స్వాధ్యాయ సందోహం

స్వాధ్యాయ సందోహం-193

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హిందీ మూలం: స్వామీ వేదానంద తీర్థ తెలుగు అనువాదం:
డా పాలకోడేటి జగన్నాథరావు 9490620512

*
ఋగ్వేదంలో
న స సఖా యో న దదాతి సఖ్యే సచాభువే స చ మానాయ పిత్వః॥ (ఋ.10-117-4)
‘‘కూడా ఉంటూ అన్నాన్ని అర్థించే మిత్రుడికి అన్నం పెట్టనివాడు మిత్రుడే కాదు’’అని చెప్పావుకదా! నేను నీతోనే ఉంటున్నా. అట్టి నీ తోడనే ఉన్న నన్ను ఎన్నడూ విడువరాదు. ధైర్యముంటే నన్ను విడిచి చూడు. కాని నీవు నన్ను విడువజాలవు. అయితే నాకేమీ ఈయవేల మహాదాతా! నీ దానశీల కీర్తిని సార్థకపరచుకో. యాచకుని పాత్రను నింపి పంపడంలోనే నీ కీర్తి ఇనుమడిస్తున్నది. నీ వాకిటనుండి రిక్తహస్తాలతో వెళ్లిపొమ్మంటావా? ఔను మరి. నీవే ఒక సందర్భంలో ‘అపాస్మాత్ ప్రేయాత్’ (ఋ.10-117-4) ‘‘ఎవడు దానం చేయడో అక్కడనుండి పారిపో’’అని ఋగ్వేదంలో చెప్పావు. అయితే ఏమీ దానం చేయని నీనుండి నేనెక్కడకు ఎవని వద్దకుపోగలను? ‘న తదోకో అస్తి’ (ఋ.10-117-4) ‘‘దానం చేయని ఇల్లు ఇల్లేకాదు’’అని నీవే చెప్పావు కదా! అది నిజమే. నీ కిష్టమయితే కోరిన దిమ్ము. లేకుంటే మానుము. కాని ఇక నీ యిల్లే నా యిల్లు. మరి నా యింటిని విడిచి నేనెక్కడకూ వెళ్లను. అయితే నన్ను ‘పృణంతమన్య మరణం చిదిచ్ఛేత్’ (ఋ.10-117-4) ‘‘మరొక దాత ననే్వషిస్తూ పొమ్మంటావా?’’ నే నలా ఎందుకు వెళ్లాలి? నాకొక్కడికే కాదు. సమస్త విశ్వానికే నీవు మహాప్రదాతవు. మరి దానాల్లో ‘్భద్రా ఇంద్రస్య రాతయః’ (ఋ.8-62-1) ‘‘నీవుచేసే దానాలు చాలా ఘనమైనవి’’ ఎవరికేమి దానమిస్తావో నాకు తెలియదు. అన్నమడిగితే సున్నమైనా పెట్టరు. కాని నీ వెన్నడు ఎట్టి పరిస్థితులలో కూడ ఇష్టంకాని దానిని ఈయవు. కాబట్టి ఓ జగన్నాథా! నిన్ను విడిచి మేమెక్కడకు వెళ్లం. ఇదిగో ‘‘స్మో వయం సం తి నో ధియః’ ‘‘మేమిక్కడ. మా బుద్ధులు, కర్మలు అవిగో అక్కడ. నీవు మా కర్మల ననుసరించే మాకిమ్ము. అలా ఇచ్చినా అది నీవు మాకు చేసిన దానంగా సంతోషిస్తాం. కాని నీ ముంగిట నిరసన దీక్ష చేసే అధికారాన్ని వదులుకోము. నీవు నీ వెంట తీసుకొనిపో. లేదా మేమే మా ప్రాణాలను నీకు అర్పించివేస్తాం. నీవేది చేసినా అది మాకు లాభదాయకమే. అందుచేత-
పర్జన్య ఇవ తతనద్ధి వృష్ట్యా సహస్రమయుతా దదత్ (ఋ.8-21-18)
ఓ ప్రభూ! మేఘం వలె గర్జిస్తూ గర్జిస్తూ వేలు లక్షల కొలది అభీష్టాలను వర్షించు. వర్షించు. మమ్ము నీ దానధారలలో కొంచెంకూడ పొడి లేకుండ తడిపి ముద్దచేయి. నీవు భూరిదా హ్యసి శ్రుతః’ (ఋ. 4-32-21) ‘‘గొప్ప మహాదాతవుగా జగత్ప్రసిద్ధుడవు’’ కదా!

నీ ధనానికి అంతే లేదు
నహి తే శూర రాధ సోంతం విందామి సత్రా
దశస్యా నో మగవన్నూ చిదద్రివో ధియో వాజేభి రావిథ॥
॥ ఋ.8-46-11॥
భావం:- ఓ శూరుడా! నీ ధన సంపదకు, దానవైభవానికి అంతును మేము తెలుసుకొనజాలం. ఓ మఘవా. ఆ రెండింటిని వెంటనే మాకు ప్రసాదించు. మా పనులను బుద్ధులను పవిత్రంగా చేయి.
వివరణ:- ఓ అమేయాత్మా! నీ బలం, జ్ఞానం, దానం, ఐశ్వర్యం, అనంతం నీవే అనంతం. మరి నేనో! యుక్తి, శక్తి, బుద్ధి అన్నింట పరిమితుడనే. అందువలన ‘న హి తే శూర రాధసోంతం విందామి సత్రా’ ‘‘ఓ శూరవరా! అంతే లేని నీ ధర్మాన్ని, దానాన్ని నెన్నటికి తెలుసుకోలేను’’ అనంత కాలంనుండి సర్వజీవులకెంతెంతో, ఎనె్నన్నో దానం చేస్తూనే ఉన్నావు.
ఇంకావుంది...