స్వాధ్యాయ సందోహం

స్వాధ్యాయ సందోహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శరీరానికి రెండు కళ్లు, రెండు చెవులు, నాసారంధ్రాలు రెండు, నోరు ఒకటి, మలద్వారమొకటి, మూత్ర ద్వారమొకటి ఇలా తొమ్మిది రంధ్రాల రూపంగా తొమ్మిది ద్వారాలున్నాయి. ఈ ద్వారాలున్న శరీరంలో ఒక హిరణ్మయ కోశమొకటియుంది. మనసును మందిరమనిగాని, దహరమనిగాని, పుండరీకమని గాని, వేశ్మమని గాని పిలువవచ్చు. సత్వరజస్తమో గుణాలు మూడు అందలి మూడు అంతరాలు. ఇట్టి మానవ మందిరమే జీవాత్మ, పరమాత్మలిద్దరకూ నివాసం. అందుకే ఆ హిరణ్యయకోశం ప్రకాశమయం. ఆ మనస్సు లేదా హృదయం పరమాత్మకు నివాసం కావడంవలన అది స్వర్గ= స్వర్+గ ఆనంద స్థానానికి చేర్చేది. బ్రహ్మవేత్తలు ఆ పరమాత్మనే (యక్షమ్) చేరుకొంటారు.
**
ఋతాచరణకై యజ్ఞానికి రండి
ఋతధీతయ ఆ గత సత్యధర్మాణో అధ్వరమ్‌
అగ్నేః పిబత జిహ్వయా॥ ఋ.5-51-2॥
భావం:- ఓ సత్యధర్మ పరాయణులారా! ఋత ధర్మాచరణ చేసేందుకు మీరు యజ్ఞ మార్గాన్ని అనుసరించండి. మరియు మీరు ఋతధర్మాన్ని అగ్ని= జ్ఞానంద్వారా త్రాగివేయండి. అనగా సంపూర్ణంగా గ్రహించండి.
వైదిక ధర్మం యజ్ఞప్రధానమైనది. ఆయుర్యజ్ఞేన కల్పతామ్‌ (శు.య.వే. 9-21/18- 29/22-33)
జీవితం యజ్ఞం చేత సఫలమగుగాక!. అనే వాక్యం శుక్లయజుర్వేదంలో పలుమార్లు చెప్పబడింది. యజ్ఞానికి అధ్వరం, మఖం మొదలైన పదాలెన్నో ఉన్నాయి. ప్రస్తుత మంత్రంలో ‘అధ్వర’ శబ్దం ప్రయోగింపబడింది. కాబట్టి ఈ శబ్దానికిగల ప్రత్యేకార్థమెట్టిదో తెలుసుకొంటే ఈ మంత్రార్థం సుగమమవుతుంది. అధ్వర శబ్దార్థాన్ని వివరిస్తూ వైదిక నిఘంటుకర్త యాస్కుడు ఇలా వివరించాడు. ‘్ధ్వరతిర్హింసాకర్మా తత్ప్రతిషేధః’ (నిరుక్తం 1-3-8) అధ్వర శబ్దాలు రెండున్నాయి. ధ్వర= హింస; న= కానిది- లేనిది. అంటే హింస కాని - లేని కర్మ అని అధ్వర శబ్దాని కర్థం. అదే అధ్వరం యజ్ఞమని భావం. యజ్ఞం లేదా అధ్వరం పశుహింసాత్మకమైనదిగా భావించేవారు ఈ అధ్వర శబ్దానికర్థం ముందు గ్రహించాలి. అధ్వర శబ్దానికి మరో అర్థం ‘అధ్వ=మార్గాన్ని ర= ఇచ్చుట లేదా చూపుట’. ఇలాగే యజ్ఞశబ్దానికర్థం సంగతీకరణం. అంటే సత్సంగం. ఇప్పుడు ఈ అధ్వర యజ్ఞ- శబ్దార్థాలను జతచేసి పరిశీలిస్తే అహింసాయుతమైన సత్సంగకర్మ అని బోధపడుతుంది.
అధ్వరంలో సంభవించే సత్సంగ ప్రయోజనాన్ని వివరిస్తూ ఈ మంత్రం ఋతధీతయే = ‘‘ఋతం= సృష్టి లేదా దైవ నియమాలు, ధర్మాన్ని,- శాసనాలను హృదయంలో మననం= తరచుగా స్మరించి ఆచరించేందుకు మాత్రమే’’అని వచించింది. నిజమేకదా ఎటువంటి వానికైనా ఋతజ్ఞానం సత్సాంగత్యంవలన గాక పుట్టుకతోనే కలుగదుకదా. కేవలం సజ్జన సమ్మేళనమే సత్సాంగత్యంకాదు. విద్యాభ్యాస దశలో గురుసమ్మేళనం- పుస్తక పఠన సమయంలో తద్రచయితతో పరోక్ష సమ్మేళనం ఇలా అన్నీ సత్సంగాలే. కాబట్టి ఏ దశలోనిదైనా ఋతాన్ని మననంచేయడం ‘ఋతధీతయే’. ఈ విషయాన్ని ఋగ్వేదం ‘ఋతస్య ధీతిం బ్రహ్మణో మనీషామ్’(ఋ.9-97-33) ‘‘ఋతధీతి= బ్రహ్మజ్ఞాన మననమే (స్మరణయే) అని పేర్కొంది. ఋతస్మరణం ఏదో ఒక ప్రయోజనాన్ని ఆశించి చేసేది కాకూడదు. కేవలం ఋతంకోసమే స్మరించాలి అని ఋగ్వేదం

- ఇంకావుంది...

హిందీ మూలం: స్వామీ వేదానంద తీర్థ తెలుగు అనువాదం: డా పాలకోడేటి జగన్నాథరావు