స్వాధ్యాయ సందోహం

స్వాధ్యాయ సందోహం--6

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హిందీ మూలం: స్వామీ వేదానంద తీర్థ
తెలుగు అనువాదం: డా పాలకోడేటి జగన్నాథరావు
*
ఆకలిని తొలగించుకొనేందుకు ఎలా ఆలోచించి ప్రయత్నిస్తామో అదే రీతిగా ఆత్మను గురించి చింతన చేస్తూ దానిని దర్శించేందుకు ప్రయత్నించాలి. నిజమైన ఆత్మప్రేమికుడు ఏ ఒక్కరినీ తక్కువగా చూడడు. ఎవరియందును - వేనియందును తుచ్ఛమైన ఉచ్ఛ- నీచ భావాలను కలిగియుండడు. తన దుఃఖాలను నివారించుకొనేందుకు ఎలా ప్రయత్నిస్తాడో అలాగే ఇతరుల దుఃఖాలను- కష్టాలను పురుషార్థబుద్ధితో తొలగించే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అట్టి జ్ఞానియే వాస్తవంగా ‘ఆత్మ ప్రేమి’ అని శ్లాఘింపబడేందుకు అర్హుడై యుంటాడు.
ఆత్మదర్శనం ఈశ్వరానుగ్రహమే
న వి జానామి యది వేదమస్మి నిణ్యః సన్నద్ధో మనసా చరామి
యదా మాగన్ ప్రథమజా ఋతస్యాదిద్వాచో అశ్నువే భాగమస్యాః
భావం:ఈ శరీరంగా ఏది ఉందో అదే నేనుగా అనుకొంటున్నాను. కాని స్పష్టంగా నేనెవరో నాకు తెలియదు. నాలోని మనస్సు చేత బంధింపబడి అది ఎటు నడిపితే అటే మూఢునివలె సంచరిస్తున్నాను. సత్యజ్ఞానస్వరూపుడైన జగత్ప్రభువు దర్శన మెపుడవుతుందో అప్పుడే నేనెవరో అన్న సత్యజ్ఞనం నాకు కలుగుతుంది.
వివరణ: కఠోపనిషత్తులో ఇలా వ్రాయబడి ఉంది.
నైవ వాచా న మనసా ప్రాప్తుం శక్యో న చక్షుషా
అస్తీతి బ్రువతో - నృత్య కథం తదుపలభ్యతే
ఆత్మప్రబోధ వాక్యాల చేత తెలియబడదు. మనస్సు చేస ఊహలచేత గ్రహింపబడదు. మాంస నేత్రాలకు దర్శనం కాదు. అంటే- జ్ఞానేంద్రియ కర్మేంద్రియాలు తమ సామర్థ్యం చేత ఆత్మజ్ఞానాన్ని కలిగింపలేవని భావం. ఇక మనస్సంటే ఈ జ్ఞాన కర్మేంద్రియాల వలన కలిగే జ్ఞానాన్ని మాత్రమే సమీకరించి తెలుపగలదు. మరి అట్టి మనస్సు ఆత్మజ్ఞానాన్ని ఎలా తెలుపగలదు? ఎవరికి ఆత్మజ్ఞానం కలుగుతుందో వారి నుండి మాఅతమే ఆత్మజ్ఞానం పొందగలం గాని ఇతరులనుండి పొందలేము- అని కఠోపనిషత్తు వివరిస్తూంది.
‘న మనసా ప్రాప్తుం శక్యః’- మనస్సు చేత ఆత్మదర్శనం కాదన్న ఉపనిషత్ భావానే్న వేదమంన్రిథ్యః మనసా సన్నద్ధః. మూఢునివలె మనుస్సనకు లొంగి తిరుగుతున్నాను. అట్లు తిరిగే నేను ‘నేనేమిటఇ? నే నెవరు? నా స్వరూప స్వభావాలేమిటి?’ అనే విషయాలను ‘న విజానామి’ తెలుకోలేకున్నాను అని వివరించింది.
అనుమాన ప్రమాణం చేత ఏదైనా తెలియబడితే అది కేవలం సామాన్యజ్ఞానమే అవుతుంది. ఉదాహరణకు పొగను చూచిన వెంటనే అక్కడ అగ్ని ఉందని తెలియబడుతుంది. కాని ఆ అగ్ని గడ్డిదా? ఆవు పిడకలదా? కట్టెలదా? అన్న స్పష్టమైన జ్ఞానం కలగదు. అలా కలగాలంటే ప్రత్యక్ష ప్రమాణం చేత మాత్రమే కలుగుతుంది. అదేవిధంగా అజ్ఞానులను (మృతశీరులను) జ్ఞానులను (అమృత శరీరులను) చూచి ఎవరు ఎట్టివారోవ వారిలో నేనెవడను కాగలనో తెలుసుకోలేను. ‘యదివేదమస్మి’ అలా కాక నేను తెలుసుకొన్నానని అహంరించితే ‘సు వేదేతి’ ఆత్మ సాక్షాత్కారి అయిన వేదర్షి ‘దభ్రమే వాపి నూనం త్వం వేత్థ’ (కేనోపనిషత్తు) నిజంగా నీకు ఏమీ తెలియలేదని మందలించాడు. అందుకే ప్రస్తుత మంత్రం ‘నవిజానామి’=సంపూర్ణంగా నాకేమీ తెలియదు అని పేర్కొంది. అయితే నాపై పరమేశ్వరుని దయ ఉంటే ఈశ్వర సాక్షాత్కారం నాకు కలిగితే ఈ మృతప్రాయమైన శరీరంలో ఉండి నిరంతరం నేను నేను అని పలికే ఆత్మను తెలుసుకోగలను అని ‘యదా.. భాగమస్యాః’ అని నిస్సంశయంగా పేర్కొంది.

..........................ఇంకావుంది