స్వాధ్యాయ సందోహం

స్వాధ్యాయ సందోహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అలా కీర్తిప్రతిష్ఠలకు గాక యజ్ఞం కోసమే యజ్ఞం చేసే, శాంత పద్ధతుల ద్వారా ప్రశాంతిని పొందే, సర్వశ్రేష్టుడైన జ్ఞానికి దానం చేసే వానికి లోకంలో కీర్తిప్రతిష్ఠలకు దారిద్య్రముండదు. అతడిని పాపం మరియు అహంకారాలంటవు.
వివరణ: ఈ మంత్రంలో పాపనాశనోపాయాలు కొన్ని వివరించబడ్డాయి.
1.ఈజే యజ్ఞ్భిః: ఆడంబరాలకు గాక కేవలం యజ్ఞం కోసమే యజ్ఞం చేయుట. శుక్ల యజుర్వేదంకూడా ‘యజ్ఞో యజ్ఞేన కల్పతామ్’ -యజ్ఞం యజ్ఞం చేతనే సఫలమవుతుంది అని ఈ అభిప్రాయానే్న చెప్పింది.
2. శమీభిః శశమే: శాంత పద్ధతుల ద్వారా ప్రశాంతిని పొందుట.
3. బుధ ద్వారాయ అగ్నయే: శ్రేష్ఠుడయిన జ్ఞానికి దానం చేయుట పరిశీలిస్తే ఈ మూడు సూత్రాలు యజ్ఞ ప్రధాన లక్ష్యాలే. వానిని వివరిస్తూ ఋగ్వేదం ఇలా పేర్కొంది.
యస్తే యజ్ఞేన సమిధా య ఉక్థైరర్క్భిః సూనో సహసో దదాశత్
స మర్త్యేష్వమృత ప్రచేతా రాయాద్యుమ్నేన శ్రవసా వి భాతి
ఓ అగ్నీ! ఎవడు యజ్ఞం, సమిధ, జ్ఞానం దీప్తి, శుభ వచనాలు, భగవదారాధనల ద్వారా నీ ప్రకాశాన్ని పొందేందుకు వానిని నీకు సమర్పిస్తాడో అతడే గొప్ప హృదయం కలవాడు. గొప్ప జ్ఞాని. అమృత స్వరూపుడు. అతడు ధనం, బ్రహ్మవర్చస్సు, యశస్సులతో లోకంలో ప్రకాశిస్తాడు.
ఈ మంత్రంలో యజ్ఞ క్రియలో ప్రధానమైన త్యాగనిరతి ప్రకటింపబడింది. యజ్ఞంలో సమర్పింపబడే సమిధాదులన్ని కేవలం ‘నీ ప్రకాశాన్ని పొందేందుకే’ అని అగ్నిని గూర్చి చెప్పడం ద్వారా స్వార్థరహితమైన యాజ్ఞికుని త్యాగనిరతియే ప్రశసింపబడింది. అట్టి త్యాగియే ఉత్తమ జ్ఞాని. మరియు అమృత స్వరూపుడు. అతడు జ్ఞానధనం చేత, వర్చస్సు చేత, కీర్తి చేత లోకంలో ప్రకాశిస్తాడు. ధనమూ, వర్చస్సూ, యశస్సూ ఈ మూడూ పూర్వజన్మ సంప్రాప్తమైన పుణ్యఫలాలు. ఇవి యజ్ఞ సమయంలో చేసే దానంవల్లనే లభిస్తాయి. పై మంత్రంలో ‘ఈజే యజ్ఞ్భిః’ అన్నవాక్యంలోని యజ్ఞ్భిః అన్న మాటకు ఒక సార్థకత ఉంది. అదేమంటే యజ్ఞం ఆడంబరానికో లేదా ప్రదర్శనకో కాక కేవలం యజ్ఞం యజ్ఞం కొరకేనన్న పవిత్రభావంతో మాత్రమే చేయబడాలి. శుక్ల యజుర్వేదం కూడా ‘యజ్ఞో యజ్ఞేనకల్పతామ్’ -యజ్ఞం యజ్ఞం చేతనే సఫలమగుగాక-అని ఋగ్వేద మంత్ర భావానే్న సమర్థించి ‘తవ క్రతుభి రమృతత్వమాయాన్’-నీకొరకు మాత్రమే చేయబడిన యజ్ఞాలవలన మహాత్ములయిన యాజ్ఞికులు మోక్షస్థితిని పొందుతున్నారు అని ఋగ్వేదం యజ్ఞ ఫలాన్ని కూడా వివరించింది.
అట్టి యజ్ఞ్ఫలాన్ని పొందిన యాజ్ఞికులు లోకంలో శాంతులై, యశోవంతులై పాపరహితులు కావడంలో ఆశ్చర్యమేముంది? అందుకే ప్రస్తుతం మంత్రం ‘యశసామజుష్టిర్నాంహో మర్తం నశతే న ప్రదృప్తిః’- అట్టివారి కీర్తికి దారిద్య్రమే ఉండదు. వారిని పాపమే అంటదు అని వాగ్దానం చేసింది. నిజమే. ‘యస్తే యజ్ఞేన.. విభాతి’ అన్న ఋగ్వేద వచనానుసారం భగవద్విభూతి మాత్రమే పొందేందుకు అగ్నిలో సమర్పణాభావంతో సర్వమూ సమర్పించే మహాత్ములకు పాపస్పర్శ ఎలా సంభవం?
ఇంకావుంది...

హిందీ మూలం: స్వామీ వేదానంద తీర్థ తెలుగు అనువాదం: డా పాలకోడేటి జగన్నాథరావు