స్వాధ్యాయ సందోహం

స్వాధ్యాయ సందోహం-32

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హిందీ మూలం: స్వామీ వేదానంద తీర్థ
తెలుగు అనువాదం: డా పాలకోడేటి జగన్నాథరావు

*
ప్రపంచంలో ఇంత చౌకబేరం ఎక్కడైనా లభిస్తుందా? ఎవడో మూర్ఖవ్యాపారి తప్ప ఇలాంటి చౌకవ్యాపారాన్ని తెలివైనవాడు వదులుకొంటాడా? అలా వదులుకొనేవాడు ఎంత మూర్ఖుడో యముడు కఠోపనిషత్తులో నచికేతుడితో చెప్పిన మాటలను వినండి.
తతో మయా నాచికేత శ్చివో- గ్ని రనిత్యైర్ద్రవ్యైః ప్రాప్తనానస్మి నిత్యమ్- నేను నచికేతాగ్నిని జ్వలింపజేసాను. దానిలో నశ్వరమైన భౌతిక పదార్థాలను హోమం చేశాను. దాని ద్వారా శాశ్వతమైన భగవత్తత్వాన్ని అందుకొన్నాను. కాబట్టి ధనాన్ని- జీవిత ధనాన్ని భగవన్నామాంకితంగా దానం అంటే సమర్పణం చేయడం వలన అవి వ్యర్థం కాక ఇతోధికంగా వృద్ధి పొందుతాయి అంటూ ఋగ్వేదం కూడా ‘ఉతో రయిః పృణతో నోప దస్యత్యుత’- దానం లేదా దైవ సమర్పణం చేసిన ధనం వ్యర్థం కాదు. అది పారమార్థిక ధననిధిలో జమ అయి నిల్వ యుండి వడ్డీతో సహా పెరుగుతూ వుంటుంది. ధనవృద్ధి (వడ్డీ) నెవడు కోరుకోడు. నీవు కూడా ఈ రీతిగా నీ అశాశ్వత ధనాన్ని దానం చేసి శాశ్వత పారలౌకిక ధనాభివృద్ధిని ఎందుకు కోరుకోవు? మరి ధనమెవరికి దానం చేయాలి? అంటే విద్వాంసులకు దానం చేయమని వేదం చెబుతూంది. ఆ విద్వాంసులు ఆకలితో మరణించేందుకైనా సిద్ధపడతారు కాని ధన మదాంధుల వద్దకు యాచకులైపోయేందుకు ఇష్టపడరు. ఎందుకంటె వారు తమ విద్యాధనరూపమైన సరస్వతీ పతాకాన్ని లక్ష్మీదేవి వాకిలి ముందు విసిరి పారవేయడానికి సిద్ధంగా ఉండరు కదా! అయినా విద్వాంసులు ధనవంతుల వద్దకే యాచకులై వస్తారు నిజానికిది వారి సౌభాగ్యమే. అయితే మదాంధులైన ధనవంతులు ఆ విధంగా భావించరు. కాని కొందరు మాత్రమే అలా భావించగలుగుతారు. అది వారి సౌభాగ్య విశేషమే. అట్టివారి సౌభాగ్యాన్ని ఇనుమడిపంజేసేందుకు మహాత్ములైన విద్వాంసులు యాచకులై వారిని ఆశ్రయిస్తారని
స దేవతా వసువనిం దధాతి యం సూరిరర్థీ పృచ్ఛమాన ఏతి
అన్న రెండవ వాక్యం ద్వరా ఈ మంత్రం హెచ్చరిస్తూంది.
ఆ విధంగా ధనాన్ని దానం చేస్తూ పోతే తనకుమాలిన ధర్మం మొదలు చెడ్డబేరమన్నట్లుగా స్వయంగా తానే చెడిపోడా? లోక జీవనమంతా ధనానే్న ఆశ్రయించి యుంటుంది కదా. ఈషణత్రయంలోని ధనార్జనను విసర్జించిన సన్న్యాసికి సహితం జీవించేందుకు అన్నవస్త్రాలు కావాలి కదా. అవి ధనం కంటే భిన్నం కావు. అవి ధనంచేతనే లభ్యమవుతాయి. కాబట్టి ప్రతి వ్యక్తికి ధనం చాలా ముఖ్యమే. దానిని నిందింపదగునా? తృణీకరింపదగునా? అని తలంపరాదు. వేద మా విధంగా ధన నింద చేయలేదు. ధనార్జనను కూడా దూషించలేదు. శతహస్త సమాహార- వంద చేతులతో సంపాదించమని అథర్వణవేదం అనుమతించింది. అలా సంపాదించేది దేనికి? అనుభవించేందుకే. అయితే అంతా అనుభవించేందుకేనా? కాదు, సజ్జనులకు, విద్వాంసులకు సమర్పించేందుకు కూడా ధనాన్ని వినియోగించాలి. ఎలా? ‘సహస్రహస్త సం కిర’- వేయి చేతులతో దానం చేయి అని ఆ అథర్వణవేదమే ఆజ్ఞాపించింది. అంటే ఏమిటి? మితంగా అనుభవించి అమితంగా దానం చేయమని అంతరార్థం. కాబట్టి మంత్రార్థానుసారం విద్వాంసులకు ధనాన్ని సమర్పించుకొన్నవాడే ధనవంతుడు. ఇట్టివారు రెండు విధాలుగా ఉంటారు. నిస్వార్థబుద్ధితో సాధు సంతులకు- బ్రహ్మవాదుల సేవార్థంగా తమ ధనాన్ని వెచ్చించేవారు ఒకరు మరియొకరు జనక మహారాజువలె తన వద్దకు యాచిస్తూ రాకున్న బ్రహ్మజ్ఞానులైనవారికి తమ ధనాన్ని దానం చేసేవారు. రమణీయమైన - వాంఛనీయమైన ధనసార్థక్యమేదైనా ఉంటే అది ధర్మజ్ఞులైన ధనవంతులయందు మాత్రమే. ఇక ఇతరులందరు కోశాధ్యక్షులు మరియు ధనస్వాములు మాత్రమే కాని పారమార్థిక ధనవంతులు కారు.

ఇంకావుంది...