స్వాధ్యాయ సందోహం

స్వాధ్యాయ సందోహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హిందీ మూలం: స్వామీ వేదానంద తీర్థ తెలుగు అనువాదం:
డా పాలకోడేటి జగన్నాథరావు 9490620512
*
‘‘అట్టి బ్రహ్మద్వేషి పట్ల మీరు విచారాన్ని విడవండి’అని మరుద్గణాలను అర్థించింది. కాని శిక్షింపుడని మాత్రం అర్థించలేదు. ఎందుకంటే ద్యులోకమే అంటే దేవలోకమే అతడిని అన్ని విధాలుగా బాధిస్తుంది కాబట్టి. అంటే వేద నిందకులు, జ్ఞాని ద్రోహులు, పరమాత్మ విముఖులు అయిన వారికెన్నడూ శాంతి ఏ రూపంగా కూడ లభింపదని అంతరార్థం. ఇట్టి బ్రహ్మద్వేషుల ఎడల వేదం పట్టరానంత క్రోధాన్ని వహించి
బ్రహ్మద్విషే క్రవ్యాదే ఘోరచక్షసే ద్వేషో ధత్తమనవాయం కిమీదినే॥ (ఋ.7-104-2)
బ్రహ్మద్వేషి, మాంసాహారి, క్రూరదర్శి, ద్వేషి, సర్వభక్తి అయినవారి ఎడల ప్రీతిగా ఉండవద్దు’’ అని కఠినంగా జనుల నాదేశించింది. చిత్రమేమంటే అథర్వణవేదం అట్టివారిని ద్యులోకమే శిక్షిస్తుంది అని అంది గాని ఋగ్వేదం ఆ విధంగా కూడ వచింపక కేవలం వారి ఎడల ‘అప్రీతి’వహించమని మాత్రమే ఆదేశించి ఔదార్యం చూపింది. ఈ మాట వెనుక ఒక మహోదార క్షమా గుణముంది. ఏమంటే ఋగ్వేదానుసారం అట్టి బ్రహ్మద్వేష్యాది జనుల ఎడల ప్రజలందరూ అప్రీతిగా ప్రవర్తిస్తే అది వారి ఎడల సంఘ బహిష్కారతుల్కమవుతుంది. (వెలి) దానితో అట్టివారిలో అందరిలో కాకున్నా కొందరిలోనైనా బ్రహ్మజ్ఞుల ఎడల స్వయంకృతాపరాధనాభావం జనించి అది క్రమంగా పశ్చాత్తాపంగా పరిణమించి ఏదోనాటికి వారిలో నాటుకొన్న ‘దురభిమాన’ భావన తొలగిపోవచ్చు. తదుపరి వారు బ్రహ్మజ్ఞుల నారాధింపవచ్చు. ఆ దూరదృష్టితోనే ఋగ్వేదం శిక్షింపకయే ‘అప్రీతి’ని ప్రకటించమని ఆదేశించడం ద్వారా వారిని శిక్షించి సంస్కరించింది. ఇది వేద కరుణార్థ హృదయం.
***
దేవా! నీ ధనాగారాన్ని తెరువు
మహాంతం కోశముదచా ని షించ స్యందంతాం కుల్యా విషితాః పురస్తాత్‌
ఘృతేన ద్యావాపృథివీ వ్యుంధి సుప్రపాణం భవత్వఘ్న్యాభ్యః॥ ఋ.5-83-8॥
భావం:- ఓ ప్రభూ! ఘనమైన నీ ధనాగారాన్ని తెరువుము. దానితో సమస్తమునూ తడుపుము. ఎండిన కాలువలను ప్రవహింపచేయుము. నీటితో నింగి- నేలలను తడుపుము. ఆవులకు త్రాగే మంచినీరు లభించుగాక!
వివరణ:- ఇందులో అన్యోక్త్యలంకారముంది. ప్రత్యక్షంగా మేఘంతో పరోక్షంగా పరమాత్మునితో చేసే భక్తుని అభ్యర్థన ఈ మంత్రంలో వర్ణింపబడింది. ఈ అర్థద్వయం మేఘాన్ని పరమాత్మగా వ్యక్తీకరించి (వ్యక్తికాని దానిని వ్యక్తిగా చెప్పుట) ‘మహాంతం కోశం ముదచా నిషించ’ ‘‘నీ ఘనమైన ధనాగారాన్ని తెరచి అన్నింటిని తడుపుము’’అని భక్తుడు పరమేశ్వరుని ప్రార్థించాడు.

- ఇంకాఉంది