స్వాధ్యాయ సందోహం

స్వాధ్యాయ సందోహం-45

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శుక్రమ్= జ్ఞాన బలరూపమైన తేజస్సును; యజతమ్- హృదయగతంగా చేసికొంటున్నాను.;
భావం:- అగ్నిరూపుడైన భగవంతుని తల్లి-తండ్రి-సోదరుడు- మిత్రుడుగా స్వీకరిస్తున్నాను. జీవనప్రదాయకమైన అట్టి భగవానుని మహాతేజస్సు సదా పూజార్హమైనది. జ్ఞానబలరూపమైన పరమాత్మ సూర్యాగ్ని తేజస్సును సదా హృద్గతంగా చేసికొంటున్నాను.
వివరణ:- లోకంలో వందల వేలమంది మన కళ్లఎదుట తిరుగుతూ కనబడుతూ ఉంటారు. వారందరు మనకు మన బంధువులవలె ప్రియమైన వారు కారు. వారిలో ఏ ఒక్కరినీ ప్రీతితో మన బంధుజనులను పలకరించినట్లు పలకరించం. మరి బంధువులయితేనో ఎంతో ప్రేమతో మాట్లాడతాం. ఆ బంధువులకంటె తల్లి-తండ్రి-సోదరుడు మొదలగు ఆత్మీయుల ఎడల ఎంతో ప్రీతిని ప్రకటిస్తాం.
లోకం తీరు ఇంతే. కాని ఆ తల్లి-తండ్రి-సోదరుడు- మిత్రుడు మొదలైన ఆత్మీయులైన వారందరూ ఏదో ఒకరోజు మనను శాశ్వతంగా విడిచిపోయే రోజు వస్తుంది. కాని పరమాత్మ ఎట్టిపరిస్థితులలో కూడ మనను విడిచిపోడు. తల్లి- తండ్రి లేని అనాథలనే గాదు లోకమే నిస్సారమని- లౌకిక సంబంధాలన్ని మోక్షబంధన హేతువులని భావించే నిస్సంగులను (వేదాంతులు) సహితం తల్లిగా తండ్రిగా పరమాత్మయే సంరక్షిస్తాడు. ఆ పరమాత్మ దివ్యవాత్సల్యభావానే్న ‘‘అగ్నిం మనే్య పితరమ్... సఖాయమ్’’అన్న వాక్యంలో ఒక అనన్య శరణాగతుడైన వాని దైవ ప్రార్థనగా ఈ మంత్రం వివరించింది.
మాతాపితలయినా బంధువులయినా తమవారి అభివృద్ధికే తోడ్పడతారు. కాని పరమేశ్వరునిలో అట్టి స్వార్థచింతనకు తావులేదు. ఆయన సమస్త జీవకోటి పురోభివృద్ధికి తోడ్పడతాడు. దానికి తగిన తోడ్పాటు సామగ్రిని కూడ సమకూరుస్తాడు. అందుకే జీవులకాదైవం నిజమైన తల్లి-తండ్రి- సోదరుడు- స్నేహితుడు. పై మంత్రాన్ని దృష్టిలోపెట్టుకొని ఒక కవి ఈ భావానే్న ఈ విధంగా వర్ణించాడు.
తత్వమేవ మాతా చ పితా త్వమేవ, త్వమేవ బంధుశ్చ సఖా త్వమేవ
త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ, త్వమేవ సర్వం మమ దేవదేవ॥
భావం:- ఓ దేవదేవ! నీవే తల్లివి. తండ్రివి. బంధువు. మిత్రుడవు. నీవే జ్ఞానం. నీవే ధనం. నాకు సర్వస్వమూ నీవే.
అందుకే వేదర్షి రుూ మంత్రంలో ‘‘అగ్నేరనీకం...సూర్యస్య’’అని ప్రబోధించాడు. అంటే ఓ మానవుడా! మనిషిగా నిత్యం భగవత్సంబంధం కలిగియుండు. ఇక ప్రపంచంలో నీవు పొందదగినది మరేమీ ఉండదు. ఆయన మహాతేజోవంతుడు. ఆ తేజం పాపనాశకం. కాబట్టి ఆయన పూజనీయుడు. ఆ మహాదేవుని తేజస్సు లోకంలో మరెక్కడాలేదు. అది నీ హృదయాకాశంలోనే ప్రకాశిస్తూ ఉంది. ఆ భగవత్తేజం నీలోని మనోమాలిన్యాలను ప్రక్షాళనం చేస్తూంది. నీలోనే ఉన్న ఆ తేజస్సును గుర్తించి దానితో నీవు తాదాత్మ్యం వహించు అని మంత్ర భావార్థం.
కాబట్టి హృదయ వీధిలో దర్శింపదగిన ఆ మహాదేవుని లోకంలో అన్నిచోట్ల అనే్వషింప ప్రయత్నిస్తే నీలోనుండి ఆయన బయటకు నిష్క్రమిస్తాడు. అందుచేత నీవే ఆయనను నీవాడుగా చేసుకొంటే ఆయన నీవాడు అవుతాడు. నీకు నిత్యబంధువు ఆయనొక్కడే అని వేదమంత్రోపదేశం. ఇంకావుంది...

హిందీ మూలం: స్వామీ వేదానంద తీర్థ తెలుగు అనువాదం: డా పాలకోడేటి జగన్నాథరావు