స్వాధ్యాయ సందోహం

స్వాధ్యాయ సందోహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

1. సదాపృణః:- తాను ముందుగా ప్రసన్నంగా ఉండి తనతోబాటు ఇతరులను కూడ ప్రసన్నంగా ఉంచేవాడు.
2. యజతః:- యజనశీలుడు. అనగా నిరంతరం సత్కర్మలను యజ్ఞంచేసే క్రియావంతుడు.
3. బాహువృక్తః:- విఘ్నకారులైన వారిని తన శారీరక (బాహు) శక్తితో అణచివేయగలవాడు.
4. శ్రుతవిత్:- విన్నదానిని అర్థంచేసుకోగలవాడు. అర్థం చేసుకొని ఆచరించగలవాడు.
5. తర్యః:- తరింపచేసేవాడు. స్వార్థహితుడే తాను తరించి ఇతరులను తరింపచేయగలడు.
6. యదీం గణం భజతే సుప్రయావభిః:- ప్రజాసేవ చేసేవాడు. ఇతడు ముందుగా విడువదగిన గుణం స్వార్థం. స్వార్థపరుడికివలె గాక నిస్స్వార్థసేవా తత్పరుడి వెంట సమాజమంతా నడుస్తుంది. సర్వాభ్యుదయాన్ని కోరేవాడు అందరితోబాటు సర్వాభ్యుదయాన్ని పొందుతాడు. ఈ మహోన్నతాశయాన్ని వేదం ‘ఉభా స వరా ప్రత్యేతి భాతి చ’ అతడు వైయక్తిక-సామాజిక (ఉభయ)ప్రయోజనాలను (వరాః) పొందుతాడు. ‘ప్రత్యేతి’ అని ఎన్నో వేల యేండ్లకు పూర్వమే ఘోషించినా మనిషికి వేద ధర్మమింకా చెవికి సోకడం లేదు. అదే సమాజ దురదృష్టం.
**
మహావీర్యా! మాకు బలమిమ్ము
బలం ధేహి తనూషు నోబలమింద్రానళుత్సు నః
బలం తోకాయ తనయాయ జీవసే త్వం హి బలదా అసి॥ ఋ.3-53-18॥
భావం:- ఓ ఇంద్ర! మా శరీరాలకు బలమిమ్ము. శరీరరూపమైన బండిని లాగే ఐదు జ్ఞానేంద్రియాలు మరియు మనస్సు అనే గుఱ్ఱాల వంటి ఇంద్రియాలలో బలాన్ని నింపు. మా పిల్లాపాపలు సుఖంగా జీవించేందుకు బలాన్ని ఇమ్ము. బలదాతవు నిజంగా నీవే.
వివరణ:- దుర్బలులకు బలదాతా! బలవంతులకంటె బలమైనవాడా! నీ దయవలన అద్భుత కార్యాలను చేయగల శక్తి సంపన్నత మాకుంది. మరెందుకో! నేను దుర్బలుడనను భావన కలుగుతూంది. పశుపక్ష్యాదుల కంటె మానవులమైన మాలో రోగ పీడన అధికంగా కనబడుతూంది. అవి ప్రతిక్షణం మమ్ము పీడిస్తూ ఉన్నాయి. ఓ దేవాధిదేవా! నీవు బలానికి నిధివి. అది ఎన్నటికి తరగనిది. నాకు కొద్దిగా బలమిచ్చి బలవంతుణ్ణి చేయి.

- ఇంకాఉంది

హిందీ మూలం: స్వామీ వేదానంద తీర్థ తెలుగు అనువాదం: డా పాలకోడేటి జగన్నాథరావు 9490620512