స్వాధ్యాయ సందోహం

స్వాధ్యాయ సందోహం-15

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హిందీ మూలం: స్వామీ వేదానంద తీర్థ
తెలుగు అనువాదం: డా పాలకోడేటి జగన్నాథరావు
*
యోగవిద్యలో సిద్ధపురుషుడైన దయానంద సరస్వతి తమ సత్యార్థ ప్రకాశ తృతీయ సముల్లాసంలో యోగవిద్య ప్రాముఖ్యాన్ని ఇలా తెలియజేశారు.
‘‘మనిషి ప్రాణాయామాన్ని అభ్యసించే సమయంలో ప్రతిక్షణం మనస్సును కూడ ఆవరించియున్న మాలిన్యమంతా తొలగి చిత్తశుద్ధి ఏర్పడి అతనిలో జ్ఞాన జ్యోతులు ప్రకాశిస్తాయి. ఆత్మకు ముక్తి లభించనంతవరకు క్రమంగా బంగారం నిప్పులో కరిగించినపుడు మలినాలు తొలగిపోయి శుద్ధమై ఎలా ప్రకాశిస్తూ ఉంటుందో అలా ఆత్మ ప్రకాశం దినదినప్రవర్థమానవుతూ వెలుగుతూ ఉంటుంది.. ప్రాణాలు తన వశమైనంతనే మనస్సు మరియు ఇంద్రియాలు కూడా స్వాధీనంలోనికి వస్తాయి. బలం మరియు చతుర్విధ పురుషార్థాలు అభివృద్ధి పొంది బుద్ధి సునితమైన చురుకుగా పనిచేయగలదు. తద్వారా కఠినమైన, సూక్ష్మమైన సర్వ విషయాలను సులభంగా గ్రహించగలుగుతుంది. దీనివలన మనుష్యుల దేహంలో వీర్యమభివృద్ధి పొంది సుస్థిరబలమూ -పరాక్రమమూ- జితేంద్రియతా సిద్ధిస్తాయి. సర్వశాస్త్రాలను ఏకసంథాగ్రాహకత్వ బుద్ధి వైభవంతో స్వల్పకాలంలో గ్రహించగల సమర్థత ఏర్పడుతుంది. పురుషులవలె స్ర్తిలు కూడా యోగాభ్యాసం చేసి యిట్టి యోగసిద్ధిని పొందుటకు అర్హులే.
ఈ రీతిగా ప్రాణాయామ ప్రాముఖ్య కథన విషయంలో వేదం, పతంజలి దయానందులు ఏకాభిప్రాయం కలిగియున్నట్లు స్పష్టమవుతూ ఉంది.
ఆయన ముందు సూర్యుడుకూడా ప్రకాశింపడు
యద్ ద్యావ ఇంద్ర తే శతం శతం భూమీరుత స్యుః
న త్వా వజ్రిన్ త్సహస్రం సూర్య అను న జాతమష్ట రోదసీ
భావం:ఓ పరమాత్మా! నీవు సంకల్పించి సృష్టించిన ఎన్నో ఊర్థ్వలోకాలు పృథివీలోకాలు అంతరిక్షంలోగల అనేక లోకాలు, అనేక సూర్యమండలాలు నిన్ను సమీపింపజాలకున్నాయి.
వివరణ:సృష్టిలోని కొన్ని స్వయం ప్రకాశకాలు మరికన్ని పరః ప్రకాశకాలు. సూర్యుడు, నక్షత్రాలు స్వయంప్రకాశకాలు. భూమి, చంద్రుడు పరతః ప్రకాశకాలు. అన్నీ సూర్యుని కాంతిచేతనే ప్రకాశిస్తాయి. వేదంలో ఈ రెండు విధాలయిన లోకాలను ద్యావాపృథివీ, భూమ్యాకాశాలు, ద్యావా భూమి, సూర్యచంద్రులు ఇలా వివిధ నామాలతో వ్యవహరింపబడతాయి. ఈ లోకాల మహత్వం మహోన్నతం. ఎందుకంటె- భూమిపై కోట్లకొలది ఏండ్లుగా మనుషులు, పశువులు, పక్షులు, కీటకాలు, పురుగులు, మృగాలు, పాములు మొదలైన జీవకోటి తమ ఆహారాన్ని పొందుతూ జీవిస్తున్నాయి. అయినా తల్లి వసుంధర (్భమి) నేటికీ వివ్వాసాన్ని పోషిస్తూనే వుంది. ముందు కూడా అట్లే ఉండగలదు. భూమికి మరో పేరు ‘రసా’. ఎందువలన అంటే భూమిలో మధురం, చేదు, పులుపు, వగరు, కారం, కషాయం అనే షడ్రుచులు ఉన్నాయి. బంగారం, వెండి, లోహాది ధాతు, ఉపధాతువుల గనిగా కూడ భూమి ఘనత వహించింది. అంతేకాదు. ధగధగ నిగనిగ మెరిసే రాళ్లు. మెత్తని మట్టి, ఇసుక మైదానాలతో ఈ నేలంతా నిండియుంది. కొన్నిచోట్ల మైళ్లకొలది ఎత్తున్న పర్వతాలతో వ్యాపించి యుంది. మరికొన్ని చోట్ల లోతైన మహాసాగరాలతో గంభీరంగా కనబడుతుంది. చాలా చోట్ల నదీ నదాల గలగలతో రమణీయంగా ఉత్తుంగ సముద్ర తరంగాలతో ఆకర్షణీయంగా ఉంది. ఒకప్రక్క సస్యశ్యామల వర్ణంతో సుందరంగా కనువిందు చేస్తుంటే మరొకప్రక్క జల శూన్యమై ఇసుక ఎడారిగా భీతి కలిగిస్తూ ఉంది. సృష్టి ఆరంభం నుండి నేటివరకు వైజ్ఞానికులు తమ శక్తితకొలది పరిశోధించినా ఈ భూమి ఆద్యంతాలను కనుగొనలేకపోయారు.
*