స్వాధ్యాయ సందోహం

స్వాధ్యాయ సందోహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విద్వాంసుడు అంతట పూజింపబడతాడు
సూరో న యస్య దృశతిరరేపా భీమా యదేతిశుచతస్తఆ ధీః
హేషస్వతః శురుధో నాయమక్తోః కుత్రా చిద్రణ్వో వసతిర్వేనేజాః
భావం:ఎవని జ్ఞానం సూర్యునివలె నిర్దోషమూ, సునిశితమూ అవుతున్నదో ఎవనికి పవిత్రమైన జ్ఞానం లభిస్తున్నదో అట్టి జ్ఞాన బల సంపన్నునకు భీకరంగా జంతు గర్జనలతో ప్రతిధ్వనించే రాత్రి సమయంలోని అరణ్యప్రదేశం కూడా రమణీయమై వెలిగిపోతుంది.
వివరణ: వేదంలో జ్ఞానసంబంధమైన వర్ణనలెన్నో కనిపిస్తాయి. జ్ఞానాన్ని ప్రచారం చేయడమే ముఖ్యకర్తవ్యంగా వేదం భావిస్తుంది. శుక్ల యజుర్వేదం ‘కేతుం కృణ్వన్న కేతవే- అజ్ఞానానికి జ్ఞానదానం చేయి అని అందుకే శాసించింది.
ఎక్కడున్నా జ్ఞానికి గౌరవం సహజంగానే సిద్ధిస్తుంది. అయితే ఆ జ్ఞానులలో ఉండే జ్ఞానాలలో భేదాలుంటాయి. అన్ని జ్ఞానాలు ఉత్తమమైనవి కావు. వేద మీ మంత్రంలో నిర్దేశించింది విమల జ్ఞానానే్న. దాన్ని వివరిస్తూ ‘సూరో న యస్య దృశతిరరేపా భీమా’ - సూర్యకాంతివలె ఎవరి జ్ఞానం నిర్దోషమూ సునిశితమూ అవుతున్నదో అదే జ్ఞానమని పేర్కొంది వేదం. జ్ఞానానికి దోషాలెన్నో ఉన్నాయి. వానిలో విపర్యం (వ్యతిరేకం, వికల్పం) అవునా కాదా, సంశయం (ఇదేనా), వితర్కం (హేతురహితం) అనేవి కొన్ని. ఇట్టి దోషాలు లేక నిర్దుష్టమూ, నిర్దిష్టమూ అయిన, జ్ఞానమెవరికి ఉంటుందో అతడికే ‘యదేతి శుచతస్త ఆ ధీః’ - నీ ప్రకాశమయ జ్ఞానం లభిస్తుందని వేదం పేర్కొంది.
మినుకు మినుకుమనే మిడిమిడి జ్ఞానం మెదడంతా నిండిన అల్పజ్ఞులు మాత్రమే మనోవినోదాన్ని పొందుతారు. కాని వారికి ఆత్మ వికాసంగాని, బుద్ధిసూక్ష్మతగాని సిద్ధించదు. తీక్షణమైన సూర్యకాంతిలో ప్రాణులు తన జీవన కార్యకలాపాలను నిర్వర్తించుకొనే విధంగా దోషరహితమైన జ్ఞానంవలన మానవుడు అనాయాసంగా ఆత్మవికాసాన్ని పొందగలడు.
ఇట్టిజ్ఞానానికి భూమండలంలో విదేశమన్నదే ఉండదు. సమయం రాత్రే అయినా ఉన్నది అరణ్యమే అయినా ‘రణ్వః వసతిర్వనేజాః’-అడవికూడా రమణీయంగా వుంటుంది. ఈ భావానే్న గ్రహించి ‘స్వదేశే పూజ్యతే రాజా విద్వాన్ సర్వత్ర పూజ్యతే’ (చాణక్యనీతి) - ‘‘రాజుకు తన రాజ్యంలోనే పూజ్యత, విద్వాంసుడికి సర్వత్ర పూజ్యతయే’ అని చాణక్యుడు వచించాడు.
తపో మాహాత్మ్యం
ఇంద్రావరుణా యదృషిభ్యో మనీషాం వాచో మతిం శ్రుతమదత్తమగ్రే
యాని స్థానాన్యసృజంత ధీరా యజ్ఞం తన్వానాస్తపసాభ్యపశ్యమ్‌॥

భావం:- ఓ ఆత్మా! ఓ పరమాత్మా! మీ యిరువురు ఋషులకు ఇంతకుముందే ప్రదానంచేసిన మేధా, వాక్, బుద్ధి, జ్ఞాన శక్తుల నిచ్చియున్నారో వాటిని మరియు యజ్ఞాన్ని విస్తరింపచేస్తూ భగవద్ధ్యానతత్పరులైన ధ్యానులు ఇహ-పర లోకాలలో ఏ ఉన్నత స్థానాలను తమకొఱకు కల్పించుకొన్నారో వాటిని తపస్సుద్వారా ప్రత్యక్షంగా చూస్తున్నా.
వివరణ:- ఈ మంత్రంలో తపోమహిమతోబాటు మరో రెండు విషయాలు వర్ణింపబడుతున్నాయి. ఋషులకు మేధాశక్తి, వాక్‌శక్తి, బుద్ధిశక్తి, జ్ఞానశక్తి ఇవన్ని ఇంద్రునికి (ఆత్మకు) వరుణుని (పరమాత్మ) ద్వారా లభిస్తూ వున్నాయి. జ్ఞానానికి ఆదిమూలం భగవంతుడే. అయితే ఆత్మ అపరిపక్వ దశలో ఉంటే భగవద్దత్తమైన జ్ఞానాన్ని అది ఎలా గ్రహింపగలదు? అందుచేత జీవులకు పరమాత్మ జ్ఞానాన్ని ప్రదానం చేస్తాడు. జ్ఞానప్రదాతగా పరమేశ్వరుడే ప్రథమగురువు. ఆ తరువాతనే గురువు జ్ఞానప్రదాత. భగవంతునితోబాటుగా గురువుకూడ జ్ఞానోపదేశకుడు. కాకుంటే శిష్యుడిగా ఉన్న జీవుడికి జ్ఞాన లబ్ధి శూన్యమే.
యజ్ఞపరాయణులు, పరోపకార తత్పరులైన మహాత్ములు మరియు దైవధ్యాన తత్పరులు ఇహ-పరలోకాలలో తమకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని కల్పించుకొంటారు. కాని తపస్సు మహిమ ఎంత ఘనమైనదంటే పరోపకారం మరియు దైవధ్యానాలవలన ఆ మహాత్ములు పొందే సమస్త ఇహ-పరలోకాలన్నింటిని తపో నిష్ఠాగరిష్ఠులైన తపస్వి జనులు పొందగలరు. అందుచేత తైత్తిరీయోపనిషత్తులో ‘తపోబ్రహ్మ’ తపమే బ్రహ్మం.
- ఇంకాఉంది

హిందీ మూలం: స్వామీ వేదానంద తీర్థ తెలుగు అనువాదం: డా పాలకోడేటి జగన్నాథరావు