స్వాధ్యాయ సందోహం

స్వాధ్యాయ సందోహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భూమ్యాకాశాలు, అంతరిక్షం, పర్వతాలు, సముద్రాలు వీనితో కూడిన సర్వజగత్తులోని సామర్థ్యాన్ని ఒక్కసారి పరిశీలించండి. సమస్త జీవులను పోషిస్తుంది కాబట్టి భూమికి పూష అని పేరు. అందుకే వేదాలు భూమిని మాతగా ప్రశంసించాయి. మహామహా భారవంతమైన మహా పర్వతాలను, నదీ నదాలను, సముద్రాలను భూమి తన గుండెలపై పెట్టుకొని వహిస్తూంది. వీనినే కాక అనేక వస్తుజాలాన్ని కూడ భూమి వహిస్తూంది. అట్టి ఈ భూమి శక్తి ఎంతయో ఎవరు గణించగలరు? భూమి విషయమిట్లుండగా ఆకాశం చూడండి. ఎంత విశాలమైనదో. అది భూమి కంటె లక్షల రెట్లు పెద్దది. ఆ ఆకాశంలో ‘సప్తదిశో నానా సూర్యాః’ (ఋ.9-114-3) ‘‘ఏడు దిక్కుల అనేక సూర్యులున్నారు’’అని ఋగ్వేదం చెప్పినట్లుగా అనేక సూర్యులు వెలిగిపోతూ ఉన్నారు. సూర్యులేగాక గ్రహాలు, ఉపగ్రహాలు, నక్షత్రాలు, ఋషి మండలాలు ఇంకా ఎన్నో ఎన్నో ఆకాశంలోనే ఉన్నాయి. నిజానికి ఆకాశానికి కూడ హద్దులున్నాయి. కాని మానవుడు ఆ హద్దులనింతవరకు కనిపెట్టనే లేదు. అలా అనంతమైన ఆకాశం భూమివలె ఎంతో శక్తివంతమైనది.
కంటికి కానవచ్చే ఈ పదార్థ జాతాన్ని అటుంచండి. భూమిలో ఎనె్నన్ని అగ్నిపర్వతాలున్నాయి. అలాకాక భూమిపై ఒక్కొక్కచోట ఒక్కొక్క వాతావరణ విశేషాలు ఎనె్నన్ని ఉన్నాయి? ఈ అన్నింటి శక్తిని మాటలలో చెప్పసాధ్యమా? ఇవన్నీ ప్రశాంతంగా ఉన్నప్పుడు ఆ ఆనందానికి అవధులుండవు. మరి వానికి అవధులు దాటిన ఆగ్రహమే చూడండి ‘శృణాతి’ ఎంతటి విధ్వంసం సృష్టింపబడుతుందో!! సృష్టిలో స్థిరంగా ఉండే ‘వీళురుజతి స్థిరాణి’ పర్వతాదులను సహితం ఎంత విధ్వంసానికి గురిచేస్తాయో! మన్యుశబ్దానికి లౌకిక భాషలో క్రోధమని సామాన్యార్థం.

- ఇంకాఉంది

హిందీ మూలం: స్వామీ వేదానంద తీర్థ తెలుగు అనువాదం: డా పాలకోడేటి జగన్నాథరావు 9490620512