స్వాధ్యాయ సందోహం

స్వాధ్యాయ సందోహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అలాగే సత్పురుషుల ఆరాధన. సమాజపరంగా అది జరగకుంటే వారు నిరాదరణ వేదనాభరితులై దేశానికి అవసరమైన స్థాయిలో తమ సేవలనందించలేకపోతారు. ఆ విధంగా దేశ సంరక్షణా దృష్ట్యా ప్రతి అంశాన్ని యజ్ఞ భావనతో పౌరులు నిర్వహించవలసి యుంది. ఈ గుణాలు ఏనాటికైనా సార్వజనీనమైనవి. సార్వకాలికమైనవి.
చివరగా ప్రతి వ్యక్తి తన మాతృదేశం మీద ఎట్టి భావం కలిగియుండాలో మహోన్నతంగా ‘సానో భూతస్య... కృణోతు’ ‘‘్భత భవిష్య ద్వర్తమాన కాలాలలో సంరక్షించే ఈ మాతృభూమి మాకు సదా గౌరవ చిహ్నమై వెలుగుగాక’’అని మంత్రం ప్రబోధించింది. ఒక్క ఋగ్వేదమే గాదు అథర్వణవేదం కూడ ‘యస్యాం పూర్వే పూర్వజనా విచక్రిరే యస్యాం దేవా అసురా నభ్యవర్తయన్’(అథ.12-1-5) ‘‘దేశ సంరక్షణార్థం ధర్మాత్ములైనవారు పాపులను చంపిన పూర్వుల పరాక్రమ వ్యాప్తమైనదీ దేశం’’అని మాతృదేశ ప్రశంస చేసింది. ఇట్టి మహాదేశభక్తుల ప్రశంస ఏ దేశ పౌరుల హృదయాలను దేశభక్తితో పులకింపచేయదు? అట్టివారి దేశభక్తి చరిత్రలు కేవలం స్వదేశీయులనే కాదు, ఏ దేశీయుల హృదయాలలో దేశభక్తి ప్రపూరితోత్సాహాన్ని నింపదు?
**
స్ర్తి ద్రవ్యాన్ని తాకరాదు

అశ్లీలా తనూర్భవతి రుశతీ పాపయాముయా
పతిర్యద్వధ్వో వాససః స్వమంగమభ్యూర్ణుతే॥ (అథర్వణవేదం 14-1-27॥
భావం:- మెరిసే సౌందర్యం కలవాడా! భర్త తన భార్యకు చెందిన వస్త్రంతో తన శరీరాన్ని కప్పుకొంటే అతడు తన పాపపు నడవడిక చేత చరిత్రహీనుడు అనగా శీలరహితుడు కాగలడు.
వివరణ:- పురుషుడు భార్య ధనాన్ని వినియోగించుకోరాదని వ్యంజనావృత్తి సహితమైన వాక్య విన్యాసంతో ఈ మంత్రం రమణీయంగా చెప్పింది. భార్యకు చెందిన వస్త్రాన్ని పురుషుడు కప్పుకోవడమన్నది ఎప్పుడూ ఎవడూ సాధారణంగా చేసేపని కాదు. కాని మంత్రమీవిధంగా చెప్పడంలో ఆంతర్యం మానసంరక్షణ కొఱకే అయినా సరే స్ర్తిల వస్త్రంతో సహా వారి ఏ వస్తువునుగాని ధనాన్ని వినియోగించరాదన్నదే వేదాభిమతం. అలా ఎవడైనా ఉపయోగించుకొంటే అతడు చరిత్రహీనుడు అని ఆన పెట్టింది వేదం. రుశతీ= మిల మిల మెరిసే శరీర సౌందర్యం కలవాడా అని సంబోధించి చెప్పడంలో అట్టి పని బాహ్య శరీర సౌందర్యమే తప్ప ఆంతర హృదయ సౌందర్యమున్నవాడు మాత్రం ఆచరింపడని వ్యంగ్యంగా చెప్పడమే వేద కవితాత్మ.
భార్య భర్తచేత పోషింపబడ దగినదేగాని ఆమె భర్తను పోషించవలసిన కర్తవ్యం కలది కాదని అభిప్రాయపడిన అథర్వణవేదం పెళ్ళినాడు ‘మమేయమస్తు పోష్యా మహ్యం త్వాదాద్ బృహస్పతిః’ (అథ.14-1-52) ‘‘ఈ వధువు ఇకనుండి నా చేత పోషింపబడదగినది. అందుకే దైవమీమెను నాకు భార్యగా ఇచ్చాడు.’’అని వరునిచేత ప్రమాణం చేయించింది. కాబట్టి భార్య ద్రవ్యాదులను ఉపయోగించుకొన్న పురుషుడు పెళ్లినాటి ప్రమాణాన్ని ఉల్లంఘించినట్లే అవుతుంది. అంతేకాదు పోషించదగిన భార్యభర్తకు పోషకురాలవుతుంది. ఈ వేదసందేశాన్ని పెడచెవిని పెట్టినవాడు భార్య వస్త్రాన్ని (చీరను) కట్టుకొన్న చరిత్రహీనుడైన పురుషుడేనని వేదం నిందించింది. ‘నవ్విపోదురుగాక నాకేమి సిగ్గు’అని మీరు ఆచరించరు కదా?
**
దంపతులారా! కలిసి నూరేండ్లు ఆనందంగా జీవించండి
ఇహైవ స్తం మా వి ష్టం విశ్వవాయుర్వ్యశ్నుతమ్‌ క్రీళంతౌ పుత్రైర్నప్తృభిర్మోదమానౌ స్వే గృహే॥ ఋ.10-85-42॥
భావం:- ఓ దంపతులారా! మీరిక్కడే విడివిడిగాకాక కలిసి జీవించండి. కొడుకులు, మనుమలతో కూడి సుఖసంతోషాలతో మీ యింటనే మీరు పూర్ణాయుర్దాయాన్ని అనుభవించండి.
వివరణ:- ‘యువతీయువకులు దంపతులై వేరువేరుగా జీవించడం కాదు. కలిసియే జీవించండి’అని ఈ వేదమంత్రంలో సందేశం వినిపిస్తూంది. వేల ఏండ్లకు పూర్వమే వేదం విన్పించిన ఈ సందేశం నాటి కాలంవారికంటే నేటి దంపతులకే ఎంతో అన్వయిస్తుంది.

- ఇంకాఉంది

హిందీ మూలం: స్వామీ వేదానంద తీర్థ తెలుగు అనువాదం: డా పాలకోడేటి జగన్నాథరావు