స్వాధ్యాయ సందోహం

స్వాధ్యాయ సందోహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హిందీ మూలం: స్వామీ వేదానంద తీర్థ తెలుగు అనువాదం:
డా పాలకోడేటి జగన్నాథరావు 9490620512
*
బ్రహ్మవేత్తను చంపరాదు
తద్వై రాష్టమ్రా స్తవ్రతి నావం భిన్నామివోదకమ్‌ బ్రహ్మాణం
యత్ర హింసంతి తద్రాష్ట్రం హంతి దుచ్ఛునా॥ అథ.వే.5-19-8॥
భావం:- నీరు చిల్లుపడిన ఓడనే విధంగా ముంచివేస్తుందో ఆ విధంగా బ్రహ్మవేత్తను హింసించి చంపిన దేశం సర్వనాశనమవుతుంది.
వివరణ:- ఈ మంత్రం బ్రహ్మవేత్తను చంపిన దుష్కర్మఫలాన్ని వివరిస్తూంది. ఉదాహరణగా చిల్లుపడిన ఓడను ముంచివేసే నీటిని పేర్కొంది. ఇది అందరికి అనుభవంలోని విషయమేగదా. అలాగే బ్రహ్మవేత్త చంపబడిన దేశంకూడ ఆ దుష్కర్మవలన సర్వనాశనమవుతుందని హెచ్చరిస్తూంది. బ్రహ్మవేత్తను వధించే పాపకర్మ చేయరాదని అథర్వణవేదం బహుధా ప్రకటించింది.
1. యో బ్రాహ్మణం మన్యతే అన్నమేవ స విషస్య పిబతి తైమాతస్య

బ్రాహ్మణుడిని ఎవడు తినబడే అన్నగా భావిస్తాడో అతడు విషం కలపబడిన పానీయాన్ని త్రాగినవాడే అగును.
2. న బ్రాహ్మణో హింసితవ్యో- గ్నిః ప్రియతనోరివ ॥
ప్రియమైన శరీరాగ్ని వంటి బ్రాహ్మణుని హత్యచేయరాదు.
3. యో బ్రహ్మాణం దేవబంధుం హినస్తి న స పితృయాణమష్యేతి లోకమ్‌

దేవబంధువయిన బ్రాహ్మణుని హింసించినవాడు పితృయానం ద్వారా స్వర్గానికి వెళ్లజాలడు.
ఈ ప్రమాణాలనుబట్టి బ్రాహ్మణుని హింసించుటగాని, వధించుట గాని చేయరాదు. అయితే బ్రాహ్మణుడంటే ఎవరు? బ్రాహ్మణ వర్ణంలో జన్మించినవాడు బ్రాహ్మణుడని అందరూ భావిస్తారు. కాని అది సరికదా. దీనికి ప్రమాణం అథర్వణవేదంపై 5-18-3వ మంత్రంలో బ్రాహ్మణుడిని దేవబంధువుగా నిర్దేశించింది. దీనినిబట్టి కేవలం బ్రాహ్మణవర్ణంలో పుట్టిన వ్యక్తిని బ్రాహ్మణునిగా తిరస్కరించినట్లేకదా. మరి బ్రాహ్మణుడు దేవబంధువెప్పుడవుతాడు? దీనికి సమాధానంగా శుక్లయజుర్వేదం ఈ విధంగా వివరించింది.
స నో బంధుర్జనితా స విధాతా ధామాని వేద భువనాని విశ్వా
యత్ర దేవా- అమృతమాన శానాస్తృతీయే ధామ న్నధ్యైరయంత॥ (శు.య.32-10)
‘‘ఓ మానవులారా! ఏ జగదీశ్వరుడు మోక్షానందాన్ని కల్గించి సమస్త లోక లోకాంతరాలలో విహరింపచేస్తూ ఉన్నాడో ఆ పరమేశ్వరుడు మాకు బంధువు. సహాయకుడు. సహోదరుడు సర్వజీవులకు కర్మఫల ప్రదాత’’ ఈ విధంగా సర్వేశ్వరునితో బంధుత్వాన్ని పొందిన మహాపురుషుడే దేవబంధువు.
ఆతడే బ్రాహ్మణుడు. అట్టి దేవబంధువు హత్యనే వేదం నిషేధించింది. కేవలం బ్రాహ్మణకుల సంజాతుని హత్యను కాదు. ఇట్టివాని హత్య దేవబంధువగు బ్రాహ్మణుని హత్యవంటిది కాదు. అది మహాపాప హేతువు. అట్టి మహాబ్రాహ్మణుని హత్య జరిగిన దేశాన్ని చిల్లుపడిన ఓడలో చేరిన నీరు ఆ ఓడను ముంచివేసినట్లుగా సర్వనాశనం చేస్తుంది.
***

- ఇంకావుంది...