స్వాధ్యాయ సందోహం

స్వాధ్యాయ సందోహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

5. ఆనందమయ కోశం:- ప్రీతి- ప్రసన్నత- ఆనందాలకు నిలయమైన కోశం ఆనందమయ కోశం. జీవాత్మ ఆచరించే కర్మ- ఉపాసన మరియు జ్ఞానాది వ్యవహారాలను దీనియందే అంతర్భవిస్తాయి.
(సత్యార్థ ప్రకాశం 9వ సముల్లాసం)
ఈ వివరణనుబట్టి జీవాత్మ వాటన్నింటికంటే వేరైనదని, వానియందే దాగియుందని స్పష్టపడుతూ ఉంది. ఈ కోశాలు తొలగింపబడితే జీవాత్మ ప్రకటితమవుతుంది. ఈ పంచకోశాలు స్థూల మరియు కారణ శరీరాల కంటే భిన్నమైనవి. ఇచట పంచకోశాలకు బదులుగా పంచ ప్రాణాలను స్వీకరించిన సిద్ధాంతం కూడ ఉంది. ముండకోపనిషత్తు దీనికొక ఉదాహరణ. అందలి ఈ క్రింది శ్లోకాన్ని చూడండి.
ఏషో- ణురాత్మా చేతసా వేదితవ్యో యస్మిన్ ప్రాణః పంచధా సంవివేశ
ప్రాణైశ్చిత్తం సర్వమోతం ప్రజానాం యస్మిన్ విశుద్ధే విభవత్యేష ఆత్మా॥ (ముండకోపనిత్తు 3-1-9)
భావం:- పూర్వం చెప్పబడిన ఆత్మ చిత్తం చేత తెలియబడుతుంది. దీనిలో 3ప్రాణం2ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన అనే ఐదు భేదాలుగా ఉంటుంది. సమస్త జీవుల చిత్తమూ ఈ పంచవిధ ప్రాణాలచేత సమావిష్టమై యుంటుంది. ఇవి శుద్ధమైనంతనే జీవాత్మకు విభూతులు సంక్రమిస్తాయి.
ముండకోపనిషత్తు ఈ భావాన్ని శుక్లయజుర్వేదంనుండి గ్రహించింది. చూడండి.
పంచనద్యః సరస్వతీమపి యంతి సస్రోతసః
సరస్వతీ తు పంచధా సో దేశే- భవత్సరిత్‌॥
(శు.య.34-11)
భావం:- పంచ నదులు- పంచేంద్రియాలు సరస్వతీ జ్ఞాన స్వరూపమైన ఆత్మను పొందుతున్నాయి. మరియు ఆ సరస్వతి ఆత్మకూడ శరీరమనే ప్రదేశంలో ఐదువిధాల సరిత్= నదులుగా అంటే శరీరమంతట ఇంద్రియాల ద్వారా స్వప్రకాశాన్ని వెదజల్లుతూ ఉంది. ఈ పంచ జ్ఞానేంద్రియాలు ఆత్మకు వశమైనంతనే ఆత్మ ముక్తస్థితిని పొంది మోక్షాన్ని పొందుతుంది. కఠోపనిషత్తు చెబుతున్న ఈ ప్రమాణాన్ని తిలకించండి.యదా పంచావతిష్ఠంతే జ్ఞానాని మనసా సహ బుద్ధిశ్చ న విచేష్టతి తామాహుః పరమాం గతిమ్‌॥ ॥ కఠ.ఉ.2-3-10 మనస్సుతో కూడి జ్ఞానేంద్రియాలు మరియు బుద్ధి తమ కార్యకలాపాలను విరమించిన దశయే పరమాగతి= మోక్షస్థితి అనబడుతుంది.
ఈ మాటను ఋగ్వేదం కంఠోక్తంగా ఇలా చెప్పింది. ‘అగ్నిరిద్ధి ప్రచేతా అగ్నిర్వేధస్తమ ఋషిః’ (ఋ.6-14-2) ‘‘అగ్నిః జ్ఞాన స్వరూపుడైన పరమేశ్వరుడే నిజమైన చైతన్యవంతుడు. అత్యంత మేధావి మరియు జ్ఞాని’’.

హిందీ మూలం: స్వామీ వేదానంద తీర్థ తెలుగు అనువాదం: డా పాలకోడేటి జగన్నాథరావు