స్వాధ్యాయ సందోహం

స్వాధ్యాయ సందోహం-212

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హిందీ మూలం: స్వామీ వేదానంద తీర్థ తెలుగు అనువాదం:
డా పాలకోడేటి జగన్నాథరావు 9490620512212
*
2. ఋతస్య పథా నమసా వివాసేత్:- ‘‘ఋత మార్గం ద్వారా మాత్రమే అనగా సృష్టి నియమాలను, ధర్మాన్ని ఆచరించడం ద్వారా మాత్రమే ధనాన్ని పొంది వినయంగా సేవ చేయాలి’’అన్నది ప్రథమ సూత్రం. ఎలా అని ఎవరికయినా సందేహం కలగవచ్చు. సందేహనివృత్తికై ఒకటి రెండు విషయాలను చెబుతాను. జలం ద్వారా ధనం సంపాదించాలనుకొన్నామనుకోండి. నీళ్లలో వెదకితే ధనం లభింపదు నీటిని వేడిచేస్తే ఆవిరి పుట్టడమనే ఒక సహజ ధర్మముంది. దానికి ఒక శక్తి ఉంది. నీళ్లు మరిగినపుడు పుట్టిన ఆవిరిలోని శక్తివలన పెట్టబడిన మూత క్రిందబడటం. ఇండ్లలో అందరూ చూచే విషయమే. ఆ శక్తిని వినియోగించి యంత్రం తయారుచేస్తే? అలా తయారుచేయబడినదేగదా రైలింజను. దానివలన మానవ సమాజానికి ఎంత ఉపయోగం, ఎంత ధనం లభిస్తుంది? ఆ ఆవిరి శక్తినే ఉష్ణశక్తిగా మారిస్తే? దాని రూపాలేగదా వంట వండుకొనే కుక్కర్లు. ఆ జలశక్తేకదా టర్బైన్లు త్రిప్పటంచే పుడుతున్న విద్యుత్తు మనిషికెంత ధనమార్జించి పెడుతూంది!! జీవనమెంత సౌఖ్యమయం చేస్తూంది!! ఇలా సృష్టిలోని అగ్ని, భూమి, అంతరిక్షాదుల ధర్మాలను తెలుసుకొన్న మానవుడు ఎంత ధనాన్ని పొందుతున్నాడు? కాబట్టి సృష్టిలోని సమస్త వస్తుజాలంలో ఉన్న ఋతం= సహజ ధర్మాలలోని ధనమేగదా మానవుడు సృష్టించుకొంటున్నానని తలంచే సమస్త ధనాలకు మూలం.
3. ఉత స్వేన క్రతునా సం వదేత:- ‘‘నీ కృషితోనే మాటలాడు’’అంటే మనిషికి చేసిన కర్మను అనుసరించియే ధనం లభిస్తుందని భావం. లోకంలో ధనాన్ని అందరూ కోరుకొంటారు గాని దానికి తగిన కర్మను చేయడంలో మాత్రం శ్రద్ధనుచూపరు. కర్మశూన్యుడికి ధనమెలా లభిస్తుంది? కాబట్టి ఋతాన్ని తెలుసుకొని ఆ జ్ఞానంచేత కేవలం మాటలాడటంకాక దానికి తగినట్టుగా కృషిచేయమని ‘క్రతునా సం వదేత’ క్రతునా= కర్మచేసి మాటలాడుమని గట్టిగా వేదం హెచ్చరించింది. ధన సంపాదన మాట ఎటున్నా అసలు జీవించాలంటే ముందు కర్మనాచరించుమని. కుర్వనే్నవేహ కర్మాణి జిజీవిషేచ్ఛత సమాః (శు.య.వే 40-2) ‘‘కర్మల నాచరిస్తూనే నూరేండ్లు జీవించాలని కోరుకో’’అని శుక్ల యజుర్వేదం శాసించింది. కర్మల నాచరించనివాడు బందిపోటుదొంగ ‘అకర్మా దస్యుః’(ఋ.10-22-8) అని ఋగ్వేదం తీర్మానించింది. ఒక మనిషి యోగ్యత కేవలం ఆతని గుణగణాల వర్ణనచేత కాదు. ఆయన కర్మశీలత చేత తెలియబడుతుంది.
4. శ్రేయాంసం దక్షం మనసా జగృభ్యాత్- ‘‘శుభప్రదమైన ఉత్సాహాన్ని మనస్సులో నింపుకో’’ అని దీని అర్థం.
మరి ఉత్సాహమంటే ఏమిటో నిర్వచిస్తూ ‘యస్మాన్న ఋతే కిం చన కర్మ క్రియతే’ (శు.య.వే 34-3) ‘‘ఏదిలేకుంటే కార్యమేదీ కూడ సంభవం కాదో అదే ఉత్సాహం’’అని శుక్లయజుర్వేదం పేర్కొంది. ఆ ఉత్సాహం సత్కర్మకూ తోడ్పడవచ్చు. దుష్కర్మకూ తోడ్పడవచ్చు. కాని ప్రస్తుత శ్రేయాంసం= రక్షణ; ‘మనసా జగృభ్యాత్’అన్న వేదవాక్యం ఆ ఉత్సాహాన్ని కేవలం ‘‘శ్రేయాంసమ్’’అన్న మాటద్వారా శుభప్రదమైన ఉత్సాహానికే పరిమితం చేసింది. అప్పుడే ఆ ఉత్సాహం కార్యనిర్వహణ సమర్థమైనది కాగలదని దక్షమ్= అన్న మరో పదం ద్వారా ధ్రువపరచింది. ఇలా చెప్పడంలో శుభప్రదం కాని ఉత్సాహం కార్యనిర్వహణ సమర్థమైనా అది జనహింసా జనకమై నిందార్హమవుతుందన్నదే వేద హృదయం. అందుకే ‘తనే్మ మనః శివసంకల్పమస్తు’ (శు.య.వే.34-1నుండి 6వరకు) ‘‘నా మనస్సు శుభసంకల్పమైనది అగుగాక’’ అని మనిషి కోరుకోవాలని శుక్లయజుర్వేదం ఆదేశించింది. మనస్సు ధర్మం సంకల్పించడమే. అది శుభప్రదం కావాలి. అందుకొఱకే మనస్సు ఉత్సాహవంతం కావాలి. అది సత్కర్మలకు సాధకం కావాలి. అదే వేద ఆంతరాహృదయం.
**
భగవన్మైత్రీఫలం
శాస ఇత్థా మహా అస్యమిత్రఖాదో అద్భుతః
న యస్య హన్యతే సఖా న జీయతే కదా చన॥
భావం:- ఓ ప్రభూ! నీవు సమస్త చరాచరాలకు శాసకుడవు కావున సర్వశ్రేష్ఠుడవు. శత్రువులను సంహారం చేసేవాడవగుట చేత అద్భుత శక్తివంతుడవు. దైవం ఎవని మిత్రుడో అతడు చంపబడడు. జీవితంలో హానినిగాని పరాజయాన్నిగాని పొందడు.
వివరణ:- ఇంద్ర ఈశాన ఓజసా ‘‘ఇంద్రుడు అనగా భగవంతుడు తన సహజసిద్ధమైన బలంచేత సమస్తానికి ప్రభువు’’అని ఋగ్వేదం నిర్దేశిస్తూంది. ఆ ఋగ్వేదమే భగవంతుని శక్తిసామర్థ్యాలను వర్ణిస్తూ-
ఉతో పతిర్య ఉచ్యతే కృష్టీనామేక ఇద్వశీ ఆ దైవమొక్కడే సమస్త చరాచర జీవులకు ప్రభువై అందరిని తన వశమందుంచుకొనువాడు’’అని కీర్తించింది. యోగదర్శన గ్రంథం ఒక అడుగు ముందుకువేసి సృష్ట్యారంభంలో మానవ కల్యాణార్థంగా వేదాలను ప్రదానంచేసి-
స ఏష పూర్వేషామపి గురుః కాలేనానవచ్ఛేదాత్‌
‘‘సర్వేశ్వరుడు అనాది ఋషులకు గురువు’’ అయ్యాడని అభివర్ణించింది.
ఇంకావుంది...