స్వాధ్యాయ సందోహం

స్వాధ్యాయ సందోహం-192

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మరో పర్వత శిఖరారోహణమే జీవిత ధ్యేయంగా మనసులో నాటుకుపోతుంది. ఇదే రీతిగా జీవితంలో ప్రతి దినమూ క్రొత్త క్రొత్త కర్తవ్యాంశాలు ఎదురుగా నిలిచి ఉత్సాహపరుస్తూ ఉంటాయి. అలా ఎనె్నన్ని కర్తవ్యాలు నిర్వహించినా ఎప్పటికప్పుడు మరో క్రొత్త క్రొత్త కర్తవ్యాంశాలను జీవితం సూచిస్తూనే ఉంటుంది. ఇట్టి సందర్భాలే ‘తదింద్రో అర్థం చేతతి’ ‘‘జీవాత్మకు జీవన సంఘ్రామమంటే ఏమిటో బోధపరుస్తాయి’’ ఆ సందర్భాలలో జీవిత సాఫల్యసిద్ధి సాధించాలని దృఢ నిశ్చయం గలవాడు జీవన సంగ్రామాన్ని దీక్షతో ఎదుర్కోవలసి వస్తుంది. అప్పుడతడు తన మనోధైర్యాన్ని కోల్పోతాడా? ఎన్నటికీ కోల్పోడు. అట్టి స్థిరచిత్తుడు ‘సం చోదయ చిత్రమర్వాగ్రాధ ఇంద్ర వరేణ్యమ్’ (ఋ.1-9-5) ప్రభూ! మాకు ధైర్యాన్ని వృద్ధిపరచి ముందుకుసాగే సాహసాన్ని అనుగ్రహించు. ముందు ఎంతో అద్భుత ధనముంది’’ ‘బ్రహ్మచ నో వసో సచేంద్ర యజ్ఞం చ వర్ధయ’ (ఋ.1-10-4) ‘‘సర్వజీవన ప్రదాతా! అజ్ఞాన నివారక! మా వినతిని విని మేము చేసే యజ్ఞాన్ని (సత్కర్మను) సాఫల్యం చేయుము’’అని ప్రార్థిస్తాడు.
తనకుతాను సహాయపడేవాడికే భగవంతుడు కూడ సహాయపడతాడన్నది ఆ యజ్ఞ నిర్వాహకుడికి బాగా తెలుసు. ఈ దృఢ నిశ్చయంతో జీవితంలో ఒక్కొక్క శిఖరాన్ని ఎక్కే ప్రయత్నంలో తన సర్వేంద్రియ శక్తుల్ని నిమగ్నంచేస్తాడు. ఎలాగంటే- నిర్వికల్ప సమాధి సాధనాపరుడు యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన సమాధులనే అష్టాంగాలను ఒక్కొక్కటిగా సాధిస్తూ ముందు దానిపై లక్ష్యాన్నిపెట్టి క్రమంగా నిర్వికల్ప సమాధిని సాధిస్తాడు కదా. ఈ భావానే్న ప్రస్తుత మంత్రం-
యత్సానోః సానుమారుహత్ భూర్యస్పష్ట కర్త్వమ్‌ ఋ.1-10-2.
అని ప్రతీకాత్మకంగా వర్ణించింది. అంటే ‘‘మూలాధారంనుండి లేపబడిన ప్రాణం క్రమంగా స్వాధిష్ఠాన, మణిపూర, అనాహత, విశుద్ధి, ఆజ్ఞా, చక్రాలను దాటుకొంటూ సహస్రార చక్రాన్ని చేరుకొని అక్కడ స్రవించే బ్రహ్మానందామృతపానం చేసి జీవుడు ముక్తిపదాన్ని పొందినట్లుగా మానవుడు కూడ క్రమంగా జీవిత పరమలక్ష్యమైన మోక్ష పురుషార్థాన్ని అందుకోగలడు.
**

అభీష్ట ప్రదాతవు నీవే
అచ్ఛా చ త్వైనా నమసా వదామసి కిం ముహుశ్చిద్వి దీధయః
సంతి కామాసో హరివో దదిష్ట్వ స్మో వయం సంతి నో ధియః॥

భావం:- ఓ పాపనివారక! నీకు నమస్కారం చేస్తూ విన్నవించుకొంటున్నాను. ఎందుకంటే నీవు మాటిమాటికి ఆలోచిస్తున్నావు. ఏమంటే- మాకున్న కోరికలు ఒకవైపు. మహాదాతవైన నీవు ఒకవైపు. మేము మా కోరికలు ఒకవైపు మా బుద్ధులు, కర్మలు మరొకప్రక్క ఉన్నాయి.
వివరణ:- ఓ దేవా! రిక్తహస్తులమై మేము నీవద్దకు వచ్చాం. నిజంగా నీతో మాటలాడగల అధికారమేముంది? ఓ ప్రభూ! ‘అభి త్వా మింద్ర నోనుమః’ (ఋ.8-21-5) నీకు వినయంతో వంగి వంగి నమస్కరిస్తున్నాం.
‘వయం హి త్వా బంధుమంత మబంధవో విప్రాస ఇంద్ర యేమిమ’ (ఋ.8-21-4)
‘మేము బంధురహితులం. నీవు అబాంధవుల పాలిటి బంధుడవే’’. ఈ బంధుత్వాన్ని పురస్కరించుకొని ‘త్వైనా నమసా వదామసి’ ‘‘నమస్కరిస్తూ నీతో సంభాషిస్తున్నాం’’ తద్వారా మా కష్టాలను, వ్యథాభరిత గాథలను నీకు విన్నవించుకోగలుగుతున్నాం. ఓ లోకనాథా! నీవేమాలోచిస్తున్నావు? నాలో అహంకారముందనా? లేదు. లేదు. అహంకారాన్ని అణచివేసికొనియే నీకు నమస్కరించాను. వినమ్రుడనై నీ కొలువులోనికి వచ్చాను. ఎందుకు వచ్చాను? ఓ అంతర్యామీ! నీవు మా ‘విశ్వాని దేవ వయునాని విద్వాన్’(శు.య.వే40-16) ‘‘సమస్త మనోగత భావాలను గ్రహించగలవాడవు’’ నీకు తెలియనీయకుండ వేనిని దాచలేము. ‘సంతి కామాసో హరివః’ ‘‘పాప సంహారకా! మాకెన్నో కోరికలున్నాయి’’ మరి నీవో!! దదిష్ట్వమ్= పరమదాతవు’’ యాచకుడు దాతవద్దకు గాక మరెవ్వరివద్దకు పోతాడు?

ఇంకావుంది...

హిందీ మూలం: స్వామీ వేదానంద తీర్థ తెలుగు అనువాదం: డా పాలకోడేటి జగన్నాథరావు