స్వాధ్యాయ సందోహం

స్వాధ్యాయ సందోహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కుక్క దానికి చిహ్నం. కాబట్టి కుక్కవంటి మాత్సర్యాన్ని వెంటనే విడిచిపెట్టాలని వేద హితవు.
కోకయాతుమ్:- కోక అంటే పిచ్చుక. దీనికి కామాతురత అధికం. అందుకే పిచ్చుక కామానికి సూచకం. సాధకుడు దీనిని విడనాడాలని వేదాదేశం.
సువర్ణయాతుమ్:- సుపర్ణుడంటే గరుత్మంతుడు. దీనియందు అహంకార మెక్కువ. కాబట్టి సుపర్ణుడు అహంకారానికి చిహ్నం. దీనికి తల్లి మదం. సాధకుడు ఈ మద లక్షణాన్ని విడవాలి. గృధ్రయాతుమ్:- గృధ్రమంటే గ్రద్ద. లోభం దీని ప్రధాన గుణం. కాబట్టి గ్రద్ద లోభగుణ సంకేతం. ఆ గుణం చేతనే నింగిలోనికి ఎంత ఎత్తు ఎగిరినా నేలపై ఉండే చిన్న కోడిపిల్లకోసం లోభంతో నేలకు వ్రాలిపోతుంది. ఇట్టి లోభగుణాన్ని కూడ సాధకుడు విడిచిపెట్టాలి.
వేదమీ పశుపక్షులన్నింటిని రాక్షస శబ్దంచేత వ్యవహరించింది. ఇవన్నీ ఆత్మకు ప్రధాన శత్రువులు. మోక్షమార్గంలో నడవనీయకుండా, నడచినా చేరనీయకుండా అడ్డుపడే ప్రధాన శత్రువులు. ఇందులో ఏ వొక్కటున్నా ఆత్మకు మోక్షమందకుండ నిరోధింపగలదు. ఇక అన్ని కూడితే చెప్పేదేముంది? అందుచేత ముముక్షువయిన సాధకుడు ఈ ఆరుగురు శత్రువుల ఎడల చాల జాగరూకుడై యుండాలి. అందుకే అథర్వణవేదం ‘ప్రాక్తోఅపాక్తో అధరాదుదక్తో- భి జహి రక్షసః పర్వతేన’ (అథ.3-4-19) ‘‘ముందు, వెనుక, క్రింద, పైన ఇలా అన్నివైపులా ఉండే రాక్షసులను (కామక్రోధాదులను) వజ్రాయుధంచేత చంపుము’’ అని గట్టిగా మోక్షసాధకులను హెచ్చరిస్తూంది.
**
సభార్హులు
విద్మ తే నభే నామ నరిష్టా నామ వా అసి
యే తే కే చ సభాసదస్తే మే సంతు సవాచసః॥ అథ.వే.7-12-2॥
భావం:- ఓ సభా! ఎవరు నీ సభ్యులో వారు నాకొఱకై మాటలాడెదరో అట్టి నీ కీర్తి మాకు తెలుసు. ఆ విధంగా నీవు నిజంగా సర్వజనులకు మేలునుకలిగించి లోకప్రసిద్ధిని పొందియున్నావు. సభలు, సమాజాలు, సంఘాలు ఏర్పరచుకొని సమాజశ్రేయస్సుకై ప్రణాళికలు నిర్మించుకోవడం ఒక క్రొత్త అంశమేమీకాదు. అది చాలా ప్రాచీనమైనదే. ఎంత ప్రాచీనమైనదంటే భూమిపై మనిషి ప్రథమంగా కాలుపెట్టినప్పటి ప్రాచీనమైనది. ఆ విధంగా భగవంతుడే మానవులకు ప్రబోధం చేసియున్నాడు. ఈ పురాణ సభాచరిత్రను వేదమే ‘విద్మ తే సభే నామ’ ‘‘ఓ సభా! నీ కీర్తిప్రతిష్ఠలు నాకు తెలుసు’’ అని ప్రకటించింది.
సభలో ఆసీనయోగ్యత కలవారిని సభ్యులంటారు. సభలో వారి ప్రవర్తన సభ్యత, సభకు ప్రకాశయుక్తమైనదని అర్థం. అంటే-అందరు కలిసి జ్ఞాన సహితమైన జ్ఞాన రక్షకమైన, జనరక్షకమైన కార్యాలను చర్చించి వాటిని నిర్వహించేందుకు కూడిన శిష్టజన సముదాయానికే సభ అని పేరు. ఈ అభిప్రాయమే వేదం ‘నరిష్టా నామ వా అసి’ ‘‘నిజంగా నీవు సర్వజనహితకారిణివి’’అన్న ఒక్క వాక్యంలో సూచించింది. ఏ కారణం చేతనయినా ఏదేని సభ ఇట్టి లక్షణం కలది కాకుంటే ఏమిచేయాలి? ‘నరిష్టా నామ’అన్న పదం చేతనే దానిని రద్దుచేయాలని పరోక్షంగా సూచించింది వేదం.

- ఇంకావుంది...

హిందీ మూలం: స్వామీ వేదానంద తీర్థ తెలుగు అనువాదం: డా పాలకోడేటి జగన్నాథరావు