స్వాధ్యాయ సందోహం

స్వాధ్యాయ సందోహం-191

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మనిషి తానుచేసే పనికి ఏ విఘ్నాలు సంభవించకుంటే తన నిశ్చితాభిప్రాయాలను సవరించుకోవడంగాని విరమించడంగాని చేయడు. అట్టివాడు ఎవడూ ఎవరి సహాయమూ అర్థించడు. కాని లోకంలో యుద్ధముంది. ఒకరికి మరొకరిమీద విరోధముంది. ఒకడు మరొకణ్ణి హీనంగా చూస్తాడు. దీని పేరే యుద్ధం.
లోక సమష్టిలో ఉన్న ఈ యుద్ధం వ్యక్తి వైయక్తిక జీవితంలోకూడ ఉంది. ఇంద్రియాలు, దేహమూ ఆత్మను తమ వశం చేసుకొనేందుకు నిమగ్నమైయుంటాయి. కాని ఆత్మ దేహేంద్రియాలు తన వశంలో ఉండాలని భావిస్తుంది. దైవీభావాలు అసురభావాలను తమ అధీనంలోనే తెచ్చుకోవాలని భావిస్తాయి. అసురీశక్తులు దైవీశక్తులను అణచివేయాలని నిత్యం ప్రయత్నిస్తూ ఉంటాయి. ఈ దేవాసుర యుద్ధవిషయమటుంచండి. మనిషి తన జీవితాన్ని సుఖమయం చేసుకొనేందుకు ప్రకృతితో ఎంత సమరస యుద్ధంచేయవలసి యుంటుంది?
ఏ యుద్ధానికైనా విధిగా సహాయకులు కావలసియుంటుంది. అందుచేత ‘స్మిన్నరో విహ్వయంతే సమీకే’ ‘‘నాయకులంతా జీవన సంగ్రామంలో సహాయకునిగా ఆ దైవానే్న ఆహ్వానిస్తారు’’ నాయకులే కాదు-
ఇంద్రం పరే- వరే మధ్యమాస ఇంద్రం యాంతో- వసితాస ఇంద్రమ్‌
ఇంద్రం క్షియంత ఉత యుధ్యమానా ఇంద్రం నరో వాజయంతో హవంతే॥ ఋ.4-25-8.
ఉత్తమ, మధ్యమ, అధములైనవారు సహితం ఇంద్రునే (్భగవంతునే) సహాయకునిగా ఆహ్వానిస్తారు. యుద్ధంచేసేవారు, దాని నెదుర్కొనేవారు ఇంద్రుణ్ణే పిలుస్తారు. నిరాశావహులు హతాశులు కూడ ఆయనే్న స్వాగతిస్తారు. వీరేగాక జీవితంలో జ్ఞానం, ధనం, బలం, సంతానం మొదలయినవి కోరుకొనేవారు సహితం ఆ దైవానే్న(ఇంద్రునే) అర్థిస్తారు. ఆశావాదులు, నిరాశావాదులు, జ్ఞాన ప్రవణులు, ధ్యాన తత్పరులు, సజ్జనులు, దుర్జనులు, మధ్యేవర్తులు అందరూ ఆ భగవంతునే సహాయమర్థిస్తుంటారు. ఈ విధంగా అర్థించే స్థితిలో అందరూ సమానులే. భగవద్ద్వారంవద్ద ఒక విధంగా అందరూ యాచకులే. భగవద్ద్వారం వద్దనున్న వారందరూ ‘రిరిక్త్వాం సస్తన్వఃఅగ్మన్’ ‘‘రిక్త శరీరులై మాత్రమే చేరుకొంటారు’’ అట్టివారే భగవంతుని వద్దనుండి ఏదైనా పొంది తెచ్చుకోగలరు. దేహంమీద ఏదో బరువైన వస్తువులు మోసుకొనిపోయి నిలిచినవారు ఆయననుంచి ఇక అధికంగా తెచ్చుకోగలిగే దేముంటుంది.
యోధులు ఆత్మసంరక్షణార్థం కవచాదులను ధరించి యుద్ధంలోనికి వెళతారు. కాని జీవన సమరంలోఉన్న యోధుడు దైవద్వారానికి ముందు నిలిచేందుకు ముందుగా శరీరంమీద ఉండే రక్షణ కవచాదులను తొలగించుకొని నిలబడాలి. ఎందుకంటే ‘తన్వః కృణ్వత త్రామ్’ ఆ దైవమే ఆ యోధుడికి శరీర సంరక్షణచేసే కవచమైపోతాడు. ఇంకో విశేషమేమంటే ఆ దైవద్వారం వద్ద నిలిచేందుకు వెళ్లేవాడు ఆయనకు కానుకగా త్యాగమనే మహాఫలాన్ని తీసుకొనిపోవాలి. ‘మిథో యత్ త్యగముభయాసో అగ్మన్.’
***
పరమార్థ ప్రాపక క్రమం
యత్సానోః సానుమారుహద్ భూర్వస్పష్ట కర్త్వమ్‌
తదింద్రో అర్థం చేతతి యూథేన వృష్ణిరేజతి॥ ఋ.1-10-2॥
భావం:- ఒక శిఖర మధిరోహించిన తరువాత మరల అధిరోహించదగిన శిఖరం కనబడిన విధంగా ఒక పురుషార్థాన్ని సాధించిన తరువాత సాధించదగిన మరో పురుషార్థాన్ని ఆత్మ గుర్తిస్తుంది. అలాగే ప్రాణాయామాది అష్టాంగ యోగాభ్యాసం ద్వారా సాధించదగిన నిర్వికల్ప సమాధాని ఆత్మసాధించి మోక్ష పురుషార్థాన్ని పొందగలుగుతుంది.
వివరణ:- పర్వతారోహణం చేసే వారికి ఈ మంత్రంలో చెప్పబడిన అనుభవం సాధారణంగా కలుగుతుంది. ఎదురుగా ఉన్న పర్వత శిఖరాన్ని ఎక్కగానే తృప్తి కలుగకముందే ఆ పైన కనబడే మరో పర్వత శిఖరాన్ని కూడ ఎక్కాలనే కోరిక కలుగుతుంది. ఆ ఎతె్తైన శిఖరాన్ని అధిరోహించడమొక్కటే సాధించవలసిన విజయంగా ఒక తీవ్రవాంఛ జనిస్తుంది. అది వాంఛ మాత్రంగానే కాదు. ‘్భర్య స్పష్ట కర్త్వమ్’ ‘‘ప్రధాన కర్తవ్యంగా తోస్తుంది.’’ వెనుక సాధించిన పర్వత శిఖరారోహణ విజయం మరుపునకు వస్తుంది.
ఇంకావుంది...

హిందీ మూలం: స్వామీ వేదానంద తీర్థ తెలుగు అనువాదం: డా పాలకోడేటి జగన్నాథరావు