స్వాధ్యాయ సందోహం

స్వాధ్యాయ సందోహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హిందీ మూలం: స్వామీ వేదానంద తీర్థ తెలుగు అనువాదం:
డా పాలకోడేటి జగన్నాథరావు 9490620512
*
భావం:- రెండు కాళ్లు మరియు నాలుగుకాళ్లుగల సమస్త జీవులపైన మృత్యువు తన అధికారాన్ని చూపుతుంది. అది కేవలం ఇంద్రియ సహితమై శరీరంమీద మాత్రమే అధికారం చూపగలదు. ఆత్మమీద కాదు. అట్టి గోపతి అయిన మృత్యువునుండి నిన్ను ఉద్ధరించి రక్షిస్తున్నాను. కాబట్టి నీవు ఆ మృత్యువునకు భయపడవద్దు.
వివరణ :- మంత్రంలోని ద్విపాత్ మరియు చతుష్పాత్ శబ్దాలు ప్రాణి సమస్తానికి ప్రతీక. విద్వాంసుడయినా మహాబలవంతుడయినా మరెవ్వరయినా వారందరికంటే మృత్యువే బలీయమైనది. దానిని తలంచి భయపడని ప్రాణి ఈ సృష్టిలో లేదు. ఆ భయాన్ని ప్రాణులారా! విడవండి. ‘తస్మాత్త్వాం.... మా బిభేః’ ‘‘ఇంద్రియ సహితమైన శరీరం మీద మాత్రమే అధికారాన్నిచూపే ‘గోపతి’అయిన మృత్యువునుండి భయపడకండి.’ అని వేదం అభయమిస్తూంది. అభయమిచ్చినంత మాత్రాన జీవులు మృత్యుభయాన్ని వీడి జీవించగలవా? జీవించలేవు. కాబట్టి మృత్యువు మర్మమేమిటో ముందు వివరించింది వేదం. అది కేవలం గోపతి మాత్రమే. గో అంటే ఇంద్రియమని అర్థం. గోపతి అంటే ఇంద్రియాలకు పతి అని అర్థం. ఇంద్రియాలు ఏ జీవి శరీరాన్ని విడిచి ప్రత్యేకంగా ఉండవు. అంటే ఇంద్రియ సహితమైన శరీరానికి పతి అంటే శరీరాన్ని తన ఆధిపత్యంలో ఉంచుకొనేది అని అర్థం. మృత్యువు అట్టిదేకదా. దానికి వశం కాని ప్రాణిసృష్టిలో ఎక్కడుంది? ఏది ఉంది? అయితే ఆ శరీరంలో మరో ప్రధానమైన తత్త్వముంది. అదే ఆత్మ. చిత్రమేమంటే శరీరంమీద ఆధిపత్యంగల మృత్యువుకు అందే ఉన్న ఆత్మమీద మాత్రమెట్టి అధికారం లేదు. కాబట్టి ఆత్మ‘అజరం, అమరం, అని అందరిని భయపెట్టి వశపరచుకొనే మృత్యుమర్మాన్ని బహిరంగ పరచి- ‘అవముంచన్ మృత్యుపాశాన శస్తిం ద్రాఘీయ ఆయుఃప్రతరం తే దధామి’ (అథ.వే. 8-2-2) ‘‘అశాస్తి అనే మృత్యుపాశాలనుండి విముక్తుణ్ణిచేసి సుదీర్ఘమైన ఆయువును నీకు ప్రసాదిస్తాను’’అని అభయమిచ్చింది. వేదంలో వేద పురుషుడు మృత్యువునకు భయపడవలదని జీవులకు అభయమిచ్చే వచనాలెన్నో ఉన్నాయి. దీనిని చూడండి.
సో- రిష్ట న మరిష్యసి న మరిష్యసి మా బిభేః న వై తత్ర మ్రియంతే నో యంత్యధమం తమః సర్వో వై తత్ర జీవతి గౌరశ్వః పురుషః పశుః యత్రేదం బ్రహ్మ క్రియతే పరిధిర్జీవనాయ కమ్‌॥ (అథ.వే. 8-2-1, 24,25)
‘‘హింసింపబడని ఓ ఆత్మలారా! మీరు భయపడకండి. మీరు మరణించరు. ఆనంద దాయకమైన బ్రహ్మజీవనమే పరిధిగా చేసుకొన్నచోట గోవులు- అశ్వాలు- మనుష్యులు, సకలప్రాణులు మరణించరు. అంతేకాదు అధములు సహితం అంధతమసమయమైన మృత్యువునపడి మరణించరు.’’ దీనినిబట్టి అశస్తి అనే మృత్యుపాశాలనుండి విముక్తులుకావడానికి, బ్రహ్మజ్ఞానాన్ని జీవనానికి రక్షణ కవచంగా చేసుకోవాలని బోధపడుతుంది. ఈ అర్థాన్ని మరింతగా సుబోధంచేస్తూ అథర్వణ వేదం ‘బ్రహ్మాస్మైవర్మ కృణ్మసి’ (అథ.వే.8-2-10) ‘‘అశస్తిరూపమైన మృత్యువునుండి భయపడేవారికి మేము బ్రహ్మవిద్యను కవచంగా నిర్మించి యిస్తున్నాం’’ అని అభయమిచ్చింది. బ్రహ్మవిద్యాకవచంమీద మృత్యువు దాడి చేసేందుకు సమర్థం కాదు. జీవితంమీద ఇచ్ఛ ఉంటే ‘బ్రహ్మ వర్మ మమాంతరమ్’ (ఋ.6-75-19) ‘‘బ్రహ్మవిద్య నాలోఉన్న కవచ’’మని మనస్ఫూర్తిగా భావించాలి.
నిశ్చల మనస్సు.. భగవత్ సాక్షాత్కారం
- ఇంకాఉంది