స్వాధ్యాయ సందోహం

స్వాధ్యాయ సందోహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఓ పరమేశ్వరా! ఉత్సాహాన్ని, చాతుర్యాన్ని, సత్కర్మాచరణ జ్ఞానాన్ని, సౌభాగ్యాన్ని, ఆరోగ్యవంతమైన శరీరాన్ని, మృదువు మరియు హితకరమైన వాగ్వైభవాన్ని, శోభన దినాలను, శ్రేష్ఠమైన ఈ ఐశ్వర్యాలను నాకనుగ్రహించుము.
వివరణ:- జీవితంలో ప్రతి వ్యక్తి ప్రధానంగా పొందదగిన ఎన్ని మహదైశ్వర్యాలున్నవో వాటిని అనుగ్రహించమని చేసే ప్రార్థన ఈ మంత్రంలో ఉంది. సంఖ్యాపరంగా ఈ మంత్రంలో చెప్పబడిన ఆ ఆరు ఐశ్వర్యాలను క్రమంగా మీరూ ప్రార్థించండి.
1. దక్షస్య చిత్తిమ్:- ఉత్సాహం, సమర్థత సత్కర్మాచరణలకు తగిన జ్ఞానం. నూరేళ్ల జీవితం సాఫల్యం కావాలంటే మనిషి తన విధ్యుక్తకర్మ ఏదో తెలిసే జ్ఞానమెంతో అవసరం. ఆ కర్మను ఫలవంతంగా చేసేందుకు ఉత్సాహముండాలి. చాతుర్యం కావాలి. సమర్థత కావాలి. ఈ మూడింటిని కలిగియున్నవాడు ఆరంభించిన ఏ పని సాఫల్యం కాదు? అందుకే సాధకుడు ఈ మూడింటిని అనుగ్రహించమని దైవాన్ని ప్రార్థిస్తున్నాడు.
2. సుభగత్వమ్:- సౌభాగ్యం. అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్లుగా మానవుడికెన్ని శక్తులున్నా సౌభాగ్యం అంటే అదృష్టం లేకుంటే జీవితమే నిష్ఫలం. ఈ సౌభాగ్యమయినా అదృష్టమయినా ఎవరో ఎక్కడినుండియో తెచ్చి హఠాత్తుగా ఇచ్చేదికాదు. అది విధ్యుక్త కర్మానుష్ఠానం చేత మాత్రమే సిద్ధిస్తుంది.
ఈ మర్మం తెలిసియే సాధకుడు మొదటగా కర్మ సఫలమయ్యే శక్తియుక్తులను (దక్షస్య చిత్తిమ్) ప్రసాదించమని దైవాన్ని అర్థించాడు. ఆ శక్తియుక్తులతో కర్మానుష్ఠానం చేసినపుడే సౌభాగ్యం ప్రాప్తిస్తుంది. కాబట్టి మనిషి నిత్యమూ విధ్యుక్తకర్మలను నిష్ఠగా నిర్వహించవలసియుంది. ఈ అభిప్రాయం కలిగిన పతంజలి మహర్షి ‘హేయం దుఃఖమనాగతమ్’ (యో.ద.2-16) ‘‘వర్తమాన కాలంలో ఫలోన్ముఖంగా సంక్రమిస్తున్న పూర్వజన్మ కర్మఫలం అనుభవింపక తప్పదు. అది ఫలాన్ని అనుభవింపచేయక తొలగిపోదు’’ అని సూత్రీకరించాడు.
ఆయన అభిప్రాయాన్ని అనుసరించి భవిష్యజ్జన్మను దుఃఖంనుండి కాపాడుకొనేందుకు వర్తమానంలో విధిగా సత్కర్మ నాచరింపక తప్పదు. దానివలన భవిష్యజ్జన్మలో సౌభాగ్యం నిశ్చిత రూపంగా అనుభవంలోనికి వస్తుంది.
3. పోషం రరుూణామ్:- ‘్ధనసమృద్ధి’అని అర్థం. ఇహలోకంలో ధనసమృద్ధి గుండెలో ఉండే స్పందన శక్తి వంటిది. జీవించినంతకాలమూ నాకు ధనసమృద్ధి అవసరం లేదనే వ్యర్థాలాపాలు పలుకరాదు. ‘వయం స్యామ పతయో రరుూణామ్’ (ఋ.10-121-10) ‘‘మేము ధనవంతులం కావాలి’’అన్న ప్రార్థన ఋగ్వేదంలోనే కనబడుతుంది. ఇటువంటి ప్రార్థనయే ఋగ్వేదంలోనే మరోచోట ‘పస్వీ తే అగ్నే సం దృష్టి రిషయతే మర్త్యాయ’ (ఋ.6-16-25)

- ఇంకావుంది...

హిందీ మూలం: స్వామీ వేదానంద తీర్థ తెలుగు అనువాదం: డా పాలకోడేటి జగన్నాథరావు