స్వాధ్యాయ సందోహం

స్వాధ్యాయ సందోహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హిందీ మూలం: స్వామీ వేదానంద తీర్థ తెలుగు అనువాదం:
డా పాలకోడేటి జగన్నాథరావు 9490620512
*
నేను కాలిడిన గ్రామంలో
పిశాచాదులు పారిపోతాయి
న పిశాచైః సం శక్నోమి న స్తేనైర్న వనర్గ్భుః
పిశాచాస్తస్మాన్నశ్యంతి యమహం గ్రామమావిశే॥
అథ.వే.4-36-7॥
భావం:- పిశాచాలతో, దొంగలతో, బందిపోట్లతో, హింసకులతో ఏకీభవించి కలిసి ఉండలేను. నేను ఏ గ్రామంలో ప్రవేశించి ఆ గ్రామస్థులను ఉత్తేజపరచి ప్రబోధంచేస్తూ ఉంటానో ఆ గ్రామంలో పిశాచాదులన్ని నశించిపోతాయి.
వివరణ:- పిశాచ శబ్దానికర్థం మాంసాహారులని అర్థం. ఎవరు ప్రజలను భయపెట్టి, హింసించి వారి సర్వస్వాన్ని అపహరిస్తారో వారే పిశాచాలు. వారెక్కడో ఉండరు. జనాలమధ్యనే ఉంటారు. ఉండి వారి రక్తమాంసాలను పీల్చిపిప్పిచేస్తూ ఉంటారు. ఇక మంత్రంలో చెప్పబడిన చోరులు, వనర్గులు అంటే వనాలలో ఉండే హింసాప్రవర్తన కల దొంగలు. వీరు కూడా మనుష్యులే. అయితే ధర్మప్రవర్తనను వీడి పాపకర్మలను చేసే పతితులు. సాధుస్వభావంగల వీరుడొకడు ఇలా తలపోస్తున్నాడు. వీరెవ్వరితో కలిసిమెలసి జీవింపను. అంతమాత్రంచేత నేనెక్కడకు పారిపోను. ఆ పిశాచాదులుండే ప్రాంతానికే లేదా గ్రామానికే వెళతాను. అప్పుడు ‘పిశాచా స్తస్మాన్నశ్యంతి యమహం గ్రామమావిశే’ ‘‘నేను ప్రవేశించిన గ్రామం లేదా ప్రదేశంలో పిశాచాదులు నశించిపోతాయి’’. ఎందుకు? అక్కడుండే ప్రజలందరికి పిశాచాదులకు వ్యతిరేకంగా పోరాడే ధైర్యాన్ని, ఉత్సాహాన్ని నేనే నింపడంవలన అక్కడ వారిలో పోరాటపటిమ పెరుగుతుంది. వారు వారికి ఎదురుతిరిగిపోరాడతారు. ఇట్లు పోరాడటంతో పిశాచాదులు నశించిపోతాయి. దీనిని వివరిస్తూ-
యం గ్రామమావిశత్ ఇదముగ్రం సహో మమ
పిశాచా స్తస్మాన్నశ్యంతి స పాపముప జానతే॥
అథ.వే.4-36-8॥
భావం:- ‘‘నేను ప్రవేశించిన గ్రామంలో నా ప్రబోధ తీవ్ర ప్రభావం వలన పిశాచాదులా గ్రామంనుండి పారిపోతాడు’’అని మరల అథర్వణ వేదం వివరించింది.
మరి ఆ వీరుడా పిశాచాదులను పారిపోవనీయకుండ చంపివేయవచ్చు కదా. పారిపోయినవారు మరొకచోటకు చేరి అక్కడివారిని కూడ బాధిస్తారు కదా. నిజమే వారికి ‘న పాపమున జానతే’ ‘‘పాపమంటేనే తెలియదు. ఇది పాపమని కూడ గుర్తించలేరు’’. వారికి తాముచేసేవన్ని మంచి పనులనియే విశ్వాసంకాబట్టి అట్టివారిని చంపడంవలన వారికేమీ మేలు కలుగదు. నిజంగా వారికి మేలుకలగాలంటే వారు పాపాలనుండి విముక్తులయినప్పుడు మాత్రమే సాధ్యం. అంటే నిజమైన పిశాచాల నాశనం వారిలోగల పిశాచభావన నాశనమయినపుడు మాత్రమే. అందుకే అథర్వణవేదం-
తపనో అస్మి పిశాచానాం వ్యాఘ్రో గోమతామిప
శ్వాసః సింహమివ దృష్ట్యా తే న విందతే న్యంచనమ్
(అథ.4-36-6)
‘‘గోవులను కాసే గోపాలకులకు సింహంవలె పిశాచాదులకు నేను సింహం వంటివాడనై బాధించేవాడను. సింహాన్ని చూచిన క్కుకలవలె పిశాచాలు కూడ నిలువనీడలేక పారిపోతాయి’’అని సింహశ్వానాల ఉపమానాన్ని చెప్పి ఆవిధంగా పిశాచాదులు వీరుడైన తననుచూచి భయపడి పారిపోతాయని వివరించింది.
- ఇంకావుంది...