స్వాధ్యాయ సందోహం

స్వాధ్యాయ సందోహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అట్టివారి దానాలు, సానుభూతులు కేవలం బాహ్యాడంబరాలే. దానం, దయ మొదలైన సత్‌ప్రవృత్తులు దీనపు కాంతులవలె సమీపంనుండి దూరానికి వ్యాపిస్తాయి.’’ అట్టి అదాతయైన వానినుండి, అదాతయైన మిత్రునినుండి దూరంగా వెళ్లిపొమ్మ ‘న స సఖాయో...పిత్వః’అని వేదం హితవు పలికింది. మరో సందర్భంలో ఋగ్వేదమే మిత్రుడు అయినాకాకున్నా యాచకుడుగా వచ్చినవానిని సంతృప్తిపరచాలి.మోఘమన్నం విందతే అప్రచేతాః సత్యం బ్రవీమి వధ ఇత్స తస్య
నార్యమణం పుష్యతి నో సఖాయం కేవలాఘో భవతి కేవలాదీ॥

‘‘ఒక మహాత్ముడిని గాని ఒక మిత్రుడినిగాని పోషింపని అన్నాన్ని తాను మాత్రమే తినేవాడు కేవలం పాపాన్ని మాత్రమే భుజించినవాడవుతాడు. అట్టి మూర్ఖుడికి ప్రాప్తమైనది అన్నం కాదు. అది అతడి పాలిట మృత్యువే’’అని ఋగ్వేదం శపించింది. ఈ శాపానికి భయపడి అయిన మిత్రులను, మహాపురుషులను, యాచకులను దానధర్మాలతో మానవులారా! సత్కరించండి.
అందరూ ఒకలా ఉండరు
సవౌ చిద్ధస్తౌ న సమం వివిష్టః సంమాతరా చిన్న సమం దుహాతే
యమయోశ్చిన్న సమా వీర్యాణి జ్ఞాతీ చిత్సంతౌ న సమం పృణీతః॥

భావం:- చేతులు రెండూ సమానంగా ఉన్నా ఒకే రీతిగా పనిచేయజాలవు. ఒకే తల్లికి పుట్టిన రెండు దూడలు ఒకే ప్రమాణంగల పాలనీయజాలవు. రెండు ఎద్దులు ఒకే విధమైన బలం కలిగియుండవు. బంధువులయిన ఇద్దరు ఒకే విధంగా ఇతరులకు దానం చేయలేరు.
వివరణ:- సృష్టిలో సమానత్వంతోబాటు వైషమ్యం (సమాన రాహిత్యం) కూడ కనబడుతుంది. దానిని ఈ మంత్రం సోదాహరణ పూర్వకంగా వివరిస్తూ ఉంది. శరీరంలో కుడి-ఎడమ చేతులకు శక్తి సమానంగా ఉండదు. ఒకే తల్లి ఆవుకు పుట్టిన రెండు దూడలు పెరిగి ఒకే ప్రమాణంగల పాలనీయవు.

- ఇంకాఉంది

హిందీ మూలం: స్వామీ వేదానంద తీర్థ తెలుగు అనువాదం: డా పాలకోడేటి జగన్నాథరావు