స్వాధ్యాయ సందోహం

స్వాధ్యాయ సందోహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘ప్రభో! నీ మహిమతో సమానమైన మరియు నీతో తుల్యమైన ధనం ఏమీ నాకు తెలియదు’’ ‘పతిర్బభూథా సమో జనానామేకో విశ్వస్య భువనస్య రాజా’ (ఋ.6-36-4) ‘‘ఈ జగత్తులో సాటిలేని పాలకుడవు నీవే. అఖండ విశ్వానికి నీ వొక్కడవే చక్రవర్తివి’’అని అంత నిశ్చతాభిప్రాయానికి వస్తాడు.
అట్టివాడే నిజమైన ‘బ్రహ్మవాహి’. అతడు సదా మహామహుడైన ఆ భగవత్ప్రభువును సదా అర్చిస్తూ ఉంటాడు.
**
సర్వేశ్వరా! నిన్ను తెలుసుకొన్నవారు
ఏ కొందరో!
ఇచ్ఛంతి త్వా సోమ్యాసః సఖాయః సున్వంతి సోమం దధతి ప్రయాంసి
తితిక్షంతే అభిశస్తిం జనానామింద్ర త్వదా కశ్చన హి ప్రకేతః॥

భావం:- ఓ సర్వేశ్వరా! శాంత స్వభావులు మిత్రులుగా కూడి నినే్న కోరుకొంటారు. నీ మిత్రత్వానికై సోమయజ్ఞాన్ని చేస్తారు. చాల శ్రమలకు ఓర్చుకొంటారు. చాలా శ్రమపడతారు. ఇతరుల నిందలను, క్రూరతను సహిస్తారు. కాని కొద్దిమంది మాత్రమే నీనుండి జ్ఞానాన్ని తెలుసుకొంటారు.
వివరణ:- భగవంతుణ్ణి కోరుకొనేవారు లోకంలో చాలామంది. ఈ కోరుకోవడం చాలావిధాలుగా ఉంటుంది. దానిని ఈ మంత్రం వివరంగా వర్ణిస్తూంది.
ఇచ్ఛంతి త్వా సోమ్యాసః సఖాయః:- మిత్ర భావాన్ని వహించి భగవంతుని దర్శించాలని శాంత స్వభావులందరు కోరుకొంటారు. ఎందుకంటే-
సుస్వంతి సోమమ్:- ఆ శాంత స్వభావులు సోమయజ్ఞాన్ని చేస్తారు. ‘ఏకః పరుప్రశస్తో అస్తి యజ్ఞైః’ (ఋ.6-34-2) ‘‘యజ్ఞాల ద్వారా ప్రశంసితుడై ఆరాధింపబడేవాడు. ఆ భగవానుడొక్కడే’’అని వారికి బాగా తెలుసు. యజ్ఞాలలో చేయబడే కర్మానుష్ఠానంతోబాటుగా మంత్రాలలో ఆ భగవానుని మహిమావర్ణనయే ప్రధానంగా ఉంటుంది. మరియు నిష్కామభావంతో చేయబడే యజ్ఞోద్దేశ్యం కూడా భగవానుడే.
దధతి ప్రయాంసి:- ‘‘తపస్సుచేస్తారు’’అని ఈ వాక్యానికర్థం. భగవస్సాక్షాత్కారానికి తపస్సు ప్రధాన సాధనం. తపస్సును గురించి కఠోపనిషత్తు ఇలా చెప్పింది.
సర్వే వేదా యత్పదమామనంతి తపాంసి సర్వాణి చ యద్వదంతి
యదిచ్ఛంతో బ్రహ్మచర్యం చరంతి తత్తే పదం సంగ్రహేణ బ్రవీమ్యోమిత్యేతత్‌॥
కఠోపనిషత్తు 1-2-15.
‘‘వేదాలన్ని ఏ పరమ పదాన్ని లేదా గమ్యాన్ని వక్కాణిస్తూ ఉన్నాయో, సమస్తమైన తపస్సులు దేనిని ప్రకటిస్తున్నాయో, దేనిని కోరుతూ జ్ఞానానికి- తపస్సుకు అంకితమైన ఆత్మ నిగ్రహయుక్తమైన జీవితాన్ని గడుపుతాడో ఆ పదాన్ని లేదా గమ్యాన్ని నీకు సంగ్రహంగా వివరిస్తాను. అదే ఓమ్ అన్నది’’. సంపూర్ణమైన తపస్సుకు లక్ష్యం పరమాత్మయే. బ్రహ్మచర్య శబ్దానికర్థం బ్రహ్మ=్భగవంతుడు; చర్యం= గమ్యుడైనవాడు ఏ క్రియ ద్వారా ఆ భగవానుడు తెలియబడతాడో ఆ క్రియయే బ్రహ్మచర్యం.
‘తితిక్షంతే అభిశస్తిం జనానామ్’ ఇతరులు చేసే నిందను, దూషణను, ఆక్షేపణలను, కాఠిన్యాన్ని సహించేవారు అని అర్థం. ఇట్టివారు లోకంలో చాల అల్పసంఖ్యాకులుగా ఉంటారు. అట్టి మహనీయులను ‘త్వదా కశ్చన హి ప్రకేతః’ ‘‘లోకంలో కొద్దిమంది మాత్రమే గుర్తిస్తారు’’ ఈ మాటను యముడు నచికేతునితో ‘ఆశ్చర్యో- స్యలబ్ధా’ (కఠ.ఉ.) అట్టివాడు లభించడం దుర్లభమేనని అంటాడు. కాని అసాధ్యం మాత్రం కాదు. అయితే భగవద్దర్శనాభిలాషతో జీవించడం కూడ అంత సులభం కాదు. అందుకే అట్టివారు లోకంలో కొద్దిమందియే.
** - ఇంకాఉంది

హిందీ మూలం: స్వామీ వేదానంద తీర్థ తెలుగు అనువాదం: డా పాలకోడేటి జగన్నాథరావు 9490620512