స్వాధ్యాయ సందోహం

స్వాధ్యాయ సందోహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మానవులంతా దుఃఖపడేది తాముండే భూలోకంలో ఈ మూడు లక్షణాలు దాదాపుగా మృగ్యంకావడమే. అందుకే భూలోకవాసులు స్వర్గమెక్కడో ఉందని భ్రాంతికి లోనవుతున్నారు. ఈ లక్షణాలున్న లోకం భూలోకమే అయినా మరే లోకమే అయినా అట్టి ఆనందమయ లోకమే స్వర్గమన్న భావంతో యత్ర-తత్ర శబ్దాలతో స్వర్గలక్షణాలను వేదమభివర్ణించిందిగాని ఇవే లక్షణాలని ఇతమిత్థంగా చెప్పలేదు. అంటే దైవీగుణాలుకల జనులుండే ప్రదేశమే స్వర్గమని వేద నిశ్చితాభిప్రాయంగా గ్రహించాలి. కారణమేమంటే స్వర్గలక్షణాలను చెప్పిన ఈ వేదమంత్రం ‘స్వర్గే తత్ర పశే్యమ పితరౌ చ పుత్రాన్’ ‘‘అటువంటి స్వర్గంలో (ఆనందమయ లోకంలో) మేము తల్లిదండ్రులతో భార్యాపుత్రులతో కూడి ‘పశే్యమ’ చూస్తాము’’. అంటే సుఖ, సంతోషాలను, ఆనందాన్ని అనుభవిస్తామని ఒక గృహస్థుని ఆకాంక్షగా స్వర్గాన్ని నిర్వచించింది. ఈ వేదోక్త స్వర్గం భూలోకమేకాక మరేమిటి? కాకుంటే భూలోక సంబంధులైన తల్లిదండ్రులు మరియు భార్యాపుత్రులు అక్కడికెక్కడినుండి వస్తారు? కాబట్టి భూలోకమే స్వర్గమన్నది వేదహృదయంగా గ్రహించాలి. గ్రహించి భూమినే స్వర్గంగా మార్చుకొందాం.
**
ఐకమత్య సిద్ధి
సం వః పృచ్యంతాం తన్వం సం మనాంసి సము వ్రతా
సం వో- యం బ్రహ్మణస్పతిర్భగః సం వో అజీగమత్‌॥ అథ.వే.6-74-1॥
భావం:- మీ శరీరాలు, మనసులు, ఆలోచనలు, ఆచారాలు అన్ని సమానంగా ఉండుగాక! మీకు వేదాధీశ్వరుడు ఒకేవిధంగా అనుగ్రహించుగాక! ధనం కూడ ఒకే రీతిగా లభించుగాక!
వివరణ:- శరీరం, మనసు= ఆలోచనలు, వ్రతా=ఆచారాలు ఒకే రీతిగా ఉండాలి. అలాగే మానవజాతి ఒకే జ్ఞానం మరియు ఆలోచనలతో ఒకే రీతిగా సమృద్ధం కావాలి అన్న మహదాశయాన్ని సాధించేందుకు వేదమీ ఉపాయాన్ని సూచించింది.
సంజ్ఞపనం వో మనసో- థో సంజ్ఞపనం హృదః
అథో భగస్య యచ్ఛ్రాంతం తేన సంజ్ఞపయామి వః ॥ (అథ.వే.6-74-2)
‘‘మీ మనసులకు సంజ్ఞపనం= ప్రబోధం ఒకేరీతిగా ఉండుగాక. మీ హృదయాలకు సంజ్ఞపనం= ప్రబోధం ఒకే సమానంగా ఉండాలి. ఐశ్వర్యం కొఱకు సమష్టిగా మీరుచేసే ఏ శ్రమ ఉందో దానిద్వారా మీలో సమైక్యభావనను ప్రబుద్ధం చేస్తున్నాను.’’
ఇక్కడ చెప్పబడిన మనసు మరియు హృదయాల ఏకత్వం ఐశ్వర్యంకోసం చేసే పరిశ్రమ సమానంకానంతవరకు సిద్ధిస్తుందా? అలా సిద్ధాంపక ఐశ్వర్యంకోసం అందరి శరీరాలు (అనగా అందరి కృషి) ఒకటిగా ఐశ్వర్యాన్ని సాధించగలవా? కాబట్టి మానవ సమాజంలో సమతను సాధించేందుకు ముందుగ జనుల మనస్సులలో హృదయాలలో సమతను సాధించవలసి ఉంది. దాని నెవరు సాధించగలరు? ఎలా సాధించగలరు? ఈ విషయంలో అథర్వణమిలా చెబుతూంది.
‘అహృణీయమానః ఇమాన్ జనాన్ సంమననస్కృధీహ’(అథ.వే.6-74-3) ‘‘కుటిలతా భావాలను విడిచి జనులను సమాన మసనుకలవారిగా చేయి’’ అంటే .....

- ఇంకావుంది...

హిందీ మూలం: స్వామీ వేదానంద తీర్థ తెలుగు అనువాదం: డా పాలకోడేటి జగన్నాథరావు