స్వాధ్యాయ సందోహం

స్వాధ్యాయ సందోహం--38

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హిందీ మూలం: స్వామీ వేదానంద తీర్థ
తెలుగు అనువాదం: డా పాలకోడేటి జగన్నాథరావు

చూపు మాత్రం చేతనే కళ్లు పదార్థాల గుణ దోషాలను తెలిపి జిహ్వను తినేందుకు అనుమతిస్తుంది. ఇలా ఇంద్రియాలు తమ తమ జ్ఞానాలను పరస్పరం ఇచ్చిపుచ్చుకొంటూ సహకరించుకొంటూ ఉంటాయి. అందుకే వేదం వీటిని ‘హోతారః’ ఆదాన ప్రదానాలు చేసేవి అని నిర్దేశించింది. ఈ విధమైన ఇంద్రియాల సమన్వయ సహకారమంతా దేనికి? శరీర సంరక్షణ ద్వారా అందున్న ఆత్మను పరిపుష్టం చేసేందుకే. అంటే ఏమిటి? ఈ సప్తేంద్రియాలు ఆత్మకొరకు మాత్రమే ఉన్నాయి. అంతేకాదు అవి నిత్యమూ అభిమానించేది కూడా శరీరగతమైన ఆత్మనే. ‘పదమేకస్య పిప్రతః’ అని వేదం వివరించింది దీనినే.
ఈ విధంగా శరీర గత సప్తేంద్రియాలు ఆత్మకు అనుకూలంగా వ్యవహరిస్తే అప్పుడవి ‘సమీచీనాసః’ సన్మార్గగాములనబడతాయి. ఎందుకంటె ఆత్మకు ప్రధానగమ్యమైన ముక్తి మార్గ ప్రయాణంలో సహకరించడానికి ఆసక్తి కలవి కావడంవల్ల. ఎలాగంటే ఎవరైనా మనముందు అత్యంత మధుర పదార్థాన్ని ఉంచారనుకోండి, దానిని చూచి జిహ్వచాపల్యంతో అధికంగా తినివేస్తాం. ఫలితం ఏదో రోగం ముంచుకొస్తుంది. ఇలా చాపల్యం చేత అధికంగా తిన్న జిహ్వ శరీరానికి రోగకారకం కావడం ద్వారా శరీర అనారోగ్యానికి కారణమయింది. కాబట్టి అది సమీచీనః=సక్రమ ప్రవర్తన కలది కాదని చెప్పవలసి ఉంది. ఒక్క జిహ్వే కాదు నేత్రాది ఇంద్రియాలు తమ చాపల్య స్వభావం చేత విచ్చలవిడిగా ప్రవర్తిస్తే శరీరానికి హాని కలిగించడమే కాదు ఆత్మ లక్ష్యానికనుగుణంగా గాక వ్యతిరేకంగా ప్రవర్తించినవై ప్రతీచీనమైపోతాయి. వేదం ఇట్టి ప్రతీచీనమైన ఇంద్రియాలను నిరసిస్తూ అవి ఆత్మను లక్ష్యానికి చేర్చే సత్ప్రవర్తకమైనవిగా ఉండాలి. ‘పిప్రతః సమీచీనాసః ఆసతే’ అని ఇంద్రియ లక్షణాన్ని నిర్వచించింది.
యజ్ఞ నిర్వహణలో ‘హోత, అధ్వర్యుడు, ఉద్గాత, బ్రహ్మ’ అనే నలుగురు యజ్ఞ నిర్వాహకులు (ఋత్విక్కులు) ఉంటారు. ఋగ్వేద నిర్వాహకుడైన ఋత్విజుని హోత అని అంటారు. యజ్ఞాన్ని ఏ రీతిగా నిర్వహించాలో తెలియజేసేది ఋగ్వేదం. శరీరేంద్రియాలు ఆత్మానుకూలంగా శరీరాన్ని నిర్వహించడం కూడా ఒక యజ్ఞ సదృశమే. కాబట్టి యజ్ఞ నిర్వహణలో ఋగ్వేదం వలె ఈ సప్తేంద్రిలు యధార్థ జ్ఞానాన్ని కలిగిస్తాయి. కాబట్టి వానిని ఈ మంత్రం హోతారః= హోతలుగా వర్ణించింది. ఈ విధంగా ఈ మంత్రం ఆత్మ - ఇంద్రియాలు - శరీరం వీని మధ్యగల సంబంధాన్ని యజ్ఞ సదృశంగా అభివర్ణించింది. ఇంద్రియాలు ఆత్మ కారణంగా ఉద్భవించాయి. శరీరం భోగప్రాప్తి స్థానం. ఈ రెండు ఆత్మ కోసమే కాని ఆత్మ వాని కొరకు కాదు.
సృష్టి అంతా జీవులకోసమే
తుభ్యేమా భువనా కవే మహిమ్నే
సోమతస్థిరే తుభ్యమర్షంతి సింధవః

--ఇంకావుంది...