స్వాధ్యాయ సందోహం

స్వాధ్యాయ సందోహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హిందీ మూలం: స్వామీ వేదానంద తీర్థ తెలుగు అనువాదం:
డా పాలకోడేటి జగన్నాథరావు 9490620512
*
కాని జగత్తే మిథ్యగా తెలిసికొన్న సర్వజ్ఞులైన విద్వాంసులు మాత్రం ‘ముగ్ధాదేవా...యజంత’ భగవత్ప్రీతికొఱకై యజ్ఞాలను చేస్తారు. ఆ కారణంగా వారు మహోన్నతులై ఇతరులను ఆకర్షింపగలిగిన అద్భుత శక్తివంతులవుతారు. వారికాశక్తి కేవలం భగవంతునిగూర్చి చేసిన యజ్ఞాలవలననేగాక వారు పలు రీతులుగా ఇతరులకు చేసే ప్రబోధ రూప వాగ్యజ్ఞంవలన సిద్ధించినట్టిదే.
విద్వాంసులావిధంగా భగవత్ప్రీత్యర్థంగా యజ్ఞాలను తోడి మానవుల అభ్యుదయంకోసం వాగ్యజ్ఞాలను నిరంతరం చేస్తూ ఉంటారని ఋగ్వేదం ‘యజ్ఞేన యజ్ఞమయజంత దేవాస్తాని ధర్మాణి ప్రథమాన్యాసన్’ (ఋ.1-164-50, 10-19-16) ‘‘విద్వాంసులు స్వాధ్యాయ, ప్రవచనాల ద్వారా భగవంతుని ఆరాధిస్తారు’’అని పై అథర్వణవేద మంత్రార్థానే్న సమర్థించింది. వారికా వాగ్యజ్ఞమే జీవిత ప్రధాన లక్ష్యం. యజ్ఞమనే దానిద్వారా యజ్ఞపురుషుడైన భగవానుని పూజించి ప్రసన్నుని చేసుకోవడమంత సులభమైనదికాదు. యజ్ఞమంటే అగ్నిహోత్రంలో నేయి, బియ్యం, సమిధలు మొదలయిన ద్రవ్యాలను హోమంచేయడమే ప్రధానం కాదు. వానితోబాటు అగ్నివిధి ద్వారా భగవంతుడికి ఆత్మ సమర్పణ చేసికోవడమే అత్యంత ప్రధానం అని అథర్వణవేదం-
యత్పురుషేణ హవిషా యజ్ఞం దేవా అతన్వత
అస్తి ను తస్మాదోజీయో యద్ విహవ్యే నేజిరే॥
అథర్వ.7-5-4॥
భావం:- ‘‘సమిధలు, ఘృతాది వివిధ ద్రవ్యాలు హననం చేయబడిన యజ్ఞంలో విద్వాంసులు హవిస్సుగా ఆత్మసమర్పణ చేసుకొనడంవలన ఆ యజ్ఞం మిక్కిలి తేజోవంతమూ మరియు ఓజోవంతమూ అవుతున్నది’’అని యజ్ఞమర్మాన్ని విప్పిచెప్పింది.’’ ఆత్మసమర్పణ చేసుకొనే యజమాని అనగా ఆత్మయాజి కేవలం ఘృత సమిధాదులను చేతబూని కూర్చోడు. యజ్ఞాగ్ని అనగా బ్రహ్మాగ్నియందు తననుతాను హోమం చేసుకొంటాడు. అట్టి ఆత్మయాజి కోటికొక్కడు మాత్రమే ఉంటాడు.
**
స్వర్గం
యత్రా సుహార్దః సుకృతో మదంతి విహాయ రోగం తన్వః స్వాయా?
అశ్లోణా అంగైరహ్రుతాః స్వర్గే తత్ర పశే్యమ పితరౌ చ పుత్రాన్‌॥

భావం:- ఉత్తమ లోకమైన ఏ స్వర్గలో పవిత్ర హృదయులు, ఆరోగ్యవంతులు, వికలత్వం లేని సర్వాంగ సౌష్ఠవంగలవారు, శారీరక, మానసిక, ఆత్మిక కుటిలత్వ రహిత సుస్వభావులు ఉంటారో ఆ స్వర్గలోకంలో మేము మాతాపితలతో, దారాపుత్రులతో ఆనందంగా ఉండగలం.
వివరణ:- స్వర్గమంటే మరణానంతరం పుణ్యవిశేషంతో నివసించే కానరానిచోట ఉండే ఒకానొక లోకమని అందరూ భావిస్తారు. వేద మా భావన సత్యంకాదంటూ స్వర్గాన్ని గురించి యిలా వర్ణిస్తూంది.
‘యత్రా సుహార్దః...మదంతి’:- పవిత్ర హృదయంకలవారు, సదాచార సంపన్నులు, సదాచార సంపన్నులు నివసించేచోటు ‘విహాయ రోగం తన్వాః స్వాయాః’:- రోగరహితులుండేచోటు. ఈ వికలాంగత్వం శారీరకం కాదు మానసికమే.
‘అశ్లోణా అంగైరహ్రుతాః’:- వికలాంగులు లేనిచోటు.
- ఇంకావుంది...