స్వాధ్యాయ సందోహం

స్వాధ్యాయ సందోహం -- 37

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హిందీ మూలం: స్వామీ వేదానంద తీర్థ
తెలుగు అనువాదం: డా పాలకోడేటి జగన్నాథరావు

మానవుడా! లోకంలో కర్మల నాచరిస్తూ నూరు సంవత్సరాలు జీవించు. అలా వేదోక్త కర్మల నాచరిస్తే నీకు జన్మమరణ బంధురూప కర్మఫలమంటదు.
వేదోపదేశాల ప్రకారం భగవత్ప్రీతికరమైన కర్మ ఏది? ఇది విచారణీయం. పుత్రుడుగా తన తండ్రి ఆదేశాన్ని తు.చ. తప్పక ఆచరించినపుడు ఆ తండ్రికి ప్రీతి కలుగుతుంది. అట్లే జీవుడు తనకు తండ్రి అయిన జగత్పిత ఆదేశాలను శిరసావహించి కర్మల నాచరిస్తే ప్రీతికరమవుతుంది. జగత్పిత ఆదేశాలు ఏవి? వేదాలే. అందుచేత వేదోపదేశానుసారంగా కర్మల నాచరించడమే భగవత్ప్రీతికరమవుతుంది.
ఆ విధంగా తన కొఱకుగాక లోక హితంకొఱకు చేసే కర్మలన్నీ నిష్కామకర్మలనబడతాయి. తనను తాను మరచి తనను భగవదంకితంగా భావన చేసినగాని అట్టి నిష్కామకర్మ సాధ్యంకాదు. వేదముద్దేశించినది, సంకేతించినది అయినట్టి కర్మనిష్కామకర్మయే. ఆ సంకేతాన్ని గ్రహించి నిష్కామకర్మ నాచరించినవాడు ధన్యుడు. అతని తల్లి ధన్యురాలు. (్ధన్యః సః, ధన్యా చ తదీయా జననీ) అట్టి ధన్యునకు తన మనోగతమైన సదాలోచనలను సమర్పించిన వానికి పూర్వజన్మకృత కర్మబంధనాలు పటాపంచలవుతాయి.
***
ఆత్మ - ఇంద్రియాల సంబంధం
సమీచీనాస ఆసతే హోతారః సప్తజామయః
పదమేకస్య పిప్రతః - ఋ 9-10-7
భావం:కన్ను, ముక్కు, చెవి, చర్మం, నాలుక, మనస్సు, బుద్ధి లేదా కన్ను, ముక్కు, చెవి, చర్మం, నాలుక, కాళ్ళు, చేతులు అనే ఏడు శరీరంలో ప్రధానేంద్రియాలు. ఇవి లౌకికమైన సుఖ, సంతోష, భోగాలను తాము గ్రహించి తిరిగి వానిని ఆత్మకు దానం చేస్తాయి. అలా చేస్తూ నిత్యమూ ఆత్మకు సేవాపూర్వకంగా రక్షణగా ఉండేందుకే స్వస్థతతో సుస్థిరంగా ఉంటాయి.
వివరణ:కన్ను, ముక్కు, చెవి, చర్మం, జిహ్వ, మనస్సు, బుద్ధి లేదా కన్ను, ముక్కు, చెవి, చర్మం, జిహ్వ, కాళ్ళు, చేతులు అనే ఏడు శరీరంలో ప్రధానేంద్రియాలు. అవి శరీరమనుభవించే సుఖాలకు ముఖ్య సాధనాలు. కళ్లు దృశ్యాలను, చెవులు శబ్దాలను, ముక్కు వాసనను, నాలుక రుచిని, చర్మం మెత్తన / గట్టితనం, వేడి/చల్లన మొ స్పర్శలను ముందుగా గ్రహించి ఆత్మకు ఆ అనుభవాలను కలిగిస్తాయి. ఇలా కేవలం అట్టి జ్ఞానాలనే కాదు జిహ్వ గ్రహించే అన్నపానాదుల సారాన్ని నేత్రాది ఇంద్రియాలు తమ వంతు భాగాలను స్వీకరిస్తాయి. అలా స్వీకరించకుంటే వెంటనే శక్తిహీనమైపోతాయి. ఇది అందరకు అనుభవంలోని విషయమే. ఆ రీతిగా ముక్కు పదార్థాల చెడు వాసనను గుర్తించి వానిని తిననీయకుండా నివారిస్తుంది. చర్మం మృదుత్వ - కఠినత్వాదులను తెలిసి ఆస్వాదనీయమో కాదో తెలుపుతుంది.