స్వాధ్యాయ సందోహం

స్వాధ్యాయ సందోహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వానినన్నింటిని మనకంటెముందే హృదయస్థుడైన సర్వేశ్వరుడు సాక్షిగా చూస్తూనే ఉంటాడు. మరియు మనంచేసే కర్మలకు ప్రత్యక్షసాక్షిగా కూడ ఉంటాడు. ఈ ఎరుక కలిగియుండడమే ఉపాసన. సామవేదం సూచించిన ఈ అర్థానే్న శుక్లయజుర్వేదం ‘విశ్వాని దేవ వయునాని విద్వాన్’ (శు.య.40-16) ‘‘ఓ దేవా! నీవు మా సమస్త ఆచారాలనేకాదు విచారాలనుగూడ తెలిసినవాడవు’అని పునరుద్ఘాటించింది. కాబట్టి ఉపాసన అంటే దైవ సమీపంలో మనం ఉండటమేకాదు. దైవం మన సమీపంలో ఉందనే జ్ఞానం కలిగి భక్తినిష్ఠలతో దైవారాధన చేయడమే వేదోపదేశమని గ్రహించాలి.
వాచస్పతీ!
నాలో సమస్త శక్తులను నింపు
యే త్రిషప్తాః పరియంతి విశ్వా రూపాణి బిభ్రతః
వాచస్పతిర్బలా తేషాం తన్వో అద్య దధాతు మే॥ ॥ 1-1-1॥
భావం:- సత్వం, రజస్సు, తమస్సు అనే త్రిగుణాలు మరియు మహత్తత్త్వం- అహంకారం, రూప, రస, గంధ, శబ్ద, స్పర్శలనే ఈ ఏడు తత్త్వాలు అనేక జీవ మరియు పదార్థరూపాలను ధరించి సర్వత్ర వ్యాపించియున్నాయి. వాటి బలాలను ఈనాడే పరమేశ్వరుడు నాకు అనుగ్రహించుగాక!
వివరణ:- సత్యం, రజస్సు, తమస్సు అనే మూడు సర్వజీవులలో ఉండే ప్రధాన గుణాలుగా ప్రసిద్ధం. వేదాంతులు వీనినే త్రిగుణాలుగా చెబుతారు. సత్వగుణం తేట అయిన ప్రకాశవంతమైన గుణం. రజోగుణం చురుకుతనాన్ని సూచించే గుణం. తమోగుణం సోమరితనానికి- స్తబ్ధతకు- విషయ లౌల్యానికి ప్రతీక. ఈ త్రిగుణాలనుండి మహత్తత్వం, అహంకారం, శబ్ద, రస, రూప, గంధ, స్పర్శలు అనే ఏడు వికృతులు ఉద్భవిస్తాయి. ఈ ఏడింటిలో ఈ సత్వ, రజస్తమో గుణాలు కొన్నింటిలో ఎక్కువగా, కొన్నింటిలో తక్కువగా, కొన్నింటిలో సమానంగా ఉంటూ ఉంటాయి. ఈ ఏడు వికృతులతో కూడిన త్రిగుణాత్మక ప్రకృతి లేని జీవ మరియు పదార్థాలు సృష్టిలో ఎక్కడా ఒక్కటి కూడా లేదు. ప్రకృతి తత్త్వాన్ని వివరించే సందర్భంలో ఇదే విషయాన్ని ‘ఏషా పురాణీ పరి సర్వం బభూవ’ (అథ.వే.10-8-30) ‘‘ఈ పురాణీ= సనాతనమైన ప్రకృతి సమస్తకార్యాలలో సంపూర్ణంగా నిలిచియుంటుంది అని అథర్వణవేదం వివరించింది.
సూర్య, చంద్ర, తార, పృథివి మొదలైన పదార్థాలు ప్రకృతి కార్యాలు. అవి ఎంతో శక్తివంతమైనవి. ఆ అన్నింటిలోగల సమస్త శక్తిని తనకు అనుగ్రహించమని ‘వాచస్పతిర్బలా తేషాం తన్వో అద్య దధాతు మే’ ‘‘వేదాధీశ్వరుడైన భగవంతుడు వానిలోని బలాన్ని నేడే నా కనుగ్రహించుగాక’’అన్న సాధకుని ప్రార్థన ఈ మంత్రంలో కనబడుతుంది.
అథర్వణ వేదంలోనే మరో సందర్భంలో ‘యస్య త్రయంస్ర్తీంశత్ దేవా ఙ్గగాత్రా విభేజిరే’ (అథ.10-7-27) ముప్పది మూడు ‘‘దేవతలు ఎవరి శరీరంలో ఉపనిష్ఠులై సేవిస్తున్నారో’’అని వివరించింది.
ఇంకా ఉంది

హిందీ మూలం: స్వామీ వేదానంద తీర్థ తెలుగు అనువాదం: డా పాలకోడేటి జగన్నాథరావు 9490620512