స్వాధ్యాయ సందోహం

స్వాధ్యాయ సందోహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హృదయమంటే- భక్తి (ఇది యోగ పరిభాషలో ఈశ్వర ప్రణిధానం). అట్లే మనస్సు అంటే జ్ఞానం. ఈ రెండింటి సంయోగంచేత సాధకుడికి ‘ఆత్మ’ దర్శనమవుతుంది. కాకపోతే ఈ హృదయ మనఃసంయోగంతోబాటు ఈశ్వర కృప కూడ సిద్ధించినప్పుడే ఆత్మసాక్షాత్కారం సాధ్యమని గ్రహించాలి.
ఈ మంత్రంలోనే ఆత్మనిర్వచనం కూడ ప్రస్తావించబడింది. ‘ఇదం జ్యోతి రమ్యతం మర్త్యేషు’ ‘‘ఆత్మ మరణశీలురైన వారిలో శాశ్వతమై ఉండేది’’ అని ఆత్మనిర్వచనం కూడ ప్రస్తావించబడింది. ఇంద్రియాలు క్షణభంగురాలు. అమరంగా ఉండేది ఒక్క ఆత్మయే. అది ఎందుకు ఆ ఆత్మ వినాశి అయిన శరీరంలో ఉంది? దీనికి సమాధానంగా ‘ధ్రువం జ్యోతిర్నిహితం దృశయే కమ్’ (ఋ.6-9-5) ‘‘ఈ సుఖప్రదాయిని మరియు అవినాశి అయిన ‘ఆత్మ’ దర్శనంకొఱకే ఆత్మ శరీరంలో భద్రపరచబడింది’’అని ఋగ్వేదం మానవ జీవిత పరమార్థాన్ని పేర్కొంది. ఆత్మను గురించి ఎంతోకొంత తెలుసుకొనడం , కోకపోవడమైనా ఆత్మశరీరాన్ని పొందుతుంది.

హిందీ మూలం: స్వామీ వేదానంద తీర్థ తెలుగు అనువాదం: డా పాలకోడేటి జగన్నాథరావు 9490620512