స్వాధ్యాయ సందోహం

స్వాధ్యాయ సందోహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పుత్రో యజ్జానం పిత్రో రధీయతి:- తానూ సంతానవంతుడను కావాలనే కోరకను తల్లిదండ్రుల ఎదుట పలుమార్లు ప్రస్తావించిన కుమారుని మాటలు తల్లిదండ్రులకు సంతోషాన్ని కల్గిస్తుందని బాహ్యార్థమే అయినా సంతానోత్పత్తి చేయగల వయస్సునకు చేరిన తరువాత గాని కుమారునకు వివాహం చేయరాదని వేదం అంతరార్థంగా ప్రకటిస్తూంది. అంటే బాల్యవివాహం చేయవద్దని పరోక్షంగా వేదం శాసించిందని భావించాలి. దానితోబాటు యుక్తవయస్సునకు వచ్చిన కొడుకే అయినా అతనిలో సంతానాపేక్ష జనింపక వైరాగ్య దశలో నడిచే వానికి వివాహం జరపరాదని కూడ వేదం హెచ్చరిక చేస్తూందని గ్రహించవలసియుంది. ఎందుకంటే వివాహోత్కంఠ లేని వ్యక్తిలో భార్యను పోషించే ఉత్సుకత గాని కర్తవ్య నిష్ఠగాని ఏర్పడదు కదా. వివాహ ప్రక్రియలో ‘మమేయ మనస్తు పోష్యా’ (అథర్వ.వే. 14-1-52) ‘‘నేటి నుండి ఈ వధువు నాచే పోషింపబడును’’ అని వరుడు ప్రతిజ్ఞ చేయవలసి యుంది. ఆ ప్రతిజ్ఞను అట్టివాడు నిర్వహింపలేక విఫలుడవుతాడు కదా. కాబట్టి భార్యను పోషింపగల సమర్థత ఏర్పడిన వ్యక్తికే వివాహం జరిపించాలని వేదం జ్ఞాపకం చేస్తూందని తెలుసుకోవాలి.
2. జాయా పతిం వహతి:- ‘‘్భర్య భర్తను వివాహమాడుతుంద’’ని ఈ వాక్యార్థం. ఇందు విశేషమేముందని భావించరాదు. ‘వివాహంలో వరుని ఎన్నుకొనే అధికారం స్ర్తిదే సుమా’ అని ఈ వాక్యంలోని మర్మాంశం. స్ర్తి ఇష్టాఇష్టాలతో నిమిత్తం లేక వివాహం జరిగితే ‘పతిః జాయం వహతి’ అని వేదం వాక్య నిర్మాణం చేసి ఉండేది. అప్పుడది నేటి పురుషాధిక్య సమాజానికి ప్రతిబింబమై ఉండేది. కాబట్టి వేదం స్ర్తికి వివాహంలో పూర్తి స్వేచ్ఛ ఇచ్చినట్లు ఆ విధంగా స్ర్తిని గౌరవించినట్లుగా నాటి సమాజస్థితిని వేదం ప్రకటించింది.
**
విశ్వ కల్యాణ భావన
స్వస్తి మాత్ర ఉత పిత్రే నో అస్తు స్వస్తి గోభ్యో జగతే పురుషేభ్యః
విశ్వం సుభూతం సువిదత్రం నో అస్తు జ్యోగేవ దృశేమ సూర్యమ్‌॥
భావం:- మా తల్లిదండ్రులకు, గోవులకు, సమస్త జీవులకు సదా శుభమే కలుగునుగాక! మా కొఱకై విశ్వమంతా సమున్నతమై, సర్వప్రదాయినియగుగాక! చిరకాలమూ మేము సూర్యుణ్ణి చూస్తూ జీవించెదము గాక!.
వివరణ:- ప్రతి వ్యక్తి సర్వులకు శుభం కలగాలని కోరుకోవాలి. వారిలో ముఖ్యంగా తల్లిదండ్రులకు శుభమూ, ఆనందమూ కలగాలని కోరుకోవాలి. తల్లిదండ్రుల ఎడల ప్రతి వ్యక్తికి తప్పక ఉండదగిన ఈ శుభకామన సమస్త శాస్త్ర గ్రంథాలలో విశేషంగా ప్రస్తావించబడింది. శైశవ దశనుండి తమ బిడ్డల ఆలన-పాలనలో తల్లిదండ్రులు నిత్యమూ పడే కష్టానికి ఏ బిడ్డ పరిహారం చెల్లించదగదు? క్రుద్ధుడయిన తండ్రి ‘మృత్యవే త్వా పరిదదామి’ ‘‘నిన్ను మృత్యుదేవతకు దానం చేస్తున్నాను’’అని పలుకగా యమపురికి చేరిన నచికేతుడు యమద్వారం ముందు మూడు దినాలు వేచియుండి నీకు మూడువరాల నిస్తాను కోరుకొమ్మన్న యముడిని కోరుకొన్న మూడు వరాలలో మొదటి వరం తన తండ్రికి శుభం కలగాలన్నదే. చూడండి.
శాంత సంకల్పః సుమనా యథా స్యాద్వీతమన్యుర్గౌతమో మాభి మృత్యో!
త్వత్ప్రసృష్టం మాభివదేత్ ప్రతీత ఏతత్ త్రయాణాం ప్రథమం వరం వృణే॥
‘‘ఓ యమరాజా! నేను కోరే మూడు వరాలలో మొదటిది నా తండ్రి గౌతముడు క్రోధాన్ని విడిచి ప్రసన్నుడు కావాలి. మరియు ఆయన వద్దకు చేరిన నన్ను ప్రసన్నంగా పలుకరించి ఆదరించాలి’’. తల్లిదండ్రుల ఎడల బిడ్డలకు ఎట్టి సద్భావన ఉండాలో ఘట్టం స్పష్టం చేస్తూంది. అందుకే జీవిత పర్యంతమూ ఆచరింపదగిన పంచమహాయజ్ఞాలలో పితృయజ్ఞాన్ని ఋషులుచేర్చి దానిని ఒక యజ్ఞంగా విధించారు.
పితృయజ్ఞంగా మాతాపితృపూజనంతోబాటుగా గోఆరాధన కూడ ఒక ప్రధాన విధిగా వేదం శాసించింది. ఆవు వలన యజ్ఞాలు నిర్వహింపబడి దేవతాప్రీతి కలుగుతుంది. సమస్త జీవులకు ఆహారాన్ని ఉత్పాదన చేసే వ్యవసాయం వృద్ధి పొందుతుంది. దాని ద్వారా పాడిపంటలు వృద్ధిచెంది మానవులకు ఆర్థికాభివృద్ధి ఏర్పడుతుంది. మరి అట్టి గోపూజనం- గోసంరక్షణం మానవుల ప్రధానకర్తవ్యంగదా!
ఈ రెండింటితోబాటు ‘స్వస్తి జగతే పురుషేభ్యః’ ‘జగత్తులోని సమస్త జీవులకు శుభం మరియు సుఖమే కలగాలి’’అనే విశ్వకల్యాణ భావన కలిగియుండాలనే ఉదారాశయాన్ని వేదం ప్రతి మనిషికి విధించింది. అంటే తన సుఖమూ, సంతోషమూ సమస్త జనుల- జీవుల సుఖ సంతోషాలలోనే సమ్మిళితమై యుందని వేదం అన్ని వేల ఏండ్లనాడే ప్రపంచానికి సార్వజనీన, సార్వకాలిక సందేశాన్ని అందించింది. ఈ వసుధైక కుటుంబ భావన లోకంలో-
సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః
సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్దుఃఖభాగ్ భవేత్‌॥
అనే ప్రసిద్ధ శ్లోకంగా అందరకు పరిచితమే. ఇది పై వేదమంత్ర హృదయావిష్కరణమే.
పై శ్లోకం పండిట్ జీవారామ్ విద్యాసాగర్‌గారు సంపాదకత్వంలో వెలువడిన గరుడ పురాణంలో చిన్న పాఠ భేదంతో కనబడుతుంది.
- ఇంకాఉంది

హిందీ మూలం: స్వామీ వేదానంద తీర్థ తెలుగు అనువాదం: డా పాలకోడేటి జగన్నాథరావు