స్వాధ్యాయ సందోహం

స్వాధ్యాయ సందోహం-31

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హిందీ మూలం: స్వామీ వేదానంద తీర్థ
తెలుగు అనువాదం: డా పాలకోడేటి జగన్నాథరావు
*
ఎవడు ధనవంతుడు?
స మర్తో అగ్నే స్వనీక రేవానమర్త్యే య ఆజుహోతి హవ్యమ్
స దేవతా వసువనం దధాతి యం సూరిరర్థీ పృచ్ఛమాన ఏతి
భావం: ఎవడు యజ్ఞయాగాది క్రతువులను నిర్వహ్తి అగ్నియందు హవ్యాన్ని లేదా నిత్య భోగ్య వస్తువులను త్యాగబుద్ధితో పూర్ణాహుతి చేస్తాడో, ఎవని వద్దకు విద్వాంసులు పురుషార్థతత్పరులై పురుషార్థ ధనాన్ని అర్థిస్తూ వస్తారో అతడే మానవులలో ధనవంతుడు. అతడు ధనదేవతా దివ్యగుణ సంపన్నుడు కాగలడు.
వివరణ: ఈ మంత్రంలో ఉన్నత స్థాయికి చెందిన రెండు వ్యావహారిక సత్యాలు వివరించబడ్డాయి. మొదటి చరణంలో ధనవంతుడెవరో వివరింపబడింది. ధన శబ్దానికర్థం దేనివలన ప్రీతి కలుగుతుందో అదే ధనం అని. లోకంలో ప్రీతి అనేక వస్తువులు మరి విషయాల ద్వారా కలుగుతుంది. కాని వానివల్ల కలిగే ప్రీతియందు సుఖమూ ఆనందముతోబాటు దుఃఖం కూడా కలిసే యుంటుంది. అలా దుఃఖస్పర్శ కలిగిన గరిష్ట ఆనందాన్ని తైత్తిరీయోపనిషత్తు ఈ క్రింది విధంగా వివరించింది.
యువా స్వాత్ సాధు యువాధ్యాపకః ఆశిష్ఠో ద్రఢిష్టో బలిష్ఠః
తస్యేయం పృథివీ సర్వా విత్తస్య పూర్ణా స్యాత్, స ఏకోమానుష ఆనందః
వీరుడు, సచ్చరిత్రుడు, యువకుడు, సదాలోచనపరుడు, దృఢశరీరుడు, అత్యంత బలిష్ఠుడు- ఆహారపుష్టి కలవాడు, ధనధాన్య సంపన్నుడు, సమస్త భూమండలమూ స్వాధీనమందున్నవాడు అనుభవించే మహదానందం మానుషానందం. అది బ్రహ్మానందం వలె దుఃఖ స్పర్శలేని మహదానందం మాత్రం కాదు.
అట్టి మానుషానందాన్ని పొందే వ్యక్తి జీవితంలో ప్రత్యేకంగా పొందే విశేషం ఏముంటుంది? ఒక్క సుఖం తప్ప మరొకటి ఉందా? లేదు. మరి అదేమయినా సృష్టిలో ఘనమైన అంశమా? కాదు. అది ఒక విధంగా దుఃఖ స్పర్శ కల్గి నికృష్టమైనదే. పోనీ, వివిధ ప్రయత్నాలతో దానినెలాగో సాధించినా ఆ ఆనందం స్థిరంగా ఉంటుందనే దానికి ప్రమాణం లేదు. అందుకే బుద్ధిమంతులు తమకున్న ధనాన్ని తమకు దానివల్ల కలిగే కించిదానందం కొరకుగాక వినాశనశీలమైన ఆ ధనాన్ని భగవత్సేవకు వినియోగిస్తారు. వేద మీ భావానే్న గ్రహించి- మరణశీలుడైన మనిషి అశాశ్వతమైన తన ధనాన్ని పరమ శాశ్వతమైన భగవదర్పణంలో యజ్ఞంలో హవిస్సు నర్పించిన రీతిగా సమర్పిస్తాడు అని ప్రబోధించింది.
ఈ ప్రబోధాన్ని అనుసరించి మానవుడు ధనంవల్ల కలిగే కించిద్భోగాన్నో, అంతకన్నా మిన్నయైన స్థిరం కాని మానుషానందాన్నో ఆశించక శాశ్వతమైన బ్రహ్మానందాన్ని అందుకొనేందుకు సదా ప్రయత్నం చేయాలి. దానిని సాధించేందుకు మనిషి తనకున్న సర్వస్వానే్న గాదు తనను తానే భగవదర్పితం చేసుకోవాలి. అథర్వవేద మీ సందేశాన్ని స్పష్టంగా ‘మహ్యం దత్త్వావ్రజత బ్రహ్మలోకమ్’- ధనధాన్యాలు, కీర్తి సంపదలను, చివరకు నీ జీవితం సర్వమూ నాకర్పించి బ్రహ్మలోకంలో సదా బ్రహ్మానందానుభవాన్ని అనుభవించుమని వినిపించింది.
మరణానంతరం లభించే ఆ బ్రహ్మలోకమేమిటో! ఆ ఆనందమెలా ఉంటుందో! ఉన్నా అది నాకు లభిస్తుందో లేదో! అని భావించి తక్షణమే లౌకిక సుఖాన్ని యిచ్చే ధనాన్ని భగవంతుని పేరుతో పరుల పాలు చేయనేలా? అని వితండవాదం చేసి దాన్ని తన వద్దనే దాచుకొంటే మాత్రం అది శాశ్వతంగా ఉండిపోతుందా? అలా ఉండని లౌకిక ధనాన్ని, జీవితాన్ని భగవదంకితం చేసి శాశ్వత బ్రహ్మలోకానందానుభవాన్ని పొందగలగడమెంత లాభసాటి బేరం!
ఇంకావుంది...