకొని వస్తే నేను సోమరసాన్ని పిండుతాను’’ ఏమిటి చేస్తున్నావు? అందమైనవి, శబ్ద క్షీరాన్ని ఇచ్చేవి, రుచికరమైనవి మరియు పరిమళ భరితమైన పాలనిచ్చే ఆవులు కావాలా? సరే. ఇంతేనా? నీవా పాలతో కాయాకల్పం (వృద్ధాప్యం రాకుండా ఔషధాలతో తయారుచేసే చికిత్స) చేయాలనుకొంటున్నావా? సరే. సోమలత ఆ విధంగా చేయగలదు. కాని పిండిన సోమరసాన్ని త్రాగిన పిమ్మట అది సిద్ధిస్తుంది. అయితే నాకు మాత్రం సోమరసం పిండే సమయంలోనే కాయకల్ప యోగం కలగాలి. నాకెట్టి సోమరసం కావాలో గుర్తించావా? నా సోమరసం జాగృతం చేస్తుంది. నీది నిద్రపుచ్చుతుంది. నీ రసం శరీరాన్ని కాయాకల్పం చేస్తుంది. నా బుద్ధిని కాయాకల్పం చేస్తుంది. అంటే ఉత్సాహపరుస్తుంది.
అయితే సోమరసాన్ని పిండటం నిలిపివేయమంటావా! వద్దు. వద్దు ‘న వోచామ’ మేమలా చెప్పం. ఎందుకంటే ‘మహా అసున్వతో వధః’ (ఋ.8-62-12) ‘‘సోమ రసాన్ని పిండనివానికి మహా హత్యాపాపం సిద్ధిస్తుంది. ‘‘్భరి జ్యోతీంషి సున్వతః’’ (ఋ.8-62-12) ‘‘సోమరసాన్ని తయారుచేసే వానికి గొప్ప తేజస్సు ఏర్పడుతుంది.’’ నాకు తేజస్సు కావాలి. నీకో! గోవులు కావాలి. అప్పుడా పృచ్ఛకుడికి తేజస్సు తనకూ కలగాలని కోరిక కలిగింది. నిజానికి గోవులు- తేజస్సూ రెండూ ఒకటే. ఎలాగంటే- గోభిష్టరే మామతిం దురేవామ్ (ఋ.10-44-10) గోవుల ద్వారా మేము ‘‘ఆకర్మణ్యత నుండి తొలగిపవుదుము గాక’’ ఈ కోరిక నీ గోవు వలన సిద్ధించదు. జ్ఞానమే గోవు. దానివల్లనే సాధ్యపడుతుంది. అదే దుర్గతి- బుద్ధిహీనత- నాస్తికత్వాలను గూర్చి తెలియపరచి వాని నుండి దూరం చేయగలదు.
**
నా బుద్ధి కర్మశీలి యగుగాక!
కిమంగ త్వా మఘవన్ భోజమాహుః శిశీహి మా శిశయం త్వాశ్రుణోమి
అప్నస్వతీ మమ ధీరస్తు శక్ర వసువిదం భగమింద్రా భరా న.॥
భావం:- ప్రియమైన దైవమా! జనులు నిన్ను జీవులన్నింటిని పోషించి రక్షించేవాడవని ఎందుకు చెబుతున్నారు? నన్ను దయతో వెంటనే సంరక్షించు. నీవు వెనువెంటనే జీవులను సంరక్షించేవాడవని విన్నాను. నా బుద్ధిని సదా కర్మశీలిగా ప్రచోదనం చేయి. ఓ శక్తిశాలీ! ఓ ఐశ్వర్యశాలీ! మేము ధనాన్ని పొందగల భాగ్యాన్ని మాకు అనుగ్రహించు.

ఇంకావుంది...