స్వాధ్యాయ సందోహం

స్వాధ్యాయ సందోహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గొప్ప ప్రీతిపాత్రులు. వారికి ఏ హింస సంభవింపనీయరు. పాపాన్ని అంటనీయరు’’. ద్రోహం ఎవరివలన జరుగనీయకుండ చేయడమే పాపంనుండి రక్షించుట. హింస సర్వపాపాలకు మూలకారణం. దైవం తప్ప మనిషిని జీవితంలో ఈ మూల కారణంనుండి ఎవరూ కూడ విముక్తం చేయలేరు. ఈ విషయాన్ని ఋగ్వేదం-
సునీథో ఘా స మర్త్యో యం మరుతో యమర్యమా మిత్రః పాంత్యద్రుహః॥ ఋ.8-46-4॥
‘‘మిత్ర, వరుణ, అర్యమా దేవతలు హింస చేయనీయకుండా ఎవడినైతే ఎప్పుడూ రక్షిస్తూ ఉంటారో అతడే నీతివంతుడు’’అని ఋగ్వేదం రమణీయంగా చెప్పింది.మనసా, వాచా, కర్మణా ఎవరు హింసకు పాల్పడరో అతడికి లోకంలో శత్రువులుండరు. అది ఎలాగో పతంజలి మహర్షి యోగదర్శనంలో ‘అహింసా ప్రతిష్ఠాయాం తత్సన్నిధౌ వైరత్యాగః’॥ యో.ద.2-35॥ ‘‘అహింసా స్వభావం ఎవనియందు పరిపూర్ణమైయుంటుందో అతని ముందు నిలిచినవారు వైరస్వభావాన్ని విడిచిపెడతారు’’అని సూత్రీకరించాడు.
నిజానికి ఎవని మనసులో ప్రీతిభావముంటుందో అతడి మనసులో వైరానికి చోటెక్కడ? మానవుని సమస్త కర్మలలో అహింసకే పెద్దపీట వేయబడింది. మనుస్మృతిలో మనువు-
అహింసయైవ భూతానాం కార్యం శ్రేయో- నుశాసనమ్‌॥ మ.స్మృ.2-159॥
‘‘ప్రాణులకు శుభసందేశం కూడ అహింసామార్గం ద్వారా మాత్రమే చేయాలి’’అని అహింసకు ప్రాధాన్యమిచ్చి హెచ్చరించాడు.
అంటే మనసులో వైరభావాన్నో, అసహ్య భావాన్నో లేదా అసూయాభావన్నో పెట్టుకొని పైకి ప్రేమ నటిస్తూ శుభసందేశమయినా ఈయరాదని మనువు ఆంతర్యం. ఈ విధంగాగాక ఎవరు ప్రేమపూర్వకంగా శుభ సందేశమిస్తారో వారి సందేశం వినేవారి మనస్సులలో వీరు తమ హితాన్ని కోరి మాత్రమే చెబుతున్నారనే సద్భావనను కలిగిస్తుంది. అప్పుడు వినేవాడు తన తప్పులను గ్రహించి పశ్చాత్తప్తుడవుతాడు. అది ఆతడు చేసిన పాపాలను ప్రక్షాళనం చేస్తుంది.

- ఇంకాఉంది

హిందీ మూలం: స్వామీ వేదానంద తీర్థ తెలుగు అనువాదం: డా పాలకోడేటి జగన్నాథరావు 9490620512