స్వాధ్యాయ సందోహం

స్వాధ్యాయ సందోహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సమాజ సేవకుడికి రెండువిధాల ప్రయోజనం
సదాపృణో యజతో వి ద్విషో వధీద్బాహువృక్తః శ్రుతివిత్తర్యో వః సచా
ఉభా స వరా ప్రత్యేతి భాతి చ యదీం గణం భజతే సుప్రయావభిః॥॥
భావం:- తాను సంతోషంగా ఉంటూ ఇతరులను సంతోషంగా ఉంచేవాడు. క్రియాశీలుడు, శారీరక శక్తికలవాడు, స్వార్థరహితుడు, విన్న విషయాలను బాగా అర్థం చేసుకొన గలిగినవాడు, తమ శత్రువులను వధించుకోగలిగినవాడు.
1. వైయక్తిక 2. సామాజిక ప్రయోజనాలను రెండింటిని పొందగలడు. తన సత్ప్రవర్తన ద్వారా ఇతరులకు సహాయపడతాడో అతడు కూడ ఆ రెండు ప్రయోజనాలను పొందుతాడు.
వివరణ:- వైయక్తిక ప్రయోజనం మరియు సామాజిక ప్రయోజనమని ప్రయోజనాలు రెండువిధాలు. ఎంతోమంది ఈ రెండింటిని పొందేందుకు ఎంత ప్రయత్నించినా ఎవరో కొద్దిమంది మాత్రమే సాఫల్యాన్ని సాధించగలరు. ఇది మా మాట కాదు. ‘సిద్ధయే యత మానానాం సిద్ధిం కోపి ప్రయాతి చ’ ‘‘కార్యసిద్ధికోసం ప్రయత్నించేవారిలో ఏ కొద్దిమందో సిద్ధిపొందుతారు’’అన్నది పెద్దల మాట కూడ. ఈ మంత్రంలో పైప్రయోజనాలు రెండింటిని సిద్ధింపచేసుకొనదలచిన వాని లక్షణాలు విపులంగా వర్ణించబడ్డాయి.

హిందీ మూలం: స్వామీ వేదానంద తీర్థ తెలుగు అనువాదం: డా పాలకోడేటి జగన్నాథరావు