స్వాధ్యాయ సందోహం

స్వాధ్యాయ సందోహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్మ ప్రవీణుడవు. మేము మీకు మంగళాశాసనం పలుకుతాము.తండ్రీ! పుత్రులమైన మేము నీవద్దకు వచ్చే అధికారం మాకు లేదా? మిత్రుడవైన నీవు మమ్ము మోసగిస్తావా? మీ ప్రేమాంకంలో మేమింత స్థానాన్ని పొందలేమా? తల్లీ. తల్లికి మమత్వం, తండ్రీ! తండ్రిలో పుత్రవాత్సల్యం మెండుకదా. అందుచేత
స నః పితేవ సూనవే- గ్నే సూపాయనో భవ సచస్వా నః స్వస్తయే॥ ॥
‘‘ఓ అగ్నీ! తండ్రి కుమారుడికేవిధంగా సులభుడై, సుగమ్యుడై యుంటాడో అదేరీతిగా నీవు మాకు సులభుడవై కల్యాణప్రదుడవు కమ్ము.’’ తండ్రీ నీకంటె మాకు హితైషు ఎవరు? ఓ దేవా! ప్రతి మనిషిలో తోటి మనిషి ఎడల వైరాగ్ని రగిలిపోతూ ఉంది. ధన లోభంతో మానవ సమాజం పతితమై, దీనుడైన తోటి మానవుడికి దాన మిసుమంత కూడ చేయక ధనాన్ని కూడబెట్టుకొని సమాజ శత్రువులుగా మారిపోతున్నది. సమాజంలోని అట్టివారియందున్న చెడుభావనలను నాశనం చేయి.
- ఇంకాఉంది

హిందీ మూలం: స్వామీ వేదానంద తీర్థ తెలుగు అనువాదం: డా పాలకోడేటి జగన్నాథరావు