స్వాధ్యాయ సందోహం

స్వాధ్యాయ సందోహం-42

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈ విషయాన్ని అటుంచి ప్రస్తుతాంశమైన ఇంద్రియ పరిశుద్ధతకు హేతువయిన సంయమనాన్ని గూర్చి విచారిద్దాం.
మంత్రంలో ఇంద్రియాలు ‘హరి’ శబ్దంచేత చెప్పబడ్డాయి. హరిశబ్దానికి హరించునది అని గికార్థం. బలీయమైన తమ శక్తిచేత ఇంద్రియాలు ఆత్మను వశపరచుకొని మంచిగాని చెడు గాని మార్గాలవైపునకు హరించుకొని అంటె లాగికొనిపోవడం వాటి స్వభావం. అందుకే ఇంద్రియం= హరిశబ్ద యోగ్యమయింది.
అసలు ఆత్మ ఇంద్రియాలకు వశపడుతూంది. అంటే అందుబాటులో ఉన్న భోగాలను అనుభవించాలనో లేదా అందుబాటులో లేకున్నా ఎలాగయినా భోగాలననుభవించాలనో అన్న భావనయే ఆత్మను ఇంద్రియాలకు వశపరుస్తూ ఉంది అని అర్థం. ఈ భావన శ్రేయోదాయకంకాదు. దైవం భోగ్యవస్తువులను ముందుగానే సిద్ధంచేసి వాని ననుభవింపదగిన ఇంద్రియాలతో కూడిన శరీరంలోనికి జీవుడిని ప్రవేశింపచేసాడు. అందుకొఱకై ఇంద్రియాల వెంట పరుగిడవద్దు. ‘‘యుజ్యతే సంధేనుభిః కలశే సోమో అజ్యతే’’అని వేదం హెచ్చరించింది. అంటే ఏమిటి? భోగాలు పూర్వజన్మ కర్మఫలాలు. అవి ఈ జన్మలో తప్పక అనుభవంలోనికి వస్తాయి. ఎంత ప్రయత్నించినా ఎక్కువగా రావు. ప్రయత్నింపకున్నా తక్కువగా రావు. అందుచేత ఇంద్రియాలు లాగుకొనిపోయే విషయ వాసనల వెంటబడి ఆత్మ నాశనం చేసుకోవడ మెందుకని ఫలితాంశం.
చిత్రమేమంటే విషయాకర్షణ చాలా బలవత్తరమైనది. అది ఆత్మకుగల సహజ జ్ఞానంమీద అజ్ఞానపు తెరను కప్పివేస్తుంది. దానితో ఆత్మకు కొంచెం కూడ తెలివి కలుగదు. విష వాసనాకర్షణ కారణంగా ఆత్మకు ప్రకృతితో సాంగత్యం పెరిగిపోతుంది. దానితో జీవాత్మ పరమేశ్వరుడికి దూరమైపోతుంది. ప్రకృతి సాంగత్యం పెరిగినకొద్దీ జీవాత్మకు జ్ఞానం క్షీణిస్తుంది. కాని ఎవరో కొద్దిమంది భాగ్యవంతులు మాత్రం ఈ దుస్థితిని గ్రహించి మేల్కొని సర్వథా సర్వదా సదా సంస్తూయమానుడైన భగవంతుని ధ్యానిస్తారు. ఆయన సాన్నిహిత్యానే్న వాంఛిస్తారు. ఆ విధంగా పరమాత్మ ప్రేమను వాత్సల్యాన్ని పొందుతారు. ఫలితంగా వారి బుద్ధి సంస్కార పూరితమవుతుంది. దానివలన బుద్ధి విషయవాసనా పరాఙ్మఖమై వారి ప్రవర్తన కూడ జ్ఞాన ప్రవర్తితమవుతుంది. అట్టి సత్ప్రవర్తన అలవడినవారు కేవలం లౌకిక జీవనంకోసం - సుఖసామగ్రి సముపార్జనకోసం పాపకార్యాలకు పాల్పడరు. వారెప్పుడూ పరమాత్మచే నిర్ణయింపబడిన భోగభాగ్యాలు తమంతతామే కాలానుగుణంగా తప్పక సంప్రాప్తించగలవన్న విశ్వాసంతో జీవిస్తారు.
ఇట్టి సదాలోచన సర్వవ్యాపకుడైన పరబ్రహ్మమే కర్మఫలప్రదాత అని గ్రహించి దృఢంగా విశ్వసించిన వారికే కలుగుతుంది. అంతేకాదు. వారు భగవానుడు లేనిచోటు ఎక్కడా లేదన్న జ్ఞానం కలిగినవారు కావడంవలన ఏ పనిని కూడ రహస్యంగా చేసేందుకు ప్రయత్నించరు. ఇంకావుంది...

హిందీ మూలం: స్వామీ వేదానంద తీర్థ తెలుగు అనువాదం: డా పాలకోడేటి జగన్నాథరావు