స్వాధ్యాయ సందోహం

స్వాధ్యాయ సందోహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హిందీ మూలం: స్వామీ వేదానంద తీర్థ తెలుగు అనువాదం:
డా పాలకోడేటి జగన్నాథరావు 9490620512
*
ఈ మర్త్యలోకమంటే దేవతలకు ప్రియమే
అయం లోకః ప్రియతమో దేవానా మపరాజితః
యస్మై త్వమిహ మృత్యవే దిష్టః పురుష జజ్ఞిషే
స చ త్వాను హ్వయామసి మా పురా జరసో మృథాః॥

భావం:- ఓ మానవుడా! నీ దేహం, నీవు జన్మించిన భూమి మరణశీలమైనది. ఆ విధంగా ఈ భూమి నీ దేహం మృత్యుదేవత కర్పింపబడినది. కాని మరణాన్ని జయించితే నీ దేహం ఈ లోకం పరాజితం కానిదవుతుంది. అట్టి నీ దేహం మరియు లోకం దేవతలకు ప్రీతి అయినదైతే నీ మరణం కూడ నీకు అనుకూలమే అవుతుంది. నీవు వృద్ధాప్యానికి ముందు మరణించవద్దని ఆశీర్వదిస్తున్నాం.
వివరణ:- పాపపుణ్యకర్మల ననుభవిస్తూ జన్మ-మరణరూపమైన సంసార సాగరాన్ని అధిగమించేందుకు ఆత్మ మర్త్యలోకంలోనికి మరల మరల వస్తుంది. అలా వచ్చినప్పుడల్లా ‘మృత్యవే దిష్టః’మృత్యువున కర్పింపబడిన దేహమే మరల ఈయబడుతుంది.’ అలా ఆత్మకీయబడిన దేహం పుట్టినదై ‘జాతస్య హి ధ్రువో మృత్యుః’అన్న వచనానుసారం ఏదో ఒకనాడు మరల మరణిస్తుంది. మరి ఆత్మ సంసార సాగరాన్ని అధిగమించే దెప్పుడు? ఈ ప్రశ్నకు సమాధానంగా అథర్వణవేదం ‘అనుహూతః పునరేహి విద్వానుదయనం పథః’ (అథ.వే.5-30-7)
మృత్యుదేవత చేత పిలువబడిన ఓ ఆత్మా! నీవెళ్లు. అనివార్యమైన ఆ పయనాన్ని గ్రహించి మరల ఈ లోకంలోనికి ఉన్నత మార్గాన తిరిగిరా!’’ అని మృత్యుసందేశాన్ని తెలిపింది. అంటే జన్మ మరణాలు సంభవిస్తూ ఉండటం సహజం. కాని భవిష్యజ్జన్మ ఉత్తమంగా, ఉన్నతంగా ఉండే సంచిత ఫలాలను (పూర్వజన్మలో చేసిన ప్రస్తుత జన్మకు వెంట తెచ్చుకొనే కర్మఫలాలు) సంపాదించుకొని రమ్మని దాని అంతరార్థం.
‘భూలోకంలో ఉన్నత జీవనమే జన్మకు ప్రధాన లక్ష్యం’అని అథర్వణ వేదమీ విధంగా నిర్దేశిస్తూంది.
‘ఆరోహణ మాక్రమణ జీవతో- యనమ్’ (అథ.వే.5-30-7) ‘‘పైకి లేచి ముందుకు సాగడమే ప్రతి జీవికి ప్రధాన లక్ష్యం.’’ అలా వేదోపదేశానుసారం ఉన్నత జీవిత లక్ష్యానికి అభిముఖంగా సాగడమే మనిషి కర్తవ్యం. కాదు. క్షణంముందు దానికంటే ఉత్తమంగా తీర్చిదిద్దుకోబడినపుడే జీవిత లక్ష్యం సార్థకమవుతుంది. అలా సార్థకం చేసుకొన్న మానవుడే అపరాజితుడయిన వాడు. అనగా మృత్యువును జయించినవాడు. అట్టి మానవుడంటేనే దేవతలకు ప్రియుడు.’’ ‘అయం లోకః ప్రియతమో దేవానామపరాజితః’అని వేదం నిర్దేశించింది. అపరాజితుడై దేవతలకు ప్రియమైనవాడుగా ఈ నీ శరీరంలో చిరకాలముండుము’’ ‘మా పురా జరసో మృథాః’ ‘‘వృద్ధాప్యానికి ముందు మరణించకు’’ మంటూ వేదం దీర్ఘాయుష్మంతుడవు కమ్మని దీవించింది.
సరే. అలా వృద్ధాప్యానికి ముందు మరణించకుండా ఉండటం మనిషి చేతిలో ఉందా? మృత్యువేక్షణంలోనైనా కబళించవచ్చుకదా? అని శంక కలుగవచ్చు. అథర్వణవేదం ఈ సందేహాన్ని నివృత్తిచేస్తూ మృత్యువునకు ప్రధాన కారణం-
అఘ శంసదుః శంసాభ్యాం కరేణానుకరణే చ
యక్ష్మం చ సర్వం తేనేతో మృత్యుం చ నిరజామసి॥ అథ.12-2-2॥
‘‘పాప చింతన, దురాచార చింతన మరియు దుష్కర్మానుసరణ ఇవే రోగ హేతువులై మృత్యుకారకమవుతున్నాయి’’అని హెచ్చరించింది. మాటలు వేరయినా వైద్యులు చెప్పే కారణాలివేగదా. ఈ మృత్యుమర్మాన్ని గ్రహించి సదాచార- సద్భావనాపరుడై జీవిత లక్ష్యమైన ఆత్మోద్ధరణకు ప్రయత్నించే మానవుడంటే అతడు మరణశీలుడే అయినా దేవతలకు ప్రియుడే. అతడు నివసించే మర్త్యలోకమన్నా దేవతలకు ప్రియమే.
***

ఇంకా ఉంది