Others

స్వాధ్యాయ సందోహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హిందీ మూలం: స్వామీ వేదానంద తీర్థ తెలుగు అనువాదం:
డా పాలకోడేటి జగన్నాథరావు 9490620512
*
సకల జనుల లక్ష్యమొక్కటే కావాలి. ఆ లక్ష్యమేమిటి? దానిని కూడ ‘సమ్యంచో- గ్నిం- సపర్యత’ ‘‘సమానమనస్కులై అగ్నిని జ్ఞానస్వరూపుడైన భగవంతుని పూజించండి’’అని వేదం నిర్దేశించింది. అసలు మనుష్యుల మధ్య విభేదాలను సృష్టించి రక్తపాతాలను కల్పిస్తున్నది దైవారాధన ప్రభేదాలే కదా. దైవమొక్కడేనని నిజంగా నమ్మితే ఆరాధనారీతులు వేరైనంతమాత్రాన విభేదాలు కల్పించుకొని కలహించుకోవడం దేనికి? అందుకే ‘‘సమాన మనస్కులై జ్ఞాన స్వరూపుడైన భగవంతుని ఆరాధించండి’’అన్న సార్వత్రిక, సార్వకాలిక సందేశాన్ని వేదం విన్పించింది. వేద సందేశానుసారం మనుషులంతా సమాన మనస్కులైతే వారికి ఆహార పానీయాలు కూడా ఒకటి కావడంలో కష్టమేముంటుంది? అది సంభవమైతే మానవజాతికి అభ్యుదయమే తప్ప వినాశనముండదు కదా! దానికొక ఉపమానంగా వేదం ‘దేవా ఇవామృతం రక్షమాణాః’ ‘‘ఇంద్రియాలు ఆత్మను రక్షించిన విధంగా’’అని చెప్పింది. ఇంద్రియాల చేత రక్షింపబడిన ఆత్మ భగవద్దర్శనానుభూతిని పొంది కైవల్యసిద్ధి చెందినట్లు ఆహారపానీయాల ఐక్యంచేత సమాన మనస్కత సిద్ధించి మానవ జాతి తప్పక పురోగమిస్తుంది.
**
స్వదేశీయుల ఔన్నత్యం నిలబెట్టు
నీచైః పద్యంతామధరే భవంతు యేనః సూరిం మఘవాసం పృతన్యాన్
క్షిణామి బ్రహ్మణా మిత్రానున్నయామి స్వానహమ్
అథ.వే.3-19-3
భావం: మా జ్ఞానులను, ధనవంతులను అవమానపరుచువారు, హీనంగాపతితులయిపోవాలి. వారు అధములు కావాలి. నేను జ్ఞానం మరియు తపస్సుల శత్రువులను నశింపచేస్తాను. నే ను వారిని ఉన్నతులను చేస్తాను.
వివరణ:- ఈ మంత్రంలో దేశాధిపతికి విధిగా ఉండదగిన శుభకామన వర్ణింపబడింది.దేశానికి వెనె్నముక వంటిది జ్ఞానం, ధనం. ఈ రెండింటిని ఎవరు దురుపయోగపరుస్తారో, ఎవరు ధ్వంసం చేస్తారో వారిని దేశాధిపతి నిర్దాక్షిణ్యంగా అణగద్రొక్కాలని వేదం సూటిగా ప్రబోధిస్తూంది.
ఈవిషయంలో వేదం చాలా ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. ఒక మాటలో కత్తులు నూరండి. అన్నంత తీవ్రభాషలో ‘ఏషా మహమాయుదా సం స్యామి’ అథ వే. 31-13-5 ‘‘నేను మా రాజుల ఆయుధాలను పదును పెడుతున్నాను’’ అని పైవారిపై ఆగ్రహం కలిగిన తీవ్రవాది వచనంగా ఆవిష్కరించింది. ఆయుధాలు పదును పెట్టడం ఎవరికోసం? ప్రభువు కోసమే కదా.

- ఇంకా ఉంది