స్వాధ్యాయ సందోహం

స్వాధ్యాయ సందోహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తీక్ష్ణమైన బల, వీర్య, మనోధైర్య సంపన్నత ఉగ్ర శబ్దానికి అర్థం. ఇది ఒక అసాధారణమైన కేవలం సంకల్పబల సంపన్నులయందు మాత్రమే కానవచ్చే అద్భుత లక్షణం. ఆ స్వతంత్య్ర పరిరక్షణకు ఎంతటి బృహత్ సంకల్పమున్నవారయినా తీవ్ర ప్రతిఘటన ఎదురయినపుడు మాత్రం వారు కొంత నిరుత్సాహానికి గురయి వెనుకంజ వేయవచ్చు. కాని ఎవరో కొందరినిమాత్రమే మొక్కవోని ధైర్యంతో దేశ స్వాతంత్య్ర రక్షణకు ఆత్మబలిదానం చేయగల మహాత్యాగులుగా ప్రోత్సహించే గుణమే ఈ అద్భుతమైన ఈ ఉగ్రశీలం. వారివలన మాత్రమే దేశ స్వాతంత్య్ర- దేశ రక్షణ సాకారమవుతుంది. వారే మాతృభూమికి పుత్ర రత్నాలుగా, జాతిపితలుగా, మహావీరులుగా, చిరస్మరణీయులై ప్రజల హృదయాలలో చిరంజీవులై వర్ధిల్లుతూ ఉంటారు.
దీక్షా:- దృఢ సంకల్పమే దీక్ష. సంశయ రహితంగా విఘ్నాలను ఎదుర్కొంటూ కార్యసంసిద్ధిపర్యంతమూ కొనసాగించే కృషియే ‘దీక్ష’అని చెప్పవచ్చు. ఈ దీక్ష లేకుండా పైన పేర్కొన్న గుణాలెన్ని వున్నా సంకల్పసిద్ధి కలుగదు. ఈ విధంగ సంకల్పసిద్ధి జనకమైన దీక్షను ప్రశంసిస్తూ-
భద్ర మిచ్ఛంత ఋషయః స్వర్విదస్తపోదీక్షాముపనిషేదురగ్రే
॥ 19-41-1॥
‘‘బ్రహ్మానంద ప్రాప్తి రహస్యాన్ని తెలుసుకోవాలనే జ్ఞానులు ఆ శుభసంకల్పానికి ముందరగా తపస్సుకు మరియు దీక్షకు పూనుకుంటారు’’ అని అథర్వణ వేదం పేర్కొంది.
తపస్సు:- కార్యసంసిద్ధికి సాగించే తీవ్ర కృషియే తపస్సు. దీనినే వేదాంత శాస్త్రం ‘తితిక్ష’అని అంటుంది. ‘శ్రేయాంసి బహు విఘ్నాని’ ‘‘శుభారంభానికి ఆటంకాలెక్కువ’’అన్న వచనానుసారం సంకల్పం సాకారత ధరించే లోగా ఎన్నో విఘ్నాలు ఎదురవుతాయి. వానిని లెక్కచేయక కార్యసాఫల్యపర్యంతమూ కొనసాగించే కృషియే తపస్సు. .
బ్రహ్మ:- బ్రహ్మచర్యమూ ఆత్మజ్ఞానమూ అని ఈ పదానికర్థం. దేశ స్వాతంత్య్ర సంసిద్ధికై కృషిచేస్తున్నవారీ విషయంలో బహుజాగరూకులై ఉండాలి. ఒక వ్యక్తిలో స్వాతంత్య్రాభిలాష ఎంత ఉన్నా సగటు మనిషిగా అతడిలో సహజంగా ఉండే బలహీనతలు ఎంతోకొంత ప్రమాణంలో ఉండకపోవు. ధనకాంక్ష, కీర్తికాంక్ష, అధికార కాంక్ష, పదవీ కాంక్ష ఇలా ఎన్నైనా చెప్పవచ్చు. అట్టివానిలో స్ర్తికి పురుషవాంఛ, పురుషుడికి స్ర్తివాంఛ చాల మిన్నయైనది. ఇది వ్యక్తులను అధఃపతితులను చేసివేస్తుంది. నచికేతుణ్ణి బ్రహ్మజిజ్ఞాస నుండి విముఖుణ్ణి చేసేందుకు ఎరచూపించి వరాన్ని కోరుకొమ్మన్న ‘ఇమా రమాః సరథాః సతూర్యాః’ (కఠో.1-1-24) ‘‘ఇరుగడల గజాలు, రథాలు వెంటరాగా చేరవచ్చే రమణీమణులు కావాలా?’’అనియే. కాబట్టి స్వాతంత్య్ర సంరక్షకులు తమ బ్రహ్మచర్య సంరక్షణలో బహుజాగరూకులై యుండాలి. ఒక్క దేశ సంరక్షక పౌరులకే కాదు సాక్షాత్తు దేశ పాలకుడికి కూడ దేశం బ్రహ్మచర్య పరిరక్షణ ముఖవిధిగా విధించింది. ‘బ్రహ్మచర్యేణ తపసా రాజా రాష్ట్రం వి రక్షతి’ (అథర్వణవేదం. 11-5-17) ‘‘బ్రహ్మచర్య రూపమైన తపస్సుచేత రాజు దేశాన్ని విశేషంగా సంరక్షించాలి’’అన్న అథర్వసూక్తి నాటి రాజులకే కాదు నేటి ప్రజారాజులకు ప్రజారంజకులకెంతో ఆదర్శం.
యజ్ఞం:- యజ్ఞశబ్దం బహ్వర్థకమైన శబ్దం. స్వార్థత్యాగం, దుఃఖార్తుల దుఃఖనివారణ, పరహిత చింతన, పరోపకార పరాయణత, దేశ సంక్షేమంకోసం సర్వవిధ వస్తూత్పత్తిచేయడం. ఇలా ఎన్నో అర్థాల నిమిడించుకొన్న కార్యాచరణ రూపమే యజ్ఞం. యజుర్వేదంలోని 18వ అధ్యాయంలోని మొదటి ముప్పది ఎనిమిది మంత్రాలలో యజ్ఞార్థంగా జీవనోపయోగియైన సమస్త పదార్థాలను చెప్పి ఒక ప్రత్యేక మంత్రంలో ‘యజ్ఞేన కల్పంతామ్’ ‘‘ఈ పదార్థాలన్ని యజ్ఞార్థాలు కావాలి’’ అని ఆదేశం కనబడుతుంది.
కాబట్టి సర్వభూత రహితమైన సమస్త కార్యాలు యజ్ఞార్థకాలే. ఈ మాట ననుసరించి దానం, సత్సంగం, సత్పురుషుల పూజ ఇలా ఎన్నింటినో ఈ యజ్ఞార్థాలుగా స్వీకరించవచ్చు. ఈ అంశాలన్ని వైయక్తికంగానే గాక సామాజికపరంగా దేశ సంరక్షణార్థమై మహాయజ్ఞ స్వరూపవౌతాయి. సత్సంగం వ్యక్తిని ఉన్నతుణ్ణిచేస్తుంది. దేశ సంరక్షకులు మరో దేశ సంరక్షకులతో సత్సంగంచేస్తే వారిలో నూతన భావాలుదయించి దేశ సంరక్షణ విషయంలో ద్విగుణీకృతమైన ఉత్సాహం కనిస్తుంది.
- ఇంకాఉంది

హిందీ మూలం: స్వామీ వేదానంద తీర్థ తెలుగు అనువాదం: డా పాలకోడేటి జగన్నాథరావు