స్వాధ్యాయ సందోహం

స్వాధ్యాయ సందోహం-43

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంతేకాక సర్వవ్యాపకుడైన ఆ విరాట్ స్వరూపుడు ఏ కర్మకు- ఎవరికి ఎట్టి ఫలాన్ని అనుగ్రహించాలో కూడ సంకల్పిస్తాడు. ఆ విధంగా జీవులకు కర్మఫలప్రదాతయై యుంటాడు అన్న సద్భావనతో వారు జీవిస్తూ ఉంటారు. అట్టి సజ్జన జీవనంతో వారి పాపకర్మఫలాలు దగ్ధమైపోతాయి. ఇట్టి విజ్ఞానం సర్వజన సాధారణంకాదు. అందుచేత జీవులు తమ నైసర్గిక అజ్ఞానం వలన పాపకూపంలో పడగొట్టే పాపకృత్యాలను చేసేందుకు సిద్ధపడుతూ ఉంటారు. ఇట్టి దురవస్థనుండి ముక్తిపొందాలని కాంక్షించే జీవులు దైవధ్యానం విధిగా చేయాలి. దైవధ్యానం వలన కామక్రోధాది అరిషడ్వర్గం నశిస్తుందని మనువు ‘‘్ధ్యనేశానీశ్వరాన్ గుణాన్’’ (మనుధర్మ. 6-72) అని ఎప్పుడో హెచ్చరించాడు.
30. ధ్యానయోగులకే జ్ఞానజ్యోతి
ఉచ్ఛన్నుషసః సుదినా అరిప్రా ఉరు జ్యోతిర్వివిదుర్ద్ధ్యీనాః
గవ్యం చిదూర్వముశిజో వి వవ్రుస్తేషామను ప్రదివః సస్రురాపః॥ ఋ.7-90-4.
ప్రతిపదార్థం:- ఉచ్ఛనుషసః= వెలుగును అంటె విద్యను వ్యాపింపచేసేవారు; సుదినాః = శాస్త్ర నియమానుసారం పవిత్ర దినచర్యను పాటించేవారు; అరిప్రాః = దోషాలు లేక; దీధ్యానాః= నిరంతర ధ్యాన తత్పరులు; ఉరు= గొప్ప; జ్యోతిః= శాంతిదాయకమైన జ్ఞానాన్ని వివిదుః= పొందుతారు; ఉశిజః= పరహితాన్ని కోరే ఆలోచనలు గలవారు; గవ్యమ్= ఇంద్రియ సంబంధమైన; ఊర్వమ్= మిక్కిలి బలాన్ని; చిత్= కూడ; వివవ్రుః= బాగా పొందగలరు; తేషామ్= వారి; ప్రదివః+ అను= జ్ఞానరూపమైన శాంతి అనే; ఆపః=జలాన్ని; సస్రుః= ప్రవహింపచేస్తారు;
వివరణ:- వేదం ఎన్నో విద్యలకు గని. అయినా ప్రధానంగా బ్రహ్మవిద్యకే ప్రాధాన్యమిస్తూ ఉంది. ఈ విషయానే్న వక్కాణిస్తూ స్వామి దయానంద సరస్వతి తమ ఋగ్వేదాది భాష్యభూమికలో ఇలా చెప్పారు.
సర్వేషాం వేదానాం ముఖ్యం తాత్పర్యం బ్రహ్మణ్యేవాస్తి. క్వచిత్ సాక్షాత్ క్వచిచ్చ పరంపరయా, న కస్మింశ్చిదపి మంత్రే ఈశ్వరార్థత్యాగో అస్తి॥
భావం:- సమస్త వేదాల ముఖ్య తాత్పర్యం బ్రహ్మవిద్య లేదా పరమాత్మ తత్త్వప్రతిపాదనమే. సాక్షాత్తుగా గాని- పరంపరగా గాని పరమేశ్వరార్థాన్ని విడిచిన మంత్రం వేదాలలో లేదు. అంటే- పరతత్త్వం కంటె భిన్నమైన మంత్రం వేదంలో ఎక్కడైనా ఏదైనా కనబడితే దానిని పరమాత్మ అధిష్ఠాన దేవతావర్ణన గల మంత్రంగా భావించాలి. ఆ విధంగా కూడ వేదం ముఖ్యంగా బ్రహ్మవిద్యనే వర్ణిస్తూ ఉందని గ్రహించాలి. జీవుడు- ప్రకృతి- బ్రహ్మల సత్యస్వరూప జ్ఞానాన్ని కలిగించి ప్రకృతివలన కలిగే బంధనాలనుండి రక్షించి జీవులకు బ్రహ్మసాక్షాత్కారాన్ని కలిగించడమే బ్రహ్మవిద్య ప్రయోజనం. అట్టి బ్రహ్మ విద్యాసాధనం ప్రధానంగా ధ్యానమే. ఈ మంత్రంలో వర్ణింపబడినది ఈ ధ్యాన విషయమే. ఇంకావుంది...

హిందీ మూలం: స్వామీ వేదానంద తీర్థ తెలుగు అనువాదం: డా పాలకోడేటి జగన్నాథరావు