స్వాధ్యాయ సందోహం

స్వాధ్యాయ సందోహం-201

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆచార్యుడే ఉత్తముడయితే బాలుర జీవితమే సమున్నతస్థాయి నందుకొంటుంది. అంతేకాదు తల్లిదండ్రులవలన సంక్రమించిన కుసంస్కారాలు కూడ ఆ బాలురనుండి తుడిచిపెట్టుకుపోతాయి.
దురదృష్టవశాత్తు తల్లిదండ్రులు- ఆచార్యులనుండి మంచి క్రమశిక్షణ బాల్య, కౌమార, వన దశలలో ఏ సందర్భంలోనా అందక ఆ బాలుడు దుష్టుడుగా మారిపోయిన సంఘటనలు లోకంలో కనబడుతూ ఉంటాయి. అట్టివారి పూర్వజన్మ సుకృత విశేషంవలన వారికి ఏ దివ్యమహాపురుషుని సంసర్గమో కలిగితే వారిలో ఆశ్చర్యజనకమైన ఒక గొప్ప పరివర్తన ఏర్పడుతుంది. ఫలితంగా పాపపు ఊబిలో కూరుకుపోయిన వారి మదిలో ప్రాయశ్చిత్త మహాశ్రుజలం పెల్లుబికివచ్చి పాపపంకిలమంతా ప్రక్షాళితమై నిర్మల ప్రశాంత చిత్తులవుతారు. అంటే వారు పునర్జన్మను ఎత్తినట్లే. అట్టి పునర్జన్మను పొందినవారికి ఆ మహాత్ముడు తండ్రియే అని వేదం ‘అవంతు నః పితరః సుప్రవాచనాః’ ‘‘ఉత్తమ ప్రవచనం ప్రబోధం చేసేవారు పితరులై (తల్లి-తండ్రి) మమ్ము రక్షించెదరుగాక’’ అని వచించింది. అంటే తల్లిదండ్రి సాక్షాత్తుగా గాకున్నా తమ హితోపదేశం వలన దుర్మార్గులను సహితం సత్ప్రవర్తనులుగా తీర్చిదిద్దే మహాపురుషులు కూడ మాతాపితలేనని వేద మనోగతం. అట్టి ఉత్తమ ప్రవచనకర్తలలో ఒక అనిర్వచనీయమైన మహత్తరశక్తి ఉంటుంది. వారి ప్రవచన ప్రభావం ఏ విధంగానూ సంస్కరించేందుకు సాధ్యంకానంత సంస్కార భ్రష్టుని సహితం సంస్కారవంతునిగా చేయగల మహత్తరమైనది. వారి మహత్తరశక్తిని ప్రస్తుత వేదమంత్రం వివరిస్తూ ఎగుడుదిగుడుగా చిత్తడి చిత్తడిగా ప్రయాణ అననుకూలమైన రహదారులలోనుండి నిపుణుడైన రథచోదకుడు చాతుర్యంతో ప్రమాద రహితంగా నడుపుతూ రథాన్ని మంచి మార్గానికి ఎలాతీసుకొని వస్తాడో అట్లే ఈ మహాత్ములు తమ ప్రవచనం చేత కుసంస్కారులను సహితం సంస్కారవంతులుగా తీర్చిదిద్దగలరని సోపమానంగా వర్ణించింది. ఈ మహాపురుషులు ఎంతటి ప్రతిభావంతులో వివరిస్తూ తల్లిదండ్రులవలన కుసంస్కారులుగా మారిన సంస్కారహీనులను సహితం సంస్కారవంతులుగా చేయగలరని అథర్వణవేదం ఇలా వివరిస్తూంది.
యదేనసో మాతృకృతాచ్ఛేషే పితృకృతాశ్చ యత్‌
ఉన్మోచనప్రమోచనే ఉభే వాచా వదామి తే॥
‘‘మాతాపితల అపరాధం వలన పాపిగా అయితే మహాత్ములు ఆ పాపం నుండి అతడు విముక్తుడు కావడానికి ఉపాయాన్ని తమ ప్రవచనం ద్వారా వినిపించగలరు.’’
వ్యక్తి జీవితంలో ఆచార్యుని ప్రాధాన్యమెంతో ఉంది. జన్మతః వ్యక్తి కుసంస్కారిగా జన్మించినా అదృష్టవశాత్తు వానికి మహాగురువులతో సంయోగమేర్పడితే ఆ వ్యక్తి సంస్కారికాగల అవకాశమెంతో ఉంది. వైదిక సంస్కాృతిలో ఆచార్యుడికి మహోన్నత స్థానముంది. అందుచేతనే ఆచార్యులు, గురువులు, ప్రవచన మహాపురుషులు, సన్న్యాసులు రాజుకంటె మరియు రాజునకుకూడ వందనీయులగుచున్నారు.
***
న్యాయమార్గం నుండి ధీరులు వెనుకంజ వేయరు
హయో న విద్వా అయుజి స్వయం ధురి తాం
వహామి ప్రతరణీమవస్యువమ్ నాస్య వశ్మి విముచం నావృతం
పునర్విద్వాన్‌పథః పురఏత ఋజునేషతి
భావం: విద్వాంసుడైన నేను గుఱ్ఱంవలె నాకు నేనే కాడికి కట్టుకొన్నాను. రక్షించేది, లక్ష్యాన్ని చేర్చేది అయిన ఆ కాడి కొయ్యను మోస్తూనే ఉన్నాను. చిరకాలం మోస్తూ ఉన్నా ఆకాడి నుండి విడుదల పొందలాని గాని తాత్కాలికంగానైనా దానినుండి వెనుతిరగాలని గాని కోరుకోవడంలేదు. ఎందుకంటే మార్గాన్ని లేదా లక్ష్యాన్ని బాగా తెలిసిన నా యజమాని నన్ను నేరుగా అచటకు చేర్చగలడు.
వివరణ: మానవుని జీవన సాఫల్యం అతని కార్య నిమగ్నత మీద ఆధారపడి వుంది. ఈ సత్యాన్ని వేదం గుఱ్ఱంరథపు కాడికి కట్టబడిన రీతిగా మనిషి కార్యనిమగ్నుడు కావాలని సోపమానంగా వర్ణించింది. ఈ సందర్భంలో గుఱ్ఱానికి మనిషిగల భేదాన్ని కూడా గుర్తించవలసియుంది. ఏమంటే గుఱ్ఱం రథపు కాడికి తనంత తానుగాకట్టబడదు.
దానిని యజమాని కడతాడు. కాని మనిషి అలా కాక తనకు తానుగా కార్యనిర్వహణ నిమగ్నుడు కావలసియుంటుంది. అలా స్వేచ్ఛగా మనిషి కార్యనిమగ్నుడు కావాలని వేదం ‘హయో న విద్వాన్ అయుజి స్వయం ధరి’-గుఱ్ఱం వలె మనిషి తనకు తాను కార్యనిర్వహణ అనే కాడికి జోడింపబడాలి, అంటే నిమగ్నుడు కావాలని సూచించింది. మనిషికి ఈ స్వేచ్ఛను వేదమెందుకు ఇచ్చింది? అని విచారిస్తే మనిషి తన జీవిత లక్ష్యమూ జీవనోద్దేశ్యమూ తనకు తానే నిర్థారించుకోవాలిగాని గుఱ్ఱంవలె ఇతరులు నిర్థారించేది కాదు.
ఇంకావుంది...

హిందీ మూలం: స్వామీ వేదానంద తీర్థ తెలుగు అనువాదం: డా పాలకోడేటి జగన్నాథరావు