స్వాధ్యాయ సందోహం

స్వాధ్యాయ సందోహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హిందీ మూలం: స్వామీ వేదానంద తీర్థ తెలుగు అనువాదం:
డా పాలకోడేటి జగన్నాథరావు 9490620512
*
యతునస్య కేతున జ్యాయాంసం ఋషిస్వరమ్:- భగవంతుడు క్షణకాలం పాటు కూడ ఆలస్యం లేకుండా తన విధ్యుక్తకర్మలను నిర్వహిస్తాడు. ఆయనకు సంకేతంగా ఈ మంత్రంలో ‘యతునః’అన్న పదం ప్రయోగింపబడింది. అట్టి నిరంతర కర్మిష్ఠియైన భగవానుని నిర్దేశాల ననుసరించి ఆత్మ-పరమాత్మల లక్షణాలను క్షుణ్ణంగా ముందుగా తెలిసికొని ఉండాలి. పరమాత్మ ‘స్వాభావికీ జ్ఞానబలక్రియా చ’ (శే్వతాశ్వతరోపనిషత్తు) స్వభావతః జ్ఞాన, బల, క్రియా సంపన్నుడు. ఆయన సంపద్వైభవాన్ని గ్రహించడమే పరమాత్మ జ్ఞానాన్ని పొందడం. ఉపదేశకుడు విధిగా అట్టి జ్ఞానాన్ని సంపూర్ణంగా తెలిసికొని యుండాలి. దానికి ఉపదేశకుడు సృష్టి స్వరూపాన్ని అధ్యయనం చేయడం ద్వారానే పొందగలడు. దానికి విధేయంగానే చేసే ప్రబోధం కూడ నిబద్ధమైయుండాలి.
2. అంతేకాక సృష్టి ధర్మాలను పూర్వమధ్యయనం చేసిన మహర్షుల మనోభిప్రాయాలను కూడ తన యుపదేశంలో జతచేసి ప్రబోధించాలి. మరి ఋషి అంటే ఎవరు? ‘ఋషిర్దర్శనాత్’ (నిరుక్తం 2-3-11) ‘సాక్షాత్కృతధర్మాణ ఋషయో బభూవుః’ (నిరుక్తం 1-6-20) ‘‘సృష్టిలోని సర్వ ద్రవ్య- పదార్థాల ధర్మాలను సాక్షాత్కరింప చేసుకున్నవాడే ఋషి’’అని యాస్కుని నిర్వచనం. అట్టి మహర్షుల పదార్థ, ద్రవ్యాల సాక్షాత్కార ధర్మాలను తన ధర్మోపదేశంలో విధిగా స్పర్శించడమే ప్రబోధకుని ప్రథమ కర్తవ్యం. ఆ విధంగా ఉపదేశముండాలనియే వేదం ‘ఋషి స్వరం చరతి’అనే వాక్యాన్ని మంత్రంలో చేర్చింది.
3. ఉపదేశమంత మాత్రముంటే చాలని వేదం సంతోషపడలేదు. ఆ విధంగా ఉపదేశించే ఉపదేశకుడు ‘యాదృశ్మిన్‌ధాయి తమపస్యయా విదత్’ ‘‘ఏవి ఆచరణకు గ్రహింపబడినవో అవి ఆచరణకు యోగ్యంగా ప్రబోధింపబడాలి’’ అని దీని అర్థం. ఆచరణకు సాధ్యమా అన్న విచక్షణను పరిశీలింపకనే కొందరు ప్రబోధాలు చేస్తారు. కాని అవి ఆచరణలో సాధ్యంకావని తరువాత తెలియబడతాయి. కాబట్టి ఉపదేశకుడు ఉపదేశించే ముందే అవి ఆచరణ సాధ్యమా అని పరిశీలించాలి. మరో విశేషమేమంటే ఏవి ఎవరికి బోధించాలో కూడ విచక్షణా జ్ఞానం కలిగియుండాలి. అపాత్రోపదేశం వలన ఉపదేశ లక్ష్యం భగ్నమైపోతుంది.
స ఉ స్వయం సో అరం కరత్:- ఎదుటివారికి చెప్పేటందుకే నీతులున్నాయి అన్న రీతిగాగాక చేసిన ఉపదేశం ఉపదేశకుడు కూడ విధిగా ఆచరించాలి. అప్పుడే అది ఉత్తమోపదేశమవుతుంది. అది విన్నవారిలో తగినంతగా ప్రభావాన్ని చూపుతుంది.
- ఇంకాఉంది