స్వాధ్యాయ సందోహం

స్వాధ్యాయ సందోహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హిందీ మూలం: స్వామీ వేదానంద తీర్థ తెలుగు అనువాదం:
డా పాలకోడేటి జగన్నాథరావు 9490620512
*
సుఖకరమైనది, శాశ్వతమైనది అయిన ఆత్మజ్యోతిదర్శనంకొఱకే అది (ఆత్మ) శరీరంలో ఉంచబడింది. నశించే ఇంద్రియాలలో మనసు చాల వేగవంతమైనది. మనస్సుతోకూడిన ఇంద్రియాలు, సమస్త ఇంద్రియాలు జ్ఞాన పూర్వకమైన ఒకేఒక కర్మను లక్ష్యంగా చేసుకొని ఆత్మ అనేక శరీరాలను ఎన్నింటినో పొందుతుంది.
వివరణ:- జీవన పరంపరలో ఏనాటికయినా దర్శనీయమైనది ఆత్మయే. ఉపనిషత్తులలో, వేదాలలో ఆత్మ దర్శనమే ప్రియమైనదని, ఆనందప్రదాయకమని యనేక సందర్భాలలో చెప్పబడింది. దీనికి ప్రమాణంగా బృహదారణ్యకోపనిషత్తులోని ఈ క్రింది వచనాన్ని పరిశీలించండి.
తదేతత్ ప్రేయః పుత్రాత్ ప్రేయో విత్తాత్ ప్రేయో- న్యస్మాత్
సర్వస్మాదంతరతరం యదయమాత్మా స యో- న్యమాత్మనః ప్రియం బ్రువాణం బ్రూయాత్ ప్రియం రోత్స్వతి, ఇతి॥
బృ.ఆ.ఉ.1-4-8॥ - ‘‘పుత్రునికంటే, ధనంకంటే, లోకంలో అన్నింటికంటే ఆత్మ చాల ప్రియమైనది. అది చాలా అంతరాంతరాలలో గుప్తంగా ఉంటుంది. ఆత్మ కంటే తనకు ప్రియమైనది తనకేదీలేదు. ఈ ఉపనిషత్తులోని యాజ్ఞవల్క్యుని మాట అక్షర సత్యం. ఆత్మ సదా శివమైనది. సత్యమైనది. శాశ్వతమయినది. దీనినికాక ధనాదులను, ఇంద్రియాలను, శరీరాన్ని ఆత్మగా తలంచి ప్రేమించినవాడు వినాశన ధర్మంగల రుూయవి సహజంగానే నశించిన పిమ్మట వానికోసమే ఎంతో దుఃఖపడవలసి యుంటుంది. ఆత్మతో సంబంధమున్నంతవరకే ధనాదులు, శరీరం ప్రియంగా భాసిస్తాయి. అట్టి ‘ఆత్మ’శరీరం నుండి విడిపోయినంతనే ప్రియంగాభావించే కరణమే (సాధనమే) ఉండదు. అందుకే వేదం ఆత్మను క= సుఖకారిణి అని వచించింది. ఇంద్రియాలలో చాలా వేగవంతమైనది ‘మనస్సు’. అది చాలా చంచలం కూడ. దాని చాంచల్యాన్ని-
చంచలం హి మనః కృష్ణ ప్రమాథి బలవద్ దృఢమ్‌తస్యాహం నిగ్రహం మనే్య వాయోరివ సుదష్కరమ్‌॥ భ.గీ.6-34॥
‘‘ఓ కృష్ణా! మనస్సు చాల చంచలమయినది. క్షోభను కలిగించేది. బలమైనది. మొండిది. అట్టి మనస్సును నిగ్రహించడం గాలిని బంధించడం వలె దుస్సాధ్యమైనది’’అని భగవద్గీత వర్ణించింది. మనస్సు, ఇంద్రియాలు అన్నీ జడాలు. అచేతనాలు. అవి ఇతరులకోసమే కర్మలుచేస్తాయి. ఈ విషయానే్న ప్రస్తుత మంత్రం ‘విశే్వ దేవాః సమనసః సకేతా ఏకం క్రతుమభి వి యంతి సాధు’ ‘‘మనస్సు మరియు బుద్ధి ఈ రెండింటితో కూడి సర్వేంద్రియాలు ఒక కర్తను లేదా కర్మను లక్ష్యంగా పెట్టుకొని మాత్రమే బాగా విశేషంగా కర్మ చేసేందుకు సన్నద్ధమవుతాయి’’ అని వివరించింది. అంటే ఇంద్రియాలు, మనస్సు, బుద్ధికి ఒకే లక్ష్యం మరియు ఒకే ఉద్దేశ్యం. అది కర్మను చేయడమే. అదే మంత్రం‘క్రతువు’గా చెప్పింది.

- ఇంకాఉంది