స్వాధ్యాయ సందోహం

స్వాధ్యాయ సందోహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేవతలే దానిని పానయోగ్యులై యున్నారని స్పష్టపడుతూంది. విశేషమేమంటే సోమరసాన్ని దేవతలే సిద్ధపరచినా వారు దానిని శ్రద్ధగా దంచి పిండి రసం తీసినప్పుడు మాత్రమే దానివలన శక్తి, పవిత్రత సిద్ధిస్తాయని అట్లు కాని రసం నిష్ప్రయోజనమని ‘న సోమ ఇంద్రమనసుతో మమాద’ ‘బాగా సిద్ధం చేయబడిన సోమరసం ఇంద్రుడికి ఆనందం కలిగించలేదు’’అని ఋగ్వేద మంత్రం స్పష్టపరచింది.
వేద వచనానుసారమే సోమలతనుండి రసం శ్రద్ధగా తీయబడినదే అయినా ఆ సమయంలో మనాస, వాచా, కర్మణా భగవన్నుతి చేయక యాంత్రికంగా సిద్ధంచేయబడిన ఆ సోమరసం ‘నా బ్రహ్మోణో మఘవానం సుతాసః’ ‘జ్ఞానహీనంగా మరియు భగవన్నుతి శూన్యంగా నిష్పాదితమైన సోమరసం ఇంద్రుడికి ఆనందమీయదు’’కాబట్టి ‘‘ఉక్థఉక్థే సోమ ఇంద్రం మమాద’ (ఋ.7-26-2) ‘‘్భగవంతుని ప్రత్యేక సన్నుతితో తీయబడిన సోమరసం మాత్రమే ఇంద్రుడికి ఆనందదాయకమైనది’’.
తద్భిన్నమైనది ఇంద్రుడి కెన్నడూ ప్రమోదకారి కాదు. ‘‘నీథే నీథే మఘవానం సుతాసః’ (ఋ.7-26-2) ‘ప్రత్యేకమైన నీథీ = నీతి సహితమైన క్రియాకలాపం చేత సిద్ధపరచబడిన సోమరసమే ఇంద్రుడికి ప్రమోదకారి’’కాబట్టి సోమరసాన్ని తీస్తున్న నేను ‘తస్మా ఉక్థం జనయే’ ‘‘ఇంద్ర ప్రీత్యర్థంగా దైవ స్తోత్రవచనాలను పలుకుతున్నాను’’ కారణమేమంటే ‘నా బ్రహ్మా యజ్ఞ ఋధగ్ జోషతి త్వే’ (ఋ.10-105-8) ‘‘జ్ఞాన రహితమైన యజ్ఞం ఎంతమాత్రం ప్రీతి కల్గించదు’’
గనుక అందుచేత బ్రహ్మయుక్తమైన = జ్ఞాన సహితమైన సోమమే యజ్ఞంలో హవిస్సుగా సమర్పింపబడాలి. జ్ఞానకర్మల సముచ్చయమే జగత్కల్యాణ కారకమవుతుంది. ఆత్మకు జ్ఞాన-కర్మలు రెండే రెండు రెక్కలు. ఒక రెక్కతో పక్షి ఎగరలేని విధంగా జ్ఞాన-కర్మలలో ఏది లేకున్నా తక్కినది మానవునకు కల్యాణదాయకం కాదు. వేదం సోమరసాన్ని మానవాభ్యుదయమైన ఉన్నత పదార్థంగా సంకేతించింది. దానిని పొంది సేవించి బలశాలురై సర్వులూ సుఖమయ జీవితాన్ని గడపండి.
పాపనాశనోపాయాలు
ఈజే యజ్ఞ్భిః శశమే శమీభిరృధద్వారాయాగ్నయే దదాశ
ఏవా చన తం యశసామజ్జుష్టిర్నాంహో మర్తం నశతే న ప్రదృప్తిః
భావం:కేవలం కీర్తి ప్రతిష్టలకు కాక యజ్ఞం కోసమే యజ్ఞం కూడా చేస్తుంటారు.

ఇంకావుంది...

హిందీ మూలం: స్వామీ వేదానంద తీర్థ తెలుగు అనువాదం: డా పాలకోడేటి జగన్నాథరావు