స్వాధ్యాయ సందోహం

స్వాధ్యాయ సందోహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నా శరీరమే ఒక భారవంతమైన బండి. దానిని కన్ను, చెవి, ముక్కు, నోరు, చర్మం అనే జ్ఞానేంద్రియాలు మరియు మనస్సు కలిసి ఆరు ఇంద్రియాలు లాగుతున్నాయి. అవి కూడ చాల బలహీనమైనవి. ఓ దేవా! దుర్బలమైన కళ్లు ప్రకాశమానుడవైన నినె్నట్లు చూడగలవు? గియ్‌య్... మంటూ ప్రతిధ్వనించే బధిర ప్రాయమైన చెవుల నీ యశోగానాన్ని ఎలా వినగలవు? ఇష్టరుచులకు మరగిన నాలుక నీ నామామృత రసాన్ని పానం చేయగలదా? భవతారకమైన నీ నామాన్ని పలుకగలదా?
ఓ అమృతవపూ! అట్టి నీరసమైన ఆ ఆరు గుఱ్ఱాలకు బలాన్ని, జవాన్ని అనుగ్రహించు. సంతానం నీవు అనుగ్రహించిన దాంపత్య ఫలాలే. వారు కూడ సుఖజీవనం గడిపేందుకు నీవే శక్తిసామర్థ్యాలను ఇమ్ము. నీవే నిజమైన మహాదాతవు. నిన్నుగాక మరెవ్వరిని అర్థించను? విద్వాంసులు యుగయుగాలుగా నినే్న సేవిస్తూ ఉన్నారు ఓ జ్ఞానేశ్వరా! అగ్నీ! దుఃఖనివారకుడవు, నిత్యుడవు, జీవన దాతవు. రక్షకుడవు, పూజనీయుడవు అయిన నిన్ను విద్వాంసులు యుగయుగాలుగా పూజిస్తున్నారు. మరియు నిష్కాములైన జ్ఞానులు మరణశీలురైన మానవులు, చైతన్య స్వరూపుడవు, సర్వవ్యాపకుడవు, ప్రజాపతివి అయిన నిన్ను నమస్కారంచేయుట ద్వారా చేరుకొంటున్నారు. వేదం అగ్నిని పల సందర్భాలలో దూతగా వర్ణించింది. దూత శబ్దానికి ముఖ్యార్థం దుఃఖాన్ని హరించేవాడని. లౌకిక సాహిత్యంలో దూత శబ్దానికర్థం ఒకరి సందేశాన్ని మరొకరికి తెలిపేవాడు. ఇతరుల సందేశాన్ని స్వకీయస్వామికి తెచ్చి వినిపించేవాడు అని. ఈ రెండు పనులను చేసేందుకు దూత బుద్ధిమంతుడు, జ్ఞానవంతుడు అయియుండాలి. దీనిని ఋగ్వేదం కంఠోక్తంగా చెప్పింది. ‘‘అగ్నిః జ్ఞాన స్వరూపుడైన పరమేశ్వరుడే నిజమైన చైతన్యవంతుడు. అత్యంత మేధావి మరియు జ్ఞాని’’.ఈ కారణంగానే ‘త్వాం దూత మగ్నే అమృతం యుగే యుగే హవ్యవాహం దధిరే పాయుమీడ్యమ్’ ‘‘శాశ్వతుడు - భోగద్రవ్య సర్వప్రదాత, రక్షకుడు, పూజ్యుడు అయిన అగ్ని భగవానుని యుగయుగాలుగా విద్వాంసులు దూతగా చేసుకొనుచున్నారు.’’ అయితే ఆ అగ్నిభగవానుని దూతగా చేసుకోవడమంత సులభమైన పనికాదు. దూతగా చేసుకొనేముందాయనను భక్తితో పూజించాలి. పూజించేందుకు ముందుగా ఎవరైనా ఆ దేవదేవుని వద్దకు వెళ్లాలి.అంటే ఏమిటో వేదమీవిధంగా వివరించింది. ‘‘దేవతలు- మరణశీలురైన మానవులు ఆ జాగ్రత్ స్వరూపుడు, సర్వవ్యాపకుడు ప్రజాపతి అయిన భగవానుని దరికి నమస్కార పూర్వకంగా చేరుతారు.’’అంటే సర్వలోకాలు ఆ దైవంముందు తలలువంచుతారు. అలా ఎందుకు వంచాలో ఋగ్వేదం ‘దేవనాముత యో మర్త్యానాం యజిష్ఠః’ (ఋ.6-15-13) ‘‘దేవతలు మరియు మనుష్యులలో సర్వోన్నతుడే పూజనీయుడు’’అని చెప్పింది. అట్టివాడు ఒక్క భగవానుడే.

హిందీ మూలం: స్వామీ వేదానంద తీర్థ తెలుగు అనువాదం: డా పాలకోడేటి జగన్నాథరావు