స్వాధ్యాయ సందోహం

స్వాధ్యాయ సందోహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘తపసా బ్రహ్మ విజిజ్ఞాసస్వ’ (తై.ఉ.్భృగువల్లి 2) తపస్సు చేతనే బ్రహ్మను తెలుసుకో ఇత్యాది తపోవిధాయక వాక్యాలు కనబడతాయి. వేదంలో కూడ ‘తపా తపిష్ఠ తపసా తపస్వాన్’ (ఋ.6-5-4) ‘‘ఓ తపః కర్మిష్టా! తపస్సు చేత తపస్వినై తపమాచరించు’’మనే ఆదేశాలూ కనబడతాయి.
తపస్సు చేసేందుకు హృదయంలో తపన ఎంతో అవసరం. పిరికివాడు తపస్సు చేయలేడు. అందుకే వేదం తపస్సును చేయమన్న పై ఆదేశంలో తపిష్ఠ= గొప్ప తపస్వివి అనగా గొప్ప తపస్సుచేసే ధైర్యవంతుడవు కావాలి అనే పదాన్ని ప్రయోగించింది. మనుస్మృతి తపస్వి కానివాని దుర్గతిని వర్ణిస్తూ అతడు కనీసం దాన స్వీకరణకు కూడ అయోగ్యుడని ఇలా వర్ణించింది.
అతపాస్త్వనధీయానః ప్రతిగ్రహరుచిర్ద్విజః
అంభస్యశ్మప్వేనేవ సహ తేనైవ మజ్జతి
త్రిష్వప్యేతేషు దత్తం హి విధినాప్యార్జితం ధనమ్‌
దాతుర్భవత్యనర్థాయ పరత్రాదాతురేవ చ॥ మను. 4-190, 193
భావం:- తపస్సు చేయనివాడు, వేదం చదువనివాడు అయిన దానగ్రహణాతురుడగు బ్రాహ్మణుడు రాతి పడవలో ఎక్కినవాడు మునిగిపోయినట్లుగా అన్నివిధాల చెడిపోతాడు. ఎందుకంటే వారు దానగ్రహణకు అనర్హులు. అంతేకాక వారు పరలోకప్రాప్తిని కూడ పొందజాలరు.’’ ఎందుకంటె న్యాయార్జితమైన ధనాన్ని వీరికి దానం చేయడం వలన దాతకనర్థం కలుగుతుంది. మరియు దానాన్ని గ్రహించినవాడు పరలోకప్రాప్తిని పొందలేడు’’. దీనినిబట్టి తపస్వి కానివాడు భవసాగరంలో నిండామునిగిపోతాడని గ్రహించాలి.
మనువు బ్రాహ్మణుడికి తపస్సే శ్రేయోదాయకమని భావించాడు. ‘తపో విద్యా చ విప్రస్య నిఃశ్రేయసకరం పరమ్’ (మ.స్మృ 12-104) మరి మనువే తానుచెప్పిన నిఃశ్రేయసమంటే ఏమిటో వివరిస్తూ ‘న విస్మయే త్తపసా’ (మ.స్మృ 4-236) ‘‘తపస్సువలన అహంకారాన్ని పొందవద్దు. జాగరూకుడవైయుండుము’’ ఎందుకంటే ‘తపఃక్షరతి విస్మయాత్’ (మ.స్మృ 4-237) ‘‘అహంకారంవలన తపస్సు భ్రష్టమవుతుంది’’అని వివరించాడు. ఋగ్వేదం ఆ భ్రష్టత ఎట్టిదో పేర్కొంటూ ‘అతప్తనూర్న తదామో అశ్నుతే’ (ఋ.9-83-1) ‘‘ఆ సుఖాన్ని తపస్వికానివాడు పొందలేడు’’అని శాసించింది. ఇక్కడ ఋగ్వేదం చెప్పిన ‘‘ఆ సుఖం’’ ఇహలోక పరలోక సుఖాలు రెండూ కూడ. అంటే తపస్వి మాత్రమే ఆ ఇహ-పర సుఖాలను పొందగలడని వేదాభిప్రాయం. దీనిని అదే మంత్రంలో ‘శృతాస ఇద్వహంత- స్తత్సమాశత’ (ఋ.9-83-1) తపస్సుచేత పరిపక్వత చెంది, తాను బ్రహ్మానందాన్ని పొంది, ఇతరులచేత కూడ పరిపూర్ణంగా అనుభవింపచేయగలడు’’ అని ఋగ్వేదం స్పష్టపరచింది. అగ్ని తనతో సంయోగం చెందిన ఇనుమునకు కూడ అగ్ని లక్షణాలను కల్పించినట్లు తపస్వులు తమ తపఃశక్తిని ఇతరులకు కూడ ప్రదానం చేయగలరు.
వివాహ ప్రశంస
తదినే్మ ఛంత్సద్వపుషో వపుష్టరం పుత్రోయజ్ఞానం పిత్రో రధీయతి
జాయా పతిం వహతి వగ్నునా సుమత్పుంస ఇద్భద్రో వహితుః పరిష్కృతః॥ ॥
భావం:- తల్లిదండ్రుల సంతాన తంతువును తానుకొనసాగించాలని అంటే తాను సంతానవంతుడను కావాలని ఉత్సాహంగా కుమారుడు పలుమార్లు పలుకుతూ ఉంటాడో ఆ సందర్భం ఎంతో అందమైన దృశ్యం కంటే అందంగా తల్లిదండ్రులకు భాసిస్తుంది. భార్య కాబోయే స్ర్తియే భర్తను వరించి పెండ్లాడుతుంది. అప్పుడే పురుషుడికి ఉత్తమమైన వివాహం సుసంపన్నమవుతుంది.
వివరణ:- ఒక మంచి గృహస్థుని మనోభావన ఎలా ఉంటుందో ఈ మంత్రం వివరించింది. వివాహానికి సాఫల్యం సంతాన యోగమే. అప్పుడే గృహస్థుడికి ప్రప్రథమ సంతోషభావన కలుగుతుంది. ఆ తరువాత వానికి కలిగే రెండవ సంతోషం ఆ పుత్రుడు ‘పుత్రో యజ్ఞానం పిత్రో రధీయతి’ ‘‘నేను తల్లిదండ్రుల సంతాన తంతువును కొనసాగించాలని తన తల్లిదండ్రులతో పలుమార్లు పలికినప్పుడే’’. ‘తదినే్మ ఛంత్సద్వపుషో వపుష్టరమ్’ ‘‘నాకు సౌందర్య వస్తువును చూచే ఆకాంక్ష కంటే సుందరమైన మాట. ఆనందజనకమవుతుంది. ఈ విధంగా ఈ మంత్రం గార్హస్థ్య ధర్మాచరణ ద్వారా మానవులకు కలిగే ఆనందాన్ని ప్రత్యక్షంగా ప్రస్తావించి పరోక్షంగా మరో రెండు గుర్తింపదగిన న్యాయసూత్రాలను వర్ణించింది.

- ఇంకాఉంది

హిందీ మూలం: స్వామీ వేదానంద తీర్థ తెలుగు అనువాదం: డా పాలకోడేటి జగన్నాథరావు