స్వాధ్యాయ సందోహం

స్వాధ్యాయ సందోహం--30

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హిందీ మూలం: స్వామీ వేదానంద తీర్థ
తెలుగు అనువాదం: డా పాలకోడేటి జగన్నాథరావు

విద్వాంసుడు సంయమి కావడం దేవుని చెలిమికే
విభ్రాజన్ జ్యోతిషా స్వ రగచ్ఛో రోచనం దివః
దేవాస్త ఇంద్ర సఖ్యాయ యేమిరే
భావం:ఓ ఇంద్రా! కాంతిపుంజం చేత నీవు స్వయంగా ప్రకాశళిస్తూ సకల జడలోకాలను ప్రకాశింపజేస్తూ నీవు సదా ఆనందనుభూతిని పొందుతున్నావు. అట్టి నీ మహా కార్యతత్పరతకు ఆకర్షితులై నిష్కామయోగులు నీ చెలిమికోసం ఇంద్రియ నిగ్రహాన్ని వహించి సదా జీవనం గడుపుతున్నారు.
వివరణ:జీవుడు భగవంతుని ఆరాధిస్తున్నాడు. ఎందుకు? ఆనందం కోసం. అది కూడా లౌకికానందం వంటి దుఃఖ స్పర్శగల దానికోసం కాదు. ఆత్మానందం కోసం జీవుడు భగవదారాధనా తత్పురుడవుతున్నాడు. ఆ ప్రయత్నంలో దైవకృపవలన ఒకదానికొకటి మిన్నయైన భగవదానంద భూమికలను అందుకోగలుగుతున్నాడు. అట్టి సాధకుడు దేవా! నిన్ను సదా సాధకులెందుకు అర్చిస్తున్నారో నాకిప్పుడు అర్థమయిందని దైవానికి విన్నవించి మేము ఆనందమయులం కావాలి. అది నీ కృపా వీక్షణం చేతనే. స్వయం జ్యోతి స్వరూపుడవై సకల జడ జగత్తును ప్రకాశింపజేస్తున్నరీతిగా ఆనందఘనుడవైన నీవు మాకు ప్రసాదించు. నీ ఆనంద ప్రసాదానికే విద్వాంసులు ఇంద్రియ నిగ్రహాన్ని వహించి నినే్న ఆరాధిస్తున్నారు.
భగవత్కృపాసాధకమైన ఈ సంయమనమే నిజమైన ఐశ్వర్యంగా ఋగ్వేదం ‘సు తే ని యచ్ఛ తన్వమ్’ - ఐశ్వర్య ప్రాప్తికి శరీరాన్ని అంటే ఇంద్రియాలను సంయమనం (నియంత్రణ) చేయి అని ఆదేశించింది. సాధారణంగా శరీరం సంయమనాన్ని ఇష్టపడదు. భోగానే్న కాంక్షిస్తుంది. ఆ భోగంవలన ‘్భగే రోగభయమ్’ అన్న నీతి వచనానుసారం రోగమే ప్రాప్తిస్తుంది. ఆ రోగం పారలౌకిక క్రియా కలాపానే్న కాదు లౌకిక క్రియాకలాపాన్నీ చెడగొడుతుంది. ఫలితంగా సంయమి పొందే జీవితానందంలో శతాంశం కూడా భోగపరాయణుడు పొందలేడు.
ప్రసిద్ధమైన బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థ, సన్న్యాసాశ్రమాలన్ని ఈ సంయమన నియమాన్ని విస్తృపరచిన వ్యవస్థలే. బ్రహ్మచర్యాశ్రమంలో అస్ఖలిత వీర్యవంతుడు కావడానికి మనసా వాచా కర్మణా సంయమనం కల్గి లౌకిక భోగాలకు పరాఙ్మఖుడు కావాలి. దీనికంటే కఠినతరంగా వానప్రస్థ మరియు సన్న్యాసాశ్రమంలో ఈ సంయమన నియమాన్ని పాటించవలసి యుంటుంది. ఇంక రెండవది అయిన గృహస్థాశ్రమంలో కొంతవరకు భోగానుభవానికి అనుమతి ఉన్నా సంయమనం పాటించవలసిన బలీయ నియమం కూడా విధించబడింది. అధ్యాత్మ బలానే్నకాదు కేవలం శారీరక బలాన్ని ఆర్జించాలన్నా విధిగా సంయమన నియమాన్ని పాటించవలసియుంది. ఉదాహరణకు- మల్లయుద్ధ వీరుణ్ణి తీసుకోండి. ఇంద్రియ నిగ్రహం (సంయమనం) లేనివాడు దురాచారుడు- విలాసపురుషుడు మల్లయుద్ధ విద్యను అభ్యసించగలడా? అభ్యసించినా ఆ విద్యలో నిపుణుడు కాగలడా? మల్లయుద్ధవిద్యయే కాదు లోకంలోని ఏ విద్య అయినా సంయమికాక భోగపరాయణుడై ఎవడైనా సాధించగలడా? కాబట్టి లౌకిక సాఫల్యమయినా ఆధ్యాత్మిక ఆనందమయిన సంయమి కాని మానవుడు సాధించజాలడు.

--ఇంకావుంది...