స్వాధ్యాయ సందోహం

స్వాధ్యాయ సందోహం-200

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జనులకు ఇట్టివారి కంటె హితైషులు లోకంలో మరొకరు ఉండరు. సహజంగా విద్వాంసులలో ఉండే ఈ సద్గుణాలను చూచి నేను కూడ విద్వాంసుడను కావాలనే కోరిక కలుగుతున్నది.
వివరణ:- ఈ మంత్రంలో విద్వాంసుల మాహాత్మ్యాన్ని సంక్షిప్తంగా వివరించడం జరిగింది.
క్రతూయంతి క్రతవః :- వారు క్రతు= కర్మలను చేయుటయే సహజ స్వభావంగా కలవారు. ఇట్టి విద్వాంసులను గురించి ముండకోపనిషత్తు (3-1-4)
విజానన్ విద్వాన్ భవతి నాతివాదీ. ఆత్మక్రీడ ఆత్మరతిః
క్రియావానేష బ్రహ్మవిదాం వరిష్ఠః॥
‘‘సర్వమూ తెలిసిన విద్వాంసుడు ఎక్కువగా మాటలాడడు. ఆత్మయందే రమిస్తూ ఆత్మనే ప్రేమిస్తూ ఉంటాడు. అతడు బ్రహ్మజ్ఞానులలో శ్రేష్ఠుడైన క్రియాశీలుడుగా ఉంటాడు’’ శ్రేష్ఠుడైన బ్రహ్మజ్ఞానియే క్రియాశీలుడై యుంటే అది సామాన్యులకు మార్గదర్శకమే కదా. ఈ భావానే్న స్పష్టంగా ‘తే హి దేవస్య సవితః సవీమని క్రతుం సచంతే సచితః సచేతసః’’ (ఋ.10-64-7)
‘‘సర్వజ్ఞులైన ఆ సుజ్ఞనులు పరమాత్మ ఆదేశానుసారం సదా కర్మలను చేస్తూనే ఉంటారు’’ అని ఋగ్వేదం చెప్పింది. ఆ సుజ్ఞానులకు ఆదర్శం భగవానుడే. భగవంతుడే నిత్యకర్మశీలుడు. ఆయనను ఆదర్శంగా గొన్న సుజ్ఞాని నిష్క్రియాపరుడెలా కాగలడు? జ్ఞానిని అనుసరించేవారు మాత్రం కర్మదూరులుగా ఎలా ఉండగలరు? ఎవరైనా అలా కర్మదూరులై ఉండేవారిని వేదం దస్యులని వ్యవహరించింది.
హృత్సు ధీతయః:- అట్టి సుజ్ఞానులైన విద్వాంసులు సర్వదా దైవాన్ని మనస్సులో ధ్యానం చేస్తారు.
వేనంతి వేనాః:- ఆ విద్వాంసులు ఆచరించే సదాచార పరాయణత్వమే వారిలో గల బుద్ధి వైభవాన్ని- బ్రహ్మవర్చస్సును ప్రకటిస్తుంది.
పతయంత్యాదిశః:- అధర్మ, అన్యాయ మార్గాలతో ఆజ్ఞాపించేవారి ఆజ్ఞలను ధిక్కరిస్తారు. కర్మ, జ్ఞాన మార్గాల ఫలం సదసద్వివేకం. అంటే మంచి చెడుల విచక్షణ జ్ఞానం. ఇట్టి జ్ఞాన స్వరూపులు అధర్మ, అన్యాయ మార్గాలతో ఆదేశించేవారి ఆజ్ఞలను ధిక్కరించం సహజమే కదా.
న మర్డితా విద్యతే అన్య ఏభ్యః:- ఇట్టి జ్ఞానుల కంటె అన్యులైన వారు మానవులకు సుఖకారకులెవరూ ఉండరు. ఎందుకంటే జ్ఞానులు అధర్మ, అన్యాయాలకు విరోధులు కావడమే. అందుకే వారు జనులకు హితైషులుగా ఉంటారు. విద్వాంసులు సర్వదా ‘సదా దేవాస ఇళయా సచేమహి’ (ఋ.10-64-11) ‘‘విద్వాంసులమైన మేము జ్ఞానవంతులమూ మరియు ప్రియభాషణులమై యుందుము గాక’’ అని కోరుకొంటారు. అంటే మా మాట ఎప్పుడూ మా సుజ్ఞానభూషితమై యుండాలని వారి ఆకాంక్ష. విద్వాంసుల మరియు సుజ్ఞానులలోని ఈ సద్గుణాలను చూచి ముగ్ధులైన కారణంగా ‘దేవేష్వధి మే కామా అయంసత’ ‘‘నా అభీష్టాలన్నీ విద్వాంసులలో చిక్కుకొన్నాయి’’ అంటే నేను కూడ విద్వాంసుడను కావాలనుకొంటున్నాను అనే కాంక్ష నాలో కలుగుతున్నది.
***
ఉత్తమ ఉపదేశకులు పాపాల నుండి రక్షించగలరు
అవంతు నః పితరః సుప్రవాచనా ఉత దేవీ దేవపుత్రే ఋతావృధా
రథం న దుర్గాద్వసవః సుదానవో విశ్వస్మాన్నో అంహసో నిష్పిపర్తన॥
భావం:- మేలును కోరి హితోపదేశం చేసేవారు, విద్యాబోధకులు, దైవ శాసనాలను సృష్ట్ధిర్మాలను (ఋతం) శ్రద్ధగా ఆచరించేవారు, దివ్యగుణ సంపన్నులైన గురువులు, తల్లిదండ్రులు మమ్ము రక్షింతురుగాక!. సరిగా లేని మార్గంలో రథచోదకుడు రథాన్ని నిపుణంగా నడిచిన మంచి మార్గానికి తెచ్చే విధంగా ఉత్తమ జ్ఞానప్రదాతలైన వసువులారా! పాపాలనుండి మమ్ము విముక్తులను చేసి రక్షించండి.
వివరణ:- అజ్ఞానం కారణంగా పాపాచరణకు బుద్ధికి చొరవ కలుగుతుంది. తల్లి-దండ్రులు, గురువులు ఆ పాపాచరణ నుండి రక్షణ చేయగలరు. బాల్యంలో బాలురు తల్లిదండ్రులవద్దనే ఉంటారు కాబట్టి వారి నడవడిక, వ్యవహారాలు, సంస్కారాలు బాలుడిమీద చాలా ప్రభావాన్ని చూపిస్తాయి. తల్లిదండ్రులు పిల్లల ఎడల శ్రద్ధచూపితే వారిని సంస్కారవంతులుగా, సద్గుణవంతులుగా తీర్చిదిద్దగలరు. శ్రద్ధ చూపకుంటే వారు తమ బిడ్డలను సంఘవిద్రోహకశక్తులుగా చేయగలరు.
పిల్లలలోని మంచితనంగాని చెడ్డతనం గాని తల్లిదండ్రులలోనిది గానే గమనింపవచ్చు. ఆ విధంగా బాల్యంలో పడిన సంస్కారాలన్ని ఆ బాలుని జీవితపర్యంతమూ ఉంటాయి. బాలుర శీల వైభవ విషయంలో తల్లిదండ్రుల తర్వాత ప్రధాన భూమిక వహించేవారు గురువులు. ఆచార్యులు, ఆచార్య శబ్దానికర్థం ఆచారం గ్రాహయతి= సదాచారాన్ని గ్రహించి ఇతరులచే ఆచరింపచేసేవాడని.

హిందీ మూలం: స్వామీ వేదానంద తీర్థ తెలుగు అనువాదం: డా పాలకోడేటి జగన్నాథరావు