స్వాధ్యాయ సందోహం

స్వాధ్యాయ సందోహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈ సత్యధర్మ విరహితులు దేశాన్ని ఎంతటి అధోగతికైనా దిగజార్చుతారు. సత్యమహిమను వర్ణిస్తూ ‘సత్యేనోత్త్భితా భూమిః’ (అథర్వణవేదం. 14-1-1) ‘‘సత్యధర్మం మీదనే భూమి నిలిచియుంది’’అని అథర్వణవేదం హెచ్చరించింది. మనుస్మృతి కూడ ‘నాస్తి సత్యాతృపరో ధర్మః’ ‘‘సత్యాన్ని మించిన ధర్మంలేదు’’ అని వేద సందేశానే్న నిర్దేశించింది.
బృహత్:- అన్నింటికన్న మిన్న అని ఈ పదానికర్థం. అంటే దేశ పౌరులకు అన్నింటకన్న మిన్నగా కోరదగినది ఆ సత్యధర్మమే కావాలి. ఈ భావన లేని పౌరుల వలన దేశం పారతంత్య్రం కావడానికి ఎంతో సమయం పట్టదు.
ఋతమ్:- ధర్మప్రవర్తన, నియమపాలన ఋత శబ్దానికర్థం. ఈ ఋతం వైయక్తిక జీవితానికెంత ముఖ్యమో సామాజికపరంగా సర్వజనాభివృద్ధి, దేశ స్వతంత్ర సంరక్షణకు కూడ పౌరులయందీగుణం అంతే అవసరం. అందుకే ఋగ్వేదం ఈ ఋత ప్రాముఖ్యాన్ని ‘ఋతస్య దేవా అను వ్రతా గుః’ (ఋ.1-65-2) ‘‘దేవతాభక్తులు సహకరించేది ఋతానుకూలశీలురకు మాత్రమే’’అని నిర్దేశించింది. ఒక గ్రామమో, దేశమో కాదు సమస్తమైన ద్యావాపృథువులన్నీ ఈ ఋతధర్మం మీదనే ఆధారపడి మనుగడ సాగిస్తూ ఉన్నాయని ‘ఋతాయ పృథివీ బహులే గభీరే’ (ఋ.4-32-10) ఋగ్వేదం ఒకసారి చెప్పిన విషయానే్న ప్రాధాన్యదృష్ట్యా మరోసారి చెప్పింది.
ఉగ్రమ్:- తీక్ష్ణమైన బల, వీర్య, మనోధైర్య సంపన్నత ఉగ్ర శబ్దానికి అర్థం. ఇది ఒక అసాధారణమైన కేవలం సంకల్పబల సంపన్నులయందు మాత్రమే కానవచ్చే అద్భుత లక్షణం. ఆ స్వతంత్య్ర పరిరక్షణకు ఎంతటి బృహత్ సంకల్పమున్నవారయినా తీవ్ర ప్రతిఘటన ఎదురయినపుడు మాత్రం వారు కొంత నిరుత్సాహానికి గురయి వెనుకంజ వేయవచ్చు. కాని ఎవరో కొందరినిమాత్రమే మొక్కవోని ధైర్యంతో దేశ స్వాతంత్య్ర రక్షణకు ఆత్మబలిదానం చేయగల మహాత్యాగులుగా ప్రోత్సహించే గుణమే ఈ అద్భుతమైన ఈ ఉగ్రశీలం. వారివలన మాత్రమే దేశ స్వాతంత్య్ర- దేశ రక్షణ సాకారమవుతుంది. వారే మాతృభూమికి పుత్ర రత్నాలుగా, జాతిపితలుగా, మహావీరులుగా, చిరస్మరణీయులై ప్రజల హృదయాలలో చిరంజీవులై వర్ధిల్లుతూ ఉంటారు.
దీక్షా:- దృఢ సంకల్పమే దీక్ష. సంశయ రహితంగా విఘ్నాలను ఎదుర్కొంటూ కార్యసంసిద్ధిపర్యంతమూ కొనసాగించే కృషియే ‘దీక్ష’అని చెప్పవచ్చు. ఈ దీక్ష లేకుండా పైన పేర్కొన్న గుణాలెన్ని వున్నా సంకల్పసిద్ధి కలుగదు. ఈ విధంగ సంకల్పసిద్ధి జనకమైన దీక్షను ప్రశంసిస్తూ-
భద్ర మిచ్ఛంత ఋషయః స్వర్విదస్తపోదీక్షాముపనిషేదురగ్రే
॥ 19-41-1॥
‘‘బ్రహ్మానంద ప్రాప్తి రహస్యాన్ని తెలుసుకోవాలనే జ్ఞానులు ఆ శుభసంకల్పానికి ముందరగా తపస్సుకు మరియు దీక్షకు పూనుకుంటారు’’ అని అథర్వణ వేదం పేర్కొంది.
తపస్సు:- కార్యసంసిద్ధికి సాగించే తీవ్ర కృషియే తపస్సు. దీనినే వేదాంత శాస్త్రం ‘తితిక్ష’అని అంటుంది. ‘శ్రేయాంసి బహు విఘ్నాని’ ‘‘శుభారంభానికి ఆటంకాలెక్కువ’’అన్న వచనానుసారం సంకల్పం సాకారత ధరించే లోగా ఎన్నో విఘ్నాలు ఎదురవుతాయి. వానిని లెక్కచేయక కార్యసాఫల్యపర్యంతమూ కొనసాగించే కృషియే తపస్సు. ఇది కేవలం దేశ స్వాతంత్య్ర సిద్ధికొరకే కాదు ఏ కార్యక్షేత్రానికయినా అన్వయిస్తుంది.
బ్రహ్మ:- బ్రహ్మచర్యమూ ఆత్మజ్ఞానమూ అని ఈ పదానికర్థం. దేశ స్వాతంత్య్ర సంసిద్ధికై కృషిచేస్తున్నవారీ విషయంలో బహుజాగరూకులై ఉండాలి. ఒక వ్యక్తిలో స్వాతంత్య్రాభిలాష ఎంత ఉన్నా సగటు మనిషిగా అతడిలో సహజంగా ఉండే బలహీనతలు ఎంతోకొంత ప్రమాణంలో ఉండకపోవు. ధనకాంక్ష, కీర్తికాంక్ష, అధికార కాంక్ష, పదవీ కాంక్ష ఇలా ఎన్నైనా చెప్పవచ్చు. అట్టివానిలో స్ర్తికి పురుషవాంఛ, పురుషుడికి స్ర్తివాంఛ చాల మిన్నయైనది. ఇది వ్యక్తులను అధఃపతితులను చేసివేస్తుంది. నచికేతుణ్ణి బ్రహ్మజిజ్ఞాస నుండి విముఖుణ్ణి చేసేందుకు ఎరచూపించి వరాన్ని కోరుకొమ్మన్న ‘ఇమా రమాః సరథాః సతూర్యాః’ (కఠో.1-1-24) ‘‘ఇరుగడల గజాలు, రథాలు వెంటరాగా చేరవచ్చే రమణీమణులు కావాలా?’’అనియే. కాబట్టి స్వాతంత్య్ర సంరక్షకులు తమ బ్రహ్మచర్య సంరక్షణలో బహుజాగరూకులై యుండాలి. ఒక్క దేశ సంరక్షక పౌరులకే కాదు సాక్షాత్తు దేశ పాలకుడికి కూడ దేశం బ్రహ్మచర్య పరిరక్షణ ముఖవిధిగా విధించింది. ‘బ్రహ్మచర్యేణ తపసా రాజా రాష్ట్రం వి రక్షతి’ (అథర్వణవేదం. 11-5-17) ‘‘బ్రహ్మచర్య రూపమైన తపస్సుచేత రాజు దేశాన్ని విశేషంగా సంరక్షించాలి’’అన్న అథర్వసూక్తి నాటి రాజులకే కాదు నేటి ప్రజారాజులకు ప్రజారంజకులకెంతో ఆదర్శం.
యజ్ఞం:- యజ్ఞశబ్దం బహ్వర్థకమైన శబ్దం. స్వార్థత్యాగం, దుఃఖార్తుల దుఃఖనివారణ, పరహిత చింతన, పరోపకార పరాయణత, దేశ సంక్షేమంకోసం సర్వవిధ వస్తూత్పత్తిచేయడం.

- ఇంకాఉంది

హిందీ మూలం: స్వామీ వేదానంద తీర్థ తెలుగు అనువాదం: డా పాలకోడేటి జగన్నాథరావు