స్వాధ్యాయ సందోహం

స్వాధ్యాయ సందోహం--34

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హిందీ మూలం: స్వామీ వేదానంద తీర్థ
తెలుగు అనువాదం: డా పాలకోడేటి జగన్నాథరావు

అయితే యజ్ఞయాగాదుల ద్వారా భగవదారాధన చేస్తే ధనం ఎలా సమకూరుతుంది? అన్న సందేహం కలుగవచ్చు. ఇది దీర్ఘంగా సూక్ష్మంగా ఆలోచించి గ్రహింపవలసిన విషయం.
ధనం చాలా చంచలమైనది. నేడొకనివద్ద రేపు మరొకని వద్దకు వెళ్లిపోతూ ఉంటుంది. అలా తన స్థానాన్ని మార్చుకోవడం ధన స్వభావం. ఆ స్వభావానికి విరుద్ధంగా ధనాన్ని తనవద్ద దాచిపెట్టుకుంటే మాత్రముంటుందా? అది ఏదో రూపంలో తన స్వభావానుగుణంగా వెళ్లిపోతుంది. కాబట్టి ధనానికుండే సహజ స్వభావానికి అనుగుణంగా మనిషి ఆ ధనాన్ని దానంచేస్తే అక్కడ కూడ ఆ ధనలక్ష్మి ఎంతో కాలముండదు. దాత దానశీలానికి ప్రసన్నమైన లక్ష్మి స్వస్వభావానికనుగుణంగా దానశీలంతో వర్తించే దాతవద్దకే తిరిగి వస్తుంది. ఇది ఎలా? అని ఆశ్చర్యపడకండి.
సముద్రం తన జలాన్ని సూర్యుడికి దానంచేస్తుంది. మరి ఆ జలం సూర్యుడివద్దనే ఉంటుందా? వర్షరూపంలో ఆ సూర్యుడే అంతట జలాన్ని కురిపిస్తున్నాడు. ఆ కురిసిన వర్షం ఏవౌతూంది? తిరిగి సముద్రానికే చేరుకుంటూంది గదా అలాగే దానం చేయబడిన ధనం దానిని గ్రహించిన వాని వద్దనే ఉండక మరో రూపంగా దాతనే చేరుకొంటూ ఉంటుంది. వర్షించిన జలం సముద్రానికి చేరకుంటే ఏమవుతుంది? అంతటా నిలువ ఉండి కుళ్లు కంపుకొడుతుంది. లేకపోతే భూమిలోనికి ఇంకిపోతుంది. ధనం కూడ దాచిపెడితే అంతే. అందుకే దానం చేయి. నిశ్చింతగా ఉండు. కూడబెడితే ఆ ధనం దొంగలపాలో దొరలపాలో కాక తప్పదు.
కాబట్టి ధనాన్ని దాచిపెట్టుకోక దానం చేయి. ఈ దానమే వేద పరిభాషలో యజ్ఞం. జగత్తులోని సమస్త ధనం భగవంతునిది మాత్రమే. అంటే దానిని దాచుకోకుండ అందరకు దానం చేస్తాడు.
త్వదీయం వస్తు సర్వాత్మన్! తుభ్యమేవ సమర్పయే!
‘‘ఓ సర్వాత్ముడా! నీవిచ్చిన ధనాన్ని నీకే అర్పిస్తున్నాను’’అన్న మహోదార భావనతో భగవద్రూపులైన జనులకు గాని, వైదిక యజ్ఞ రూపంగా సాక్షాత్తు భగవంతునికే హోమద్రవ్యరూపంగా సమర్పించు. అది యజ్ఞమవుతుంది.
యజ్ఞంలో సమర్పింపబడిన ద్రవ్యం హవిస్సుగా మారుతుంది. దానివలన జల వృష్టి కురుస్తుంది. దానితో భూమి సస్యశ్యామలమై ధనధాన్యం సమృద్ధవౌతుంది. ఆ ధనధాన్యాలు హోమార్థద్రవ్యంగా తిరిగి యజ్ఞకర్త పొందే భౌతిక ప్రయోజనాలేమిటో ఋగ్వేద మీవిధంగా వివరించింది.
ప్ర యంతి యజ్ఞం విపయంతి బర్హిః సోమమాదో విదథే దుధ్రవాచః
న్యు భ్రియంతే యశసో గృభాదా దూర ఉపబ్దో వృషణో నృపాచః॥ ఋ.7-21-2
భావం:- శాస్ర్తియంగా యజ్ఞానుష్ఠానం చేసిన యజ్ఞకర్తకు సర్వవిద్యలు మహోన్నతంగా హృదయగతమవుతాయి. సోమరస పానం చేత మహదానందాన్ని పొందుతాడు. రాజసభలలో జరిగే శాస్త్ర చర్చలలో తన వాక్పటిమచేత పరవాదులను నిరుత్తరులను చేయగలడు. అతడు జగద్విఖ్యాత కీర్తిమంతుడు కాగలడు. అతడి ఉపదేశాలు దిగ్దింతాలు వ్యాపించగలవు. వారివలన పరులకు సుఖ సంతోషాలు కలుగుతాయి. మరియు సర్వలోకోపకారులు కూడ కాగలరు.

--ఇంకావుంది...